ఆ పని చేయడంతోనే అశ్లీల చిత్రాల్లోకి నటి!
అయితే ఈ సినిమాలో నటించిన అభాపాల్ సన్నివేశాలు ఎడిట్ చేసారు.తను ఎవరో ప్రపంచానికి తెలియకుండా 'వీర్' యూనిట్ చేసిందని అసహనం వ్యక్తం చేసింది.
By: Tupaki Desk | 22 March 2024 1:30 PM GMTబాలీవుడ్ హాట్ బ్యూటీ అభాపాల్ పరిచయం అవసరం లేని పేరు. 'కామసూత్ర' చిత్రంతో అమ్మడు యువతిలో క్రేజీ బ్యూటీగా మారిపోయింది. ఆ ఒక్క హిట్ తో ఇండియా అంతా ఫేమస్ అయింది. సన్నిలియన్ తర్వాత ఆ రేంజ్ పాపులారిటీ అభాపాల్ కే దక్కింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అటుపై టేస్ట్ లాంటి మరో అటెంప్ట్ తోనే మరింత చేరువైంది. మాస్ట్రమ్...ట్రిపుల్ ఎక్స్ లాంటి వెబ్ సిరీస్ లతో బుల్లి తెర ఆడియన్స్ ని అంతే ఫిదా చేసింది.
ఆ రకంగా వెండి తెరపై...బుల్లి తె రపై తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ ని క్రియేట్ చేసుకుంది. ఇలా ఇంత పాపులర్ అయినా ఈ పనులన్నీ తన మనసు చంపుకునే చేస్తున్నట్లు తాజాగా అభాపాల్ రివీల్ చేసింది. అందుకు కారణం ఓ సినిమా అని కూడా చెప్పింది. వివరాల్లోకి వెళ్తే... సల్మాన్ ఖాన్ హీరోగా 'వీర్' సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఇందులో అభాపాల్ ని కూడా నటించింది. కానీ రిలీజ్ అనంతరం అభాపాల్ తెరపై ఎక్కడా కనిపించని సంగతి తెలిసిందే.
అప్పటికి అభాపాల్ ఎవరో పెద్దగా ఎవరికీ తెలియదు కాబట్టి పట్టించుకోలేదు. కానీ వికీ సమాచారం 'వీర్' లో నువ్వు ఉన్నావ్ కదా? మరి ఎక్కడా కనిపించలేదు? ఏంటి? అంటే తనకు జరిగిన అన్యాయం గురించి తొలిసారి ఓపెన్ అయింది. అయితే ఈ సినిమాలో నటించిన అభాపాల్ సన్నివేశాలు ఎడిట్ చేసారు.
తను ఎవరో ప్రపంచానికి తెలియకుండా 'వీర్' యూనిట్ చేసిందని అసహనం వ్యక్తం చేసింది. అలా చేయడం వల్లే తాను అశ్లీల చిత్రాల నటిగా మారినట్లు తెలిపింది.
ఇటీవల మధురైలోని మీనాక్షి అమ్మన్ ఆలయాన్ని సందర్శించిన 'అభాపాల్' ఫోటోలను ఇన్ స్టాలో షేర్ చేసింది. ఆ ఫోటో చూసిన అభిమా నులు మీకు గుడికి వెళ్లే అలవాటు ఉందా? అని ప్రశ్నించారు. అలాం టి సినిమాల్లో నటించే మీలో భక్తి కూడా దాగి ఉందా..? అంటూ నెటిజన్లు పెట్టారు . దీనికి స్పంధించిన అబాపాల్ ఏడాదిలో ఒక్కసారైనా భారతదేశంలోని పలు దేవాలయాలను సందర్శిస్తాను. తద్వారా ప్రశాంతత లభిస్తుందంది. ఈ సందర్బంగా 'వీర్' సినిమాలో తనకు జరిగిన అన్యాయం గురించి ఓపెన్ అయింది. ఉత్తర ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో జన్మించిన అభాపాల్ బ్యాచలర్ ఆఫ్ ఆర్ట్స్‌లో గ్రాడ్యుయేట్ పూర్తి చేశారు. 2005లో తొలిసారి మోడలింగ్‌లో అడుగుపెట్టి సినిమాల్లోకి వచ్చింది.