Begin typing your search above and press return to search.

అషు రెడ్డి గ్లామర్ మాయ.. స్టన్నింగ్!

సోషల్ మీడియాలో ఉండే వారికి ఆషురెడ్డి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

By:  Tupaki Desk   |   16 May 2024 3:58 AM GMT
అషు రెడ్డి గ్లామర్ మాయ.. స్టన్నింగ్!
X

సోషల్ మీడియాలో ఉండే వారికి ఆషురెడ్డి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. జూనియర్ సమంత అనే ఇమేజ్ తో షార్ట్ వీడియోల ద్వారా ఆషురెడ్డి పాపులర్ అయ్యింది. తరువాత టెలివిజన్ రియాలిటీషోలలో పార్టిసిపేట్ చేసింది. ఆమె పాపులారిటీతో రెండు సార్లు బిగ్ బాస్ షోలో పాల్గొనే ఛాన్స్ కొట్టేసింది. బిగ్ బాస్ తర్వాత ఆషురెడ్డి సెలబ్రెటీ ఇమేజ్ సొంతం చేసుకుంది.


ఆ తరువాత హోస్ట్ గా కూడా టీవీ, ఓటీటీ షోలు చేసింది. సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ ని ఆషురెడ్డి సొంతం చేసుకుంది. ఆర్జీవీతో చేసిన బోల్డ్ ఇంటర్వ్యూ ఆషురెడ్డికి ఊహించని ఇమేజ్ తీసుకొచ్చింది. కెరియర్ ఆరంభంలో బొద్దుగా ఉండే ఆషురెడ్డి ప్రస్తుతం స్లిమ్ లుక్ లోకి మారిపోయి బాలీవుడ్ బ్యూటీస్ కి పోటీ ఇచ్చే రేంజ్ లో గ్లామర్ షో చేస్తోంది.



జూనియర్ సమంత అనే ఇమేజ్ తో పాపులర్ అయిన ఆషురెడ్డి ఇప్పుడు అందాల ప్రదర్శనలో సమంతని మించిపోయిందనే మాట వినిపిస్తోంది. ఇన్ స్టాగ్రామ్ లో ఈ అమ్మడు ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. రెగ్యులర్ గా హాట్ హాట్ ఫోటోషూట్ లతో అందాల ప్రదర్శన చేస్తూ ఫ్యాన్స్ కి కావాల్సినంత వినోదాన్ని అందిస్తోంది. ఈమె గ్లామర్ షోతో సోషల్ మీడియాని షేక్ చేస్తోందని చెప్పాలి. హాట్ హాట్ భంగిమలతో ఫోజులిస్తూ కుర్రాళ్ళకి చెమటలు పట్టిస్తోంది.


ఇప్పటికే ఆమె జూనియర్ సమంత అనే ఇమేజ్ ని పూర్తిగా చెరిపేసుకొని ఆషురెడ్డి అంటే నెక్స్ట్ లెవల్ అనేలా ఫేమ్ పెంచుకుంది. అషురెడ్డి నటిగా కూడా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. చల్ మోహన రంగా సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించిన ఆషురెడ్డి బాయ్ ఫ్రైడ్ ఫర్ హైర్ అనే మూవీలో ఒక హీరోయిన్ గా నటించింది. ఏ మాస్టర్ పీస్ అనే సూపర్ హీరో మూవీలో ప్రస్తుతం నటిస్తోంది.


అలాగే మరికొన్ని సినిమాలు కూడా డిస్కషన్ స్టేజ్ లో ఉన్నాయి. ఇదిలా ఉంటే తాజాగా ఈ అమ్మడు బ్లూ కలర్ లాంగ్ డ్రెస్ లో స్విట్జర్లాండ్ స్ట్రీట్ లో సందడి చేస్తోంది. ఈ ఫోటోలని ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసుకుంది. బ్లూ కలర్ అవుట్ ఫిట్ లో హాట్ హాట్ ఫోజులుతో ఆషురెడ్డి షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ కాస్ట్యూమ్స్ లో ఆషురెడ్డి ఏంజిల్ లా ఉందంటూ ఆమె అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.