Begin typing your search above and press return to search.

ట్రెడిషనల్ లుక్‌లో అషురెడ్డి గ్లామర్ సెల్ఫీ

అషురెడ్డి ఇటీవల సోషల్ మీడియాలో యమయాక్టివ్ గా హైలెట్ అవుతున్న విషయం తెలిసిందే.

By:  Tupaki Desk   |   10 Nov 2024 10:30 PM
ట్రెడిషనల్ లుక్‌లో అషురెడ్డి గ్లామర్ సెల్ఫీ
X

అషురెడ్డి ఇటీవల సోషల్ మీడియాలో యమయాక్టివ్ గా హైలెట్ అవుతున్న విషయం తెలిసిందే. ఎలాంటి ఫొటో పోస్ట్ చేసినా కూడా అందులో తన గ్లామర్ ను సరికొత్తగా హైలెట్ చేస్తోంది. ఇక రీసెంట్ గా అమ్మడు తన ట్రెడిషనల్ లుక్‌ను ప్రదర్శిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో మంచి రెస్పాన్స్ ను అందుకుంటోంది. లైట్ యెల్లో చీర, అందమైన ఎంబ్రాయిడరీ బ్లౌజ్ ధరించి తన లుక్‌ను మరింత స్పెషల్‌గా తీర్చిదిద్దారు.


సొగసైన ఆభరణాలతో సరదాగా ట్రెడిషనల్ లుక్‌కు ఫ్యాషన్ టచ్ జోడించారు. అలాగే స్పెషల్ టాటూ కూడా హైలెట్ చేస్తూ ఆమె క్యూట్ అండ్ కూల్ లుక్‌ను హైలైట్ చేస్తోంది. తమ అభిమానులకు ప్రతి యాంగిల్‌లో ఆశు రెడ్డి కొత్తగా కనిపిస్తుండడంతో పాజిటివ్ గా రియాక్ట్ అవుతున్నారు. ఇక ఆమె కెరీర్ విషయానికి వస్తే, అషురెడ్డి టాలీవుడ్ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది.

ముఖ్యంగా బిగ్ బాస్ షోలో పాల్గొనడం ఆమెకు మంచి బూస్ట్ ఇచ్చిందనే చెప్పాలి. రియాలిటీ షోలో తన ప్రదర్శనతో ప్రేక్షకులను మెప్పించడంతో పాటు అనేకమంది అభిమానులను సంపాదించుకుంది. అప్పటి నుంచి టాలీవుడ్ ఈవెంట్స్, సోషల్ మీడియా ద్వారా ఆమె యాక్టివ్‌గా ఉంటూ వస్తోంది. అయితే అషురెడ్డి సోషల్ మీడియా ఇన్ఫ్లుఎన్సర్‌గానూ తనకంటూ ప్రత్యేక స్థానం కల్పించుకుంది.

ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రతీ ఫోటో, వీడియోతో ట్రెండింగ్‌లో నిలుస్తూ కుర్రాళ్ళ హృదయాలను దోచుకుంటోంది. తన స్టైలిష్ ఫోటోషూట్లు, ట్రెడిషనల్ లుక్స్, గ్లామర్ అండ్ క్యూట్ మూవ్‌మెంట్స్‌తో నిత్యం ఫాలోవర్స్‌ను పెంచుకుంటోంది. అయితే ఆశు రెడ్డి కేవలం సోషల్ మీడియాలో మాత్రమే కాకుండా వెబ్ సీరీస్‌లు, షార్ట్ ఫిల్మ్స్‌లోనూ నటించే ఆలోచన చేస్తోంది. మరి ఆమె రాబోయే రోజుల్లో ఎలాంటి అవకాశాలు అందుకుంటుందో చూడాలి.