Begin typing your search above and press return to search.

అభి (X) ఐష్‌: విడాకుల పుకార్ల‌ను అలా తిప్పి కొట్టారు

ఐశ్వర్య రాయ్- అభిషేక్ బచ్చన్ జంట విడాకులు తీసుకుంటున్నారంటూ ముంబై మీడియాలో ప్ర‌చారం సాగుతోంది.

By:  Tupaki Desk   |   6 Dec 2024 3:30 PM GMT
అభి (X) ఐష్‌: విడాకుల పుకార్ల‌ను అలా తిప్పి కొట్టారు
X

ఐశ్వర్య రాయ్- అభిషేక్ బచ్చన్ జంట విడాకులు తీసుకుంటున్నారంటూ ముంబై మీడియాలో ప్ర‌చారం సాగుతోంది. దాదాపు 17 సంవ‌త్స‌రాల కాపురంలో అన్నీ బాగానే ఉన్నా కొన్ని క‌ల‌త‌లు కూడా ఉన్నాయ‌ని, ఇప్పుడు విడిపోతున్నార‌ని క‌థ‌నాలొచ్చాయి. దీనిని ఇరువైపులా కుటుంబాలు ఖండించ‌నూ లేదు.. అలాగ‌ని ధృవీక‌రించ‌నూ లేదు. మీడియా ఊహాగానాల‌పై అమితాబ్, అభిషేక్ ప‌లుమార్లు ఆవేద‌న వ్య‌క్తం చేసారు మిన‌హా దేనికీ క‌చ్ఛిత‌మైన వివ‌ర‌ణ ఇవ్వ‌లేదు.

అయితే తాము విడిపోలేదు.. క‌లిసే ఉన్నామ‌ని సిగ్న‌ల్ ఇస్తూ ఇటీవల ముంబైలో జ‌రిగిన ఓ గ్రాండ్ పార్టీలో అభి-ఐష్ జంట క‌లిసి కనిపించారు. అందుకు సంబంధించిన ఫోటోలు ఇంటర్నెట్‌లో వైరల్ అయ్యాయి. ఆనంద్ అంబానీ - రాధిక మర్చంట్‌ల పెళ్లిలో ఆ ఇద్ద‌రూ ఎవ‌రికి వారుగా కనిపించిన తర్వాత ఈ జంటపై పుకార్లు మొద‌ల‌య్యాయి. అప్పటి నుంచి వీరిద్దరూ విడాకులు తీసుకునే అవకాశం ఉందనే ఊహాగానాలు జోరందుకున్నాయి. అయితే తాజాగా ఇన్ స్టాలో షేర్ చేసిన ఫోటోలు దానికి భిన్న‌మైన స్టోరీని చెబుతున్నాయి.

అభిషేక్ - ఐశ్వర్య జంట‌ గురువారం ముంబైలో జరిగిన వివాహ రిసెప్షన్‌కు హాజరయ్యారు. దీనికి పాతకాలపు నటి అయేషా జుల్కా సహా పలువురు బాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు. ఈ జంటతో పాటు ఐశ్వర్య తల్లి బృందా రాయ్ కూడా ఉన్నారు. పార్టీలో ఐశ్వర్య రాయ్‌- అభిషేక్ బ‌చ్చ‌న్ క‌లిసి క‌నిపించారు. కొన్ని సెల్ఫీల్లోను ఆ ఇద్ద‌రూ ఆనందంగా క‌నిపించారు. ఫిలింమేక‌ర్ అను రంజన్, నటీమణులు ఆకాంక్ష, అనుష్క రంజన్ తల్లి కూడా గత రాత్రి వేడుకల నుండి ఒక ఫోటోను షేర్ చేసారు. ఈ ఫోటో ఐశ్వర్య రాయ్ స్వ‌యంగా క్లిక్ చేసిన‌ సెల్ఫీ. ఈ ఫోటోల్లో ఆమె తల్లి బృందా కూడా ఉన్నారు. బ్యాక్‌గ్రౌండ్‌లో అభిషేక్ కెమెరా కోసం స్మైలిస్తూ క‌నిపించారు. మ‌నీష్ గోస్వామి షేర్ చేసిన ఫోటోల్లో అభిషేక్- ఐశ్వ‌ర్యారాయ్ బ్లాక్ అండ్ బ్లాక్ లుక్ లో ఎంతో స‌న్నిహితంగా క‌నిపిస్తున్నారు.

ఈ ఫోటోల‌ను పోస్ట్ చేసిన వెంటనే అభిమానులు కామెంట్ సెక్షన్ లో త‌మ ఆనందం వ్య‌క్తం చేసారు. ఒక నెటిజ‌న్ వ్యాఖ్యానిస్తూ...``ఇది ఒక ఉపశమనం...ఇద్దరూ ఎప్పుడూ కలిసి ఉండవచ్చు`` అని రాసారు. మరొకరు అభిషేక్ - ఐశ్వర్యల సమస్యాత్మక సంబంధం గురించి అపోహను తొలగించినందుకు ధన్యవాదాలు తెలిపారు.

అభిషేక్ బచ్చన్ తన కుమార్తె ఆరాధ్య 13వ పుట్టినరోజు వేడుక‌ల నుంచి స్కిప్ కొట్టార‌ని ప్ర‌చారం సాగింది. కానీ ఆ త‌ర్వాత అది నిజం కాద‌ని నిరూపిస్తూ ఓ రెండు వీడియోల‌ను వారు షేర్ చేసారు. ఆరాధ్య‌ పుట్టినరోజు పార్టీ నిర్వాహకులు తమ సోషల్ మీడియాల‌లో అభిషేక్ ఈ పార్టీకి హాజరయ్యారని ధృవీకరించే రెండు వీడియోలను కూడా షేర్ చేసారు. తమ బ్రాండ్‌ను ప్రమోట్ చేయడానికి, నిర్వాహకులు తమ కుమార్తె ఆరాధ్య కోసం ఒక చిరస్మరణీయమైన పార్టీని ఏర్పాటు చేసినందుకు అభిషేక్- ఐశ్వర్య వారికి కృతజ్ఞతలు తెలుపుతూ రెండు వీడియోలను షేర్ చేసారు. ఈవెంట్ ప్లానర్లు 13 సంవత్సరాలుగా ఆరాధ్య పుట్టినరోజు వేడుక‌ల‌కు వేదిక‌ను ఏర్పాటు చేస్తున్నారని అభి-ఐష్‌ దంపతులు వెల్లడించారు. అయినా కానీ... రెండు వీడియోలలో వారు నిర్వాహకులతో విడివిడిగా క‌నిపించారు త‌ప్ప క‌లిసి క‌నిపించ‌లేదు. దీనివ‌ల్ల కూడా విడాకుల ఊహాగానాలకు మ‌రోసారి అవకాశం క‌ల్పించారు. ఇప్పుడు సెల్ఫీలు, ఫోటోషూట్ల‌తో ఈ జంట విడాకుల పుకార్లన్నింటినీ కొట్టివేశార‌ని ప్ర‌జ‌లు మాట్లాడుకుంటున్నారు.