విడాకుల పుకార్ల నడుమ స్టార్ కపుల్ ట్విస్ట్
అభిషేక్ బచ్చన్- ఐశ్వర్య రాయ్ బచ్చన్ విడిపోయారనే పుకార్లు ఆన్లైన్లో షికార్ చేస్తున్నాయి.
By: Tupaki Desk | 7 Nov 2024 7:30 AM GMTఅభిషేక్ బచ్చన్- ఐశ్వర్య రాయ్ బచ్చన్ విడిపోయారనే పుకార్లు ఆన్లైన్లో షికార్ చేస్తున్నాయి. అయితే దీనిని ఆ ఇద్దరిలో ఎవరూ ధృవీకరించలేదు. ఇవన్నీ మీడియా ఊహాగానాలు మాత్రమేనని అంతా భావిస్తున్నారు. ఇలాంటి సమయంలో ఈ జంట నుంచి తాజా అప్ డేట్ వేడెక్కిస్తోంది.
ఐష్ తో అభిషేక్ ఇంతకుముందు గురు, రావణ్ వంటి చిత్రాలలో కలిసి నటించారు. కానీ ఆ తర్వాత మళ్లీ కలిసి జంటగా నటించేందుకు అవకాశం కలగలేదు. కానీ ఇప్పుడు మణిరత్నంతో ఒక ప్రాజెక్ట్ కోసం కలిసి పనిచేస్తారని తెలుస్తోంది. మణి సర్.. ఈ జంటతో కొత్త హిందీ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఐశ్వర్య - అభిషేక్‌లతో భారీ చిత్రం కోసం మణి గత కొంతకాలంగా వేచి చూస్తున్నారు. చివరకు వారితో ఎలాంటి సినిమా చేయాలో నిర్ణయించుకున్నారని జూమ్ ఒక కథనంలో పేర్కొంది.
2007లో మణిరత్నం గురు చిత్రంలో ఐశ్వర్యరాయ్ బచ్చన్ - అభిషేక్ బచ్చన్ నటించారు. ఆ తరువాత రావణ్ (2010)లో కలిసి పనిచేశారు. అంతకుముందు యువ (2004)లో మణిరత్నంతో కలిసి పని చేసారు ఈ జోడీ. జూమ్ ఇంటర్వ్యూలో అభిషేక్ బచ్చన్ .... ఫిలింమేకర్ మణిరత్నంతో తన అనుబంధం గురించి మాట్లాడుతూ, ``యువ కోసం మాట్లాడేందుకు మొదటిసారి మా ఇంటికి వచ్చినప్పుడు.. మణి సర్ పా (తండ్రి అమితాబ్ బచ్చన్) కోసం వచ్చారని అనుకున్నాను. కానీ ఆ అవకాశం నాదేనని తెలిసాక ఎంతకైనా తెగిస్తానని అనుకున్నాను..`` అన్నాడు.
అభిషేక్, ఐశ్వర్యరాయ్ బచ్చన్ విడాకుల గురించి గత కొంత కాలంగా సోషల్ మీడియాలో పుకార్లు షికారు చేస్తున్నాయి. జులైలో జరిగిన ఒక హై-ప్రొఫైల్ వెడ్డింగ్‌లో ఈ జంట విడివిడిగా వచ్చినప్పుడు ఈ రూమర్లు ఎక్కువయ్యాయి. ఆ తర్వాతా తామరతంపరగా ఈ జంటపై పుకార్లు షికార్ చేస్తూనే ఉన్నాయి. వాటిని వీరు ఖండించరు.. ఔనని అనరు. దీంతో అభిమానుల్లోను గందరగోళం నెలకొంది.
అభిషేక్ బచ్చన్- ఐశ్వర్య రాయ్ బచ్చన్ ఏప్రిల్ 2007లో వివాహం చేసుకున్నారు. ఇద్దరూ నవంబర్ 2011లో తమ కుమార్తె ఆరాధ్య బచ్చన్‌ను స్వాగతించారు. ఇప్పటివరకు ఈ జంట విడాకుల పుకార్లను ధృవీకరించలేదు లేదా ఖండించలేదు. వృత్తిపరంగా ఈ జంట డజను చిత్రాల్లో కలిసి నటించారు. ధై అక్షర్ ప్రేమ్ కే (2000), కుచ్ నా కహో (2003), ధూమ్ 2 (2006), ఉమ్రావ్ జాన్ (2006), యువ, గురు (2007), సర్కార్ రాజ్ (2008), రావణ్ (2010) తదితర చిత్రాలలో కలిసి పనిచేశారు.