Begin typing your search above and press return to search.

విడాకుల పుకార్లకు ఇలా చెక్‌ పెట్టారు...!

ఈ మధ్య కాలంలో తమిళ సినీ ఇండస్ట్రీలో హిట్ సినిమాల గురించి కాకుండా విడాకుల మేటర్ ఎక్కువగా వినిపిస్తుంది.

By:  Tupaki Desk   |   22 Jun 2024 11:00 AM GMT
విడాకుల పుకార్లకు ఇలా చెక్‌ పెట్టారు...!
X

ఈ మధ్య కాలంలో తమిళ సినీ ఇండస్ట్రీలో హిట్ సినిమాల గురించి కాకుండా విడాకుల మేటర్ ఎక్కువగా వినిపిస్తుంది. గడచిన రెండేళ్లలో దాదాపుగా డజను జంటలు బ్రేకప్‌ అయ్యాయి అంటే ఏ స్థాయిలో అక్కడ పరిస్థితి ఉందో అర్థం చేసుకోవచ్చు.

విడాకుల పుకార్లు అనేది కోలీవుడ్‌ లో చాలా కామన్ గా మారింది. అయితే కొన్ని పుకార్లు పుకార్లుగానే మిగిలి పోతే, కొన్ని మాత్రం కొన్ని రోజుల తర్వాత నిజంగా మారుతున్నాయి. తమ స్టార్స్ గురించి వచ్చిన, వస్తున్న విడాకుల పుకార్లు నిజం అవ్వద్దు అని కోరుకుంటున్న ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు.

గత కొన్ని రోజులుగా కోలీవుడ్‌ హీరో జయం రవి మరియు ఆయన భార్య ఆర్తి విడాకులు తీసుకోబోతున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి. ఇద్దరి మధ్య విడాకులకు కారణం ఏంటి అనే విషయంలో స్పష్టత లేదు కానీ కోలీవుడ్‌ మీడియాలో మాత్రం రకరకాల పుకార్లు షికార్లు చేశాయి.

జయం రవి కొత్తగా మరో హీరోయిన్‌ తో ప్రేమలో పడ్డాడు అనే ప్రచారం జరిగింది. కానీ అవేవి నిజం కాదని తేలిపోయింది. స్వయంగా ఆర్తి తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవు అన్నట్లు జయం రవికి సంబంధించిన ఒక పోస్టర్ ను షేర్‌ చేసి పుకార్లకు చెక్ పెట్టింది.

రవి హీరోగా నటించిన జయం సినిమా వచ్చి 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆర్తీ సోషల్‌ మీడియా ద్వారా స్పందించింది. ప్రేమ అనే పదం... ఇది మాటలు కాదు జీవితం అంటూ రాసుకొచ్చింది. ఆమె ఉద్దేశ్యం ఏంటి అనేది ఇప్పటికే అందరికీ అర్థం అయ్యింది.

విడాకుల పుకార్ల పై జయం రవి మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి స్పందన తెలియజేలేదు. పుకార్ల గురించి పట్టించుకోవాల్సిన పని లేదు అన్నట్లుగా ఆయన సన్నిహితులు ఆ మధ్య మీడియాతో చెప్పుకొచ్చారు. ఆర్తి తాజా పోస్టర్ తో విడాకుల పుకార్లకు బ్రేక్ పడ్డట్లు అయ్యింది. జయం రవి, ఆర్తీ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్న విషయం తెల్సిందే. పిల్లల కోసం వీరు కలిసి ఉండాలని ఫ్యాన్స్ కోరుకున్నారు.