Begin typing your search above and press return to search.

బిగ్ బాస్ 8 : స్టార్ కంటెస్టెంట్ ఎలిమినేట్..?

ఐతే బిగ్ బాస్ సీజన్ 8 లో మూడో ఎలిమినేటర్ గా అభయ్ నవీన్ ఉన్నట్టు తెలుస్తుంది.

By:  Tupaki Desk   |   21 Sep 2024 10:14 AM GMT
బిగ్ బాస్ 8 : స్టార్ కంటెస్టెంట్ ఎలిమినేట్..?
X

బిగ్ బాస్ సీజన్ 8 నుంచి 3వ వారం స్టార్ కంటెస్టెంట్ ఎలిమినేట్ అవుతున్నట్టుగా తెలుస్తుంది. ఆదివారం జరిగే ఎలిమినేషన్ షూటింగ్ శనివారం జరుగుతుంది కాబట్టి ఒకరోజు ముందే ఎలిమినేట్ అయ్యింది ఎవరు అన్నది లీక్ అవుతుంది. బిగ్ బాస్ సీజన్ 8 మూడో వారం కూడా ఎనిమిది మంది కంటెస్టెంట్స్ నామినేషన్స్ లో ఉన్నారు. అభయ్, యష్మి, ప్రేరణ, మణికంఠ, విష్ణు ప్రియ, పృధ్వి, నైనిక, సీత ఈసారి నామినేషన్స్ లో ఉన్నారు. వీరిలో లీస్ట్ ఓటింగ్ వచ్చిన వారు ఎలిమినేట్ అవుతారు.

ఐతే బిగ్ బాస్ సీజన్ 8 లో మూడో ఎలిమినేటర్ గా అభయ్ నవీన్ ఉన్నట్టు తెలుస్తుంది. హౌస్ లో వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా అనిపించిన అభయ్ నవీన్ గడిచిన వారం మొత్తం ఎలాంటి టాస్కులు ఆడలేదు. లాస్ట్ వీక్ అతను చీఫ్ గా కాగా ఎంపిక కాగా అతను ఈ వారం ఎలిమినేట్ అవ్వడం అందరికీ షాక్ ఇస్తుంది. ఈ వారం జరిగిన గుడ్ల టాస్క్ లో అభయ్ యాక్టివ్ గా ఆడలేదు. అంతేకాదు బిగ్ బాస్ ని లేనిపోని మాటలతో దూషించాడు.

అభయ్ అది సరదాగా అన్నట్టు అనిపించినా అది ఆడియన్స్ కు వేరేలా వెళ్లింది. బిగ్ బాస్ లో ఉంటూ బిగ్ బాస్ మీద రెస్పెక్ట్ లేకుండా మాట్లాడటం జరిగింది. అందుకే బిగ్ బాస్ కూడా శుక్రవారం ఎపిసోడ్ లో అర్ధరాత్రి లేపి గేట్లు తీసి మీలో ఎవరికైనా ఇక్కడ ఉండాలని లేకపోతే వెళ్లొచ్చని అన్నాడు. అంతేకాదు గుడ్ల టాస్క్ ఓడిపోవడంతో అభయ్ ని చీఫ్ గా కూడా తీసేశాడు బిగ్ బాస్.

బిగ్ బాస్ సీజన్ 8 మొదటి నుంచి చీఫ్ గా నిఖిల్ కొనసాగుతున్నాడు. 3వ వారం నిఖిల్, సోనియా ఇద్దరు చీఫ్ అయ్యేందుకు పోటీ పడ్డారు. ఆ టాస్క్ లో కూడా నిఖిల్ గెలిచి మళ్లీ చీఫ్ అయ్యాడు. అభయ్ క్లాన్ లో ఉన్న వారంతా కూడా చీఫ్ అయ్యేందుకు అనర్హులని బిగ్ బాస్ వెల్లడించాడు. మొత్తానికి అభయ్ ఎలిమినేషన్ తో బిగ్ బాస్ ఆడియన్స్ షాక్ అవుతున్నారు. మరి అభయ్ ఎలిమినేషన్ నిజమా కాదా అన్నది ఆదివారం రాత్రి ఎపిసోడ్ లో తెలుస్తుంది.