Begin typing your search above and press return to search.

అమ‌లాపురం బుల్లోడు ద‌గ్గ‌ర రెండు రెడీగా!

ఇటీవల రిలీజ్ అయిన `ఆయ్` సినిమా మంచి విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే.

By:  Tupaki Desk   |   23 Aug 2024 12:30 PM GMT
అమ‌లాపురం బుల్లోడు ద‌గ్గ‌ర రెండు రెడీగా!
X

ఇటీవల రిలీజ్ అయిన `ఆయ్` సినిమా మంచి విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. చిన్న సినిమాగా రిలీజ్ అయిన చిత్రం పెద్ద విజ‌యం సాధించింది. ఆగ‌స్టు 16న రిలీజ్ అయిన సినిమా ఆ ముందు రోజు రిలీజ్ అయిన మిస్ట‌ర్ బ‌చ్చ‌న్, డ‌బుల్ ఇస్మార్ట్ చిత్రాల్ని సైతం ప‌క్క‌కు నెట్టి వ‌సూళ్ల‌ను సాధించింది. `మ్యాడ్` త‌ర్వాత నార్నె నితిన్ కి ఇదో మంచి స‌క్సెస్ గా నిలిచింది. వ‌రుస‌గా రెండు విజ‌యాలు అందుకుని హ్యాట్రిక్ కి మైలు దూరంలో ఉన్నాడు.

అయితే ఆయ్ ఇంత పెద్ద స‌క్సెస్ అవ్వ‌డానికి కార‌కుడు ద‌ర్శ‌కుడు అంజి. అమ‌లాపురం కి చెందిన అంజి తాను చూసిన వాస్త‌వ సంఘ‌ట‌న‌లు ఆధారంగా పాత్రిల్ని సృష్టించి అంతే నిజాయిగా తెర‌కెక్కించ‌డంతోనే ఇది సాధ్య‌మైంది. ఇప్పుడీ డైరెక్టర్ ఎవ‌రంటూ అంతా ఆరా తీస్తున్నారు. తొలి సినిమాతోనే ద‌ర్శ‌కుడిగా తానేంటో నిరూపించుకోవ‌డంతో యువ నిర్మాత‌ల దృష్టంతా అంజిపై ప‌డింది.

అయితే అంజికి బేసిక్ గా కామెడీ సినిమాలంటే ఆస‌క్తి అని రివీల్ చేసాడు. జాతిర‌త్నాలు త‌ర‌హా కామెడీతో పాటు క‌థా బ‌లం ఉన్న సినిమాలు చేస్తే త‌ప్ప‌కుండా ప్రేక్ష‌కుల్ని మెప్పించొచ్చు అంటున్నాడు. భ‌విష్య‌త్ లో కూడా ఆత‌ర‌హా సినిమాలే చేస్తానంటున్నాడు. ప్ర‌స్తుతం అత‌డి ద‌గ్గ‌ర రెండు క‌థ‌లు సిద్దంగా ఉన్నాయ‌ని తెలిపాడు. వాటిలో హీరోల‌కు న‌చ్చిన క‌థ‌ల్ని చేయ‌డానికి సిద్దంగా ఉన్న‌ట్లు చెప్పాడు.

`ఆయ్` మంచి వ‌సూళ్లు తెస్తోన్న నేప‌థ్యంలో సెకెండ్ ఛాన్స్ ఈజీగానే వ‌స్తుంది. ఇప్ప‌టికే కొంత మంది నిర్మాత‌లు అంజి కోసం క‌ర్చీప్ వేసి ఉంటారు.హిట్ అందుకుంటే న‌యా బ్యాన‌ర్లే ద‌ర్శ‌కుల వెంట ప‌డ‌తాయి. దిల్ రాజు లాంటి నిర్మాత‌లు ఇలాంటి వారిని ఎంక‌రేజ్ చేయ‌డంలో ముందుంటారు.