Begin typing your search above and press return to search.

సొంత సినిమా వాళ్లకి ఎందుకిచ్చినట్టు..?

సినిమాలు రిలీజ్ అవ్వకముందే ఓటీటీ ని ఫిక్స్ చేసుకుని కొన్ని సినిమాలు వస్తున్నాయి.

By:  Tupaki Desk   |   16 Aug 2024 6:43 AM GMT
సొంత సినిమా వాళ్లకి ఎందుకిచ్చినట్టు..?
X

సినిమాలు రిలీజ్ అవ్వకముందే ఓటీటీ ని ఫిక్స్ చేసుకుని కొన్ని సినిమాలు వస్తున్నాయి. సినిమా ప్రొడక్షన్ కోసం ముందే ఓటీటీ రైట్స్ అమ్మి ఆ మొత్తాన్ని కూడా బడ్జెట్ లో పెట్టేస్తున్న సందర్భాలు ఉన్నాయి. ఐతే కొన్ని సినిమాలు మాత్రం రిలీజ్ ముందు ఎన్ని ఆఫర్లు వచ్చినా సినిమా మీద ఉన్న నమ్మకంతో ఓటీటీ రైట్స్ ని హోల్డ్ లో పెడతారు. రిలీజ్ తర్వాత హిట్ టాక్ వస్తే ముందు ఇచ్చిన ఆఫర్ కన్నా డబుల్ డిమాండ్ చేసే ఛాన్స్ ఉంటుందని వారి ప్లాన్. ఐతే కొన్ని సినిమాలకు మాత్రం సినిమా రిలీజ్ తో సంబంధం లేకుండా ఓటీటీ హక్కులు అమ్మేస్తారు.

నిర్మాతలతో ఓటీటీ సంస్థలు ఎలా అగ్రిమెంట్ చేసుకుంటారన్నది పెద్దగా బయటకు లీక్ కాకపోయినా అంతకుముందు సినిమా రిలీజైన 8 వారాల దాకా ఓటీటీ రిలీజ్ వద్దని తీర్మానించారు. కానీ సినిమా థియేటర్ లో ఫ్లాప్ అయితే ఆ సినిమాకు 8 వారాల దాకా లేట్ చేస్తే సినిమా మర్చిపోయే ఛాన్స్ ఉందని నెల లోపే ఓటీటీ రిలీజ్ చేస్తున్నారు. ఇక మరోపక్క ఇదివరకు ఒక సినిమాను ఒక ఓటీటీ సమస్థనే తీసుకునే ఛాన్స్ ఉండేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కూడా మారింది.

ఒకటి కాదు రెండు మూడు ఓటీటీలకు తమ సినిమా అమ్మే అవకాశం ఉంది. ఐతే హిట్ సినిమాకే ఎక్కువగా ఇలా ఒకటికి మించి ఓటీటీ సంస్థలు పోటీ పడతాయని చెప్పొచ్చు. ఇక లేటెస్ట్ రిలీజ్ లో ఒక సినిమా సొంత బ్యానర్ కి చెందిన ఓటీటీకి కాకుండా మరో ఓటీటీకి అమ్మేసినట్టు తెలుస్తుంది. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో నార్నే నితిన్ హీరోగా అంజి డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా ఆయ్. ఈ సినిమా గురువారం రిలీజై ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటుంది.

ఆగష్టు 15కి మాస్ మహరాజ్ రవితేజ మిస్టర్ బచ్చన్, రాం పూరీ కాంబోలో వచ్చిన డబుల్ ఇస్మార్ట్ ఈ రెండు సినిమాల మధ్య ఒక చిన్న సినిమాగా ఆయ్ రిలీజైంది. మాస్ కమర్షియల్ అంశాలతో వచ్చిన ఆ రెండు సినిమాలు ఆడియన్స్ ని నిరాశపరిస్తే ఆయ్ మాత్రం అదరగొట్టేసింది. ఐతే ఈ సినిమా గురించి లేటెస్ట్ గా ఒక న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సినిమా ఓటీటీ రైట్స్ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుందని తెలుస్తుంది. గీతా ఆర్ట్స్ అంటే అల్లు అరవింద్ సారథ్యంలోనే ఆహా ఓటీటీ ఉంది. మరి ఆహా ని కాదని ఆయ్ ని నెట్ ఫ్లిక్స్ కి ఇస్తారా. లేదా ఆహాతో పాటుగా నెట్ ఫ్లిక్స్ కి కూడా ఈ సినిమాను అమ్మేశారా అన్నది తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా నార్నే నితిన్ స్టోరీ సెలక్షన్ మొదటి సినిమా మ్యాడ్ తో సూపర్ హిట్ కొట్టగా ఆయ్ అంటూ ఈ సినిమాతో కూడా సక్సెస్ అందుకున్నట్టే అని చెప్పొచ్చు.