Begin typing your search above and press return to search.

ఆయ్ మూవీ.. ఎలా ఉందంటే..

ఆగస్ట్ 15న లాంగ్ వీకెండ్ ను క్యాష్ చేసుకోవాలని ఒకేసారి మూకుమ్మడిగా సినిమాలు పోటీలో దిగాయి

By:  Tupaki Desk   |   15 Aug 2024 4:55 PM GMT
ఆయ్ మూవీ.. ఎలా ఉందంటే..
X

ఆగస్ట్ 15న లాంగ్ వీకెండ్ ను క్యాష్ చేసుకోవాలని ఒకేసారి మూకుమ్మడిగా సినిమాలు పోటీలో దిగాయి. వేటికవే భిన్నంగా ఉన్న సినిమాలు గ్రాండ్ ప్రమోషన్ తో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం అయితే చేశాయి. ఇక ఈ పోటీలో ఆయ్ అనే సినిమా కూడా వచ్చింది. కంటెంట్ మీద నమ్మకంతో బన్నీ వాసు మంచి ప్రమోషన్స్ చేసి ప్రీమియర్స్ తోనే ఆడియెన్స్ ను ఎట్రాక్ట్ చేసే విధంగా అడుగులు వేశారు. టీజర్, ట్రైలర్, పాటలను బట్టి ఇది మంచి ఎంటర్టైన్మెంట్ మూవీ అని ఒక క్లారిటీ అయితే ఇచ్చారు.

నార్నే నితిన్, నయన్ సారిక జంటగా నటించిన ఈ సినిమాను గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో రూపొందించారు. నితిన్‌తో పాటుగా అంకిత్ కొయ్య, కసిరాజు ప్రముఖ పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పించగా.. బన్నీ వాస్, విద్యా నిర్మించారు. ఇక ఆగస్ట్ 15న ఈ చిత్రం విడుదలైంది. ఆయ్ సినిమాకు ట్రైలర్, టీజర్, సాంగ్స్ బాగానే హైప్ పెంచాయి. సినిమా విడుదల అనంతరం టాక్ ఎలా ఉంది అనే వివరాల్లోకి వెళితే..

పల్లెటూరి నేపథ్యంలో సాగే ఈ కథలో దర్శకుడు అంజి కులం కంటే స్నేహం గొప్పదని ఎంతో సింపుల్‌గా, హార్ట్ టచింగ్‌గా కథను అల్లిన విధానం ఆకట్టుకుంది. నిర్మాణ విలువలు గీతా ఆర్ట్స్‌కు తగ్గట్టుగా ఉన్నాయని నెటిజన్స్ ప్రశంసింస్తున్నారు. ఆర్టిస్టుల విషయానికి వస్తే.. ముందుగా నార్నే నితిన్ ఈ సినిమా వాతావరణంకు తగ్గట్టుగా మంచి పెర్ఫెమెన్స్ ఇచ్చాడు.

ఇక ఇలాంటి పాత్రలకు నితిన్ పర్ఫెక్ట్ గా న్యాయం చేయగలడు అనేలా పాజిటివ్ కామెంట్స్ అందుకుంటున్నాడు. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్, యాక్షన్, కామెడీ ఇలా అన్ని యాంగిల్స్‌లో అతను మెప్పించిన తీరు బాగుంది. మరో నటుడు అంకిత్ కొయ్య కూడా తన పాత్రతో బాగానే నవ్వించాడు. అలాగే హీరోయిన్ నయన్ సారిక కుర్రాళ్లను తన క్యూట్ హావభావాలతో కట్టి పడేస్తుంది. చలాకీ తనంతో తెరపై ఇట్టే ఎట్రాక్ట్ చేసిందని అంటున్నారు.

ఇక కథ పరంగా మిగిలిన పాత్రలన్నీ కూడా పర్వాలేదనిపిస్తాయి. ఆయ్ సినిమా చూస్తే మనసుకు హాయి మాత్రం కలుగుతుందని ఓ వర్గం ఆడియెన్స్ నుంచి బలమైన టాక్ వినిపిస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే పెట్టిన డబ్బులకి తెగ నవ్వేస్తారని అంటున్నారు. ఇక ఈ వీకెండ్ లో సందడి చేస్తున్న సినిమాల్లో ఇదే బెస్ట్ ఛాయిస్ అని కూడా చెప్పవచ్చు. సినిమా మొదటి నుంచి క్లయిమాక్స్ ముందు వరకు ఒక మంచి కామెడీ ఎంటర్టైనర్ గా కొనసాగిన ఆయ్ చివరలో హార్ట్ ను టచ్ చేసేలా ఓ మంచి ఎమోషన్‌తో నింపేస్తుంది. ఫైనల్ గా గీత ఆర్ట్స్ 2 లో మరో మంచి సినిమా వచ్చింది అనేలా కామెంట్స్ వస్తున్నాయి. మరిన్ని వివరాలు రాబోయే పూర్తి రివ్యూలో చూద్దాం..