Begin typing your search above and press return to search.

'ఆయ్' కూడా అప్పుడే.. బాక్సాఫీస్ వద్ద పెద్ద క్లాషే..

ఇప్పుడు ఆయ్ సినిమా మేకర్స్ మరో క్రేజీ అప్డేట్ ఇచ్చారు. మూవీ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు. ఆగస్టు 15వ తేదీన సినిమా రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు.

By:  Tupaki Desk   |   25 Jun 2024 7:36 AM GMT
ఆయ్ కూడా అప్పుడే.. బాక్సాఫీస్ వద్ద పెద్ద క్లాషే..
X

టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్.. మ్యాడ్ మూవీతో హీరోగా మారిన విషయం తెలిసిందే. యూత్ ఫుల్ లవ్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించి మేకర్స్ కు లాభాల వర్షం కురిపించింది. సినిమాలో నార్నే నితిన్.. తన కామెడీ టైమింగ్ తో ఆకట్టుకున్నారు. కొద్ది రోజుల్లో శ్రీశ్రీశ్రీ రాజావారు మూవీతో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నారు. నిజానికి ఈ మూవీనే ఫస్ట్ అంగీకరించగా.. మ్యాడ్ ముందు రిలీజ్ అయింది.

ఇప్పుడు శ్రీశ్రీశ్రీ రాజావారు కన్నా.. నార్నే నితిన్ నటిస్తున్న ఆయ్ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తున్నట్లు తెలుస్తోంది. కోనసీమ నేపథ్యంతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు అంజి కంచిపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. GA2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ పై అల్లు అరవింద్ సమర్పణలో బ‌న్నీ వాస్ నిర్మిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే ఆడియన్స్ లో మంచి అంచనాలు ఉన్నాయి. గ్లింప్స్, సాంగ్స్, క్యారెక్టర్ టీజర్స్ అన్నీ క్రేజీ రెస్పాన్స్ అందుకున్నాయి.

ఇప్పుడు ఆయ్ సినిమా మేకర్స్ మరో క్రేజీ అప్డేట్ ఇచ్చారు. మూవీ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు. ఆగస్టు 15వ తేదీన సినిమా రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే ఆగస్టు 15వ తేదీపై అనేక చిత్రాలు కన్నేశాయి. ఇప్పుడు బన్నీ వాసు కూడా ఆయ్ సినిమాను అప్పుడే రిలీజ్ చేస్తుండడంతో గ‌ట్టి పోటీ న‌డ‌వనుంది. నిజానికి పుష్ప-2 పోస్ట్ పోన్ అనౌన్స్మెంట్ రాకమందే.. డబుల్ ఇస్మార్ట్ ను స్వాతంత్ర్య దినోత్సవం కానుకగా రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

ఆ తర్వాత మైత్రీ మూవీ మేకర్స్ కూడా తమ బ్యానర్ పై రూపొందుతున్న ఓ చిన్న బడ్జెట్ సినిమాను రిలీజ్ చేయాలని ఫిక్స్ అయినట్లు టాక్ వచ్చింది. అది కాకుండా మరికొన్ని చిత్రాలు కూడా ఆ రోజే రిలీజ్ అవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఆయ్ రిలీజ్ డేట్ అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చింది. దీంతో పుష్ప-2 తప్పుకున్నా.. ఆయా సినిమాల మధ్య ఆగస్టు 15వ తేదీన పెద్ద క్లాషే జరగనుంది. కానీ ఆయ్ మేకర్స్ మాత్రం తమ కంటెంట్ పై నమ్మకంతో ఉన్నారు.

అయితే ఆగస్టు 15వ తేదీ గురువారం, ఆ తర్వాత వీకెండ్, అనంతరం సోమవారం (రక్షా బంధన్) మరో హాలీడే. వీటిని పరిగణనలోకి తీసుకునే ఆయ్ మేకర్స్.. అప్పుడే తమ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. ఇక మూవీలో న‌య‌న్ సారిక హీరోయిన్ గా న‌టిస్తుండగా.. రామ్ మిరియాల సంగీతాన్ని అందిస్తున్నారు. సమీర్ కళ్యాణి సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు. బన్నీ వాసు, విద్యా కొప్పినీడి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి హిట్ అవుతుందో చూడాలి.