Begin typing your search above and press return to search.

ఆయ్… ఎన్టీఆర్ తో పాటు ఆ హీరో..?

జూనియర్ ఎన్టీఆర్ బామ్మర్ది నార్నె నితిన్ హీరోగా గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీ వాస్ నిర్మించిన ఆయ్ మూవీ రిలీజ్ కి రెడీ అవుతోంది

By:  Tupaki Desk   |   6 Aug 2024 5:03 AM GMT
ఆయ్… ఎన్టీఆర్ తో పాటు ఆ హీరో..?
X

జూనియర్ ఎన్టీఆర్ బామ్మర్ది నార్నె నితిన్ హీరోగా గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీ వాస్ నిర్మించిన ఆయ్ మూవీ రిలీజ్ కి రెడీ అవుతోంది. ఆగష్టు 15న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకి తీసుకొని రాబోతున్నారు. గోదావరి బ్యాక్ డ్రాప్ లో అవుట్ అండ్ అవుట్ ఫన్ ఎంటర్టైనర్ గా ఆయ్ చిత్రాన్ని తెరకెక్కించారు. తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్ కి మంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. కచ్చితంగా ఈ సినిమాతో ప్రేక్షకులు ఫుల్ ఎంజాయ్ చేయడం గ్యారెంటీ అనే మాట వినిపిస్తోంది.

విలేజ్ లైఫ్ నుంచి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమాని తమ కథ అని ఫీల్ అయ్యేలా ఎంటర్టైన్మెంట్ అందిస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ ని పిఠాపురంలో నిర్వహించారు. ఇదిలా ఉంటే ఆయ్ ప్రీరిలీజ్ ఈవెంట్ ని గట్టిగానే ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. బన్నీ వాస్ ఈ సినిమాని వీలైనంత ఎక్కువగా జనాల్లోకి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఈ ప్రీరిలీజ్ ఈవెంట్ ని సంబందించిన ఇంటరెస్టింగ్ టాక్ వినిపిస్తోంది.

దీనికి చీఫ్ గెస్ట్ లుగా ఇద్దరు స్టార్స్ ని పిలవాలని అనుకుంటున్నారంట. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బన్నీ వాస్ బెస్ట్ ఫ్రెండ్ కావడంతో అతన్ని ఇన్వైట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే జూనియర్ ఎన్టీఆర్ ఆయ్ మూవీ హీరో నార్నె నితిన్ భావ కాబట్టి కచ్చితంగా ఇన్వైట్ చేసే ఛాన్స్ ఉంది. బామ్మర్దిని ఎంకరేజ్ చేయడానికి ఎన్టీఆర్ కూడా రావొచ్చని టాక్ వినిపిస్తోంది. ఒక వేళ జూనియర్ ఎన్టీఆర్, బన్నీ ఆయ్ మూవీ ఈవెంట్ కి వస్తే మాత్రం కచ్చితంగా అది క్రేజీ ప్రమోషన్ స్ట్రాటజీ అవుతుందని సినీ విశ్లేషకులు అంటున్నారు.

మేగ్జిమమ్ వచ్చే ఛాన్స్ అయితే ఉందనే మాట వినిపిస్తోంది. ఎన్టీఆర్, బన్నీ మంచి ఫ్రెండ్స్ అనే సంగతి అందరికి తెలిసిందే. ఇద్దరు ఒకరినొకరు బావ అని పిలుచుకుంటారు. ఆయ్ సినిమా ప్రమోషన్స్ లో వారిద్దరూ పాల్గొంటే కచ్చితంగా మూవీకి అద్భుతమైన ఓపెనింగ్స్ వస్తాయని అంచనా వేస్తున్నారు. డబుల్ ఇస్మార్ట్, మిస్టర్ బచ్చన్ లాంటి మాస్ చిత్రాల మధ్యలో ఆయ్ మూవీ రిలీజ్ అవుతోంది. వాటిని తట్టుకొని నిలబడాలంటే ప్రమోషన్స్ స్ట్రాంగ్ గా జరగాలి. జనాల్లోకి కంటెంట్ బలంగా వెళ్ళాలి.

దానికి స్టార్ హీరోల క్రేజ్ తోడైతే ఎక్కువ మందికి ఆయ్ మూవీ కంటెంట్ రీచ్ అవుతుందని చిత్ర యూనిట్ భావిస్తోంది. ప్రస్తుతం బన్నీ పుష్ప ది రూల్ మూవీ షూటింగ్ లో ఉన్నారు. ఎన్టీఆర్ కూడా షూటింగ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. మరి వీరిద్దరూ ఆయ్ ప్రీరిలీజ్ ఈవెంట్ కి వస్తారా లేదా అనేది అఫీషియల్ గా కన్ఫర్మ్ చేసేంత వరకు తెలియదు.