Begin typing your search above and press return to search.

ఆయ్ హై స్పీడ్.. 125 నుంచి 400

మొదటి 8 రోజుల్లోనే సినిమా 11 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసినట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.

By:  Tupaki Desk   |   25 Aug 2024 5:57 AM GMT
ఆయ్ హై స్పీడ్.. 125 నుంచి 400
X

గీతా ఆర్ట్స్ 2 నుంచి ఆగష్టు 15న రిలీజ్ అయిన కామెడీ ఎంటర్టైనర్ మూవీ ఆయ్ కి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. నార్నె నితిన్ హీరోగా అంజిబాబు కె దర్శకత్వంలో తెరకెక్కిన ఈ గోదావరి బ్యాక్ డ్రాప్ ఎంటర్టైనర్ ఇండిపెండెంట్స్ డే విన్నర్ గా నిలిచింది. మిస్టర్ బచ్చన్, డబుల్ ఇస్మార్ట్ లాంటి మాస్ యాక్షన్ చిత్రాలు పోటీలో ఉన్న కూడా వాటిని తట్టుకొని ఈ సినిమా ప్రేక్షకులని ఎట్రాక్ట్ చేసింది.

దీంతో ఈ మూవీ కలెక్షన్స్, డే బై డే పెరుగుతూ వచ్చాయి. మొదటి 8 రోజుల్లోనే సినిమా 11 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసినట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. బన్నీ వాస్ ఈ సినిమాని నిర్మించారు. అతని ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ హిట్ మూవీగా ఆయ్ చేరబోతోంది. కాంపిటేషన్ ఎక్కువ ఉండటంతో ఈ చిత్రాన్ని కేవలం 125 థియేటర్స్ లో రిలీజ్ చేశారు. అయితే పబ్లిక్ నుంచి రెస్పాన్స్ పెరగడంతో మారుమూల ప్రాంతాలకి కూడా రీచ్ చేయడం కోసం థియేటర్స్ సంఖ్యని పెంచారంట.

వరల్డ్ వైడ్ గా ప్రస్తుతం 400 థియేటర్స్ లో ఆయ్ మూవీ ప్రదర్శించబడుతుందంట. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అఫీషియల్ గా కన్ఫర్మ్ చేసింది. గోదావరి నేపథ్యంలో చాలా రోజుల తర్వాత ఓ మంచి వినోదాత్మక చిత్రాన్ని ఆశ్వాదించే ఛాన్స్ వచ్చిందనే మాట పబ్లిక్ నుంచి వినిపిస్తోంది. కచ్చితంగా లాంగ్ రన్ లో ఈ మూవీ భారీ వసూళ్లని సాధించడం గ్యారెంటీ అనే అని సినీ విశ్లేషకులు అంటున్నారు.

ఈ మూవీ బ్లాక్ బస్టర్ సక్సెస్ కావడంతో నిర్మాత బన్నీ వాస్, డైరెక్టర్ అంజిబాబు కె, హీరో నార్నె నితిన్ మీడియా ముందుకొచ్చారు. ఇంతటి ఘన అందించిన అందరికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సినిమాపై మేము పెట్టుకున్న నమ్మకాన్ని ప్రేక్షకులు నిజం చేసినందుకు సంతోషంగా ఉందని అన్నారు. టఫ్ కాంపిటేషన్ లో కూడా ప్రేక్షకులు ఆయ్ సినిమాకి అద్భుతమైన విజయాన్ని అందించడం నిజంగా గొప్ప విషయమని అన్నారు.

ఈ నెలలో వచ్చిన సినిమాలలో ఆయ్ మూవీ ప్రేక్షకుల ఫస్ట్ ఛాయస్ గా ఉందని నిర్మాత బన్నీ వాస్ తెలిపారు. ఆగష్టు నెల టాలీవుడ్ బాక్సాఫీస్ ఇండస్ట్రీకి కొంత కలిసొచ్చిందనే మాట సినీ విశ్లేషకుల నుంచి వినిపిస్తోంది. చిన్న సినిమాలుగా వచ్చిన కమిటీ కుర్రోళ్ళు, ఆయ్, మారుతీనగర్ సుబ్రహ్మణ్యం సినిమాలు కమర్షియల్ గా హిట్ టాక్ సొంతం చేసుకొని మంచి వసూళ్లని రాబడుతున్నాయి.