ఐశ్వర్యారాయ్ రెండో బిడ్డను కంటున్నారా?
అభిషేక్ బచ్చన్- ఐశ్వర్య రాయ్ బచ్చన్ విడిపోతున్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది.
By: Tupaki Desk | 10 Dec 2024 1:30 AM GMTఅభిషేక్ బచ్చన్- ఐశ్వర్య రాయ్ బచ్చన్ విడిపోతున్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది. దీనిపై అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్ పలు సందర్భాల్లో తమ అసహనాన్ని వ్యక్తం చేసారు. సోషల్ మీడియాల వేదికగానే స్పందిస్తూ.. అలాంటి తప్పుడు రాతలు రాసేవారి వ్యాపారాత్మక ఆలోచనను ఆక్షేపించారు.
ఇలాంటి సమయంలో ఐశ్వర్యారాయ్- అభిషేక్ బచ్చన్ ఓ పార్టీలో జంటగా కనిపించి అభిమానులకు ఉపశమనం కలిగించాయి. వారి మధ్య అన్యోన్యత కనిపించింది. ఇప్పుడు ఐశ్వర్య రాయ్‌తో ఆరాధ్య తర్వాత రెండవ బిడ్డను కనడం గురించి అభిషేక్ మాట్లాడారు. అభిషేక్ బచ్చన్ ఇటీవల రితీష్ దేశ్‌ముఖ్ చాట్ షో `కేస్ తో బంటా హై`లో అతిథిగా కనిపించారు. రితేష్ ఓ సరదా పరిహాసంలో ఐశ్వర్య రాయ్‌తో రెండవ బిడ్డను కనడం గురించి అభిషేక్ ని ఆటపట్టించాడు.
అమితాబ్ కుటుంబంలో పేర్లు అన్నీ `అ` అనే అక్షరంతో ప్రారంభం కావడం సాంప్రదాయంగా మారిందనే ప్రస్థావన వచ్చింది. అమితాబ్, అభిషేక్, ఆష్, ఆరాధ్య... ఇలా అన్నీ `అ` అనే అక్షరంతోనే ప్రారంభమయ్యాయి. అదే సమయంలో ఆరాధ్య కే బాద్ (ఆరాధ్య తర్వాత?) అని రితేష్ ప్రశ్నించారు. అభిషేక్ బదులిస్తూ ``నహీ అభి అగ్లీ పీధీ జో ఆయేగీ తబ్ దేఖేంగే నా`` అని అన్నారు. రితేష్ ఇలాంటివి పబ్లిగ్గా అడగకూడదు అంటూ అభిషేక్ నవ్వేసారు. కొంచెం సీరియస్ ఎక్స్ ప్రెషన్ తో.. ``మీ కంటే పెద్దవాళ్లను గౌరవించండి రితేష్!`` అని కూడా అన్నారు. రితేష్ అతడి పాదాలను తాకడం ద్వారా వారి మధ్య సరదా పరిహాసం ముగిసింది.
అభిషేక్ బచ్చన్ - ఐశ్వర్య రాయ్ 2011లో కుమార్తె ఆరాధ్య బచ్చన్‌కు తల్లిదండ్రులు అయ్యారు. ఈ జంట ఒకరితోనే సరిపెట్టారు. ఇప్పుడు రెండో బిడ్డ గురించి రితేష్ యాధృచ్ఛికంగానే ప్రశ్నించారు. దానికి అభిషేక్ సరదాగా సమాధానమిచ్చారు. అభిషేక్ - ఐశ్వర్యారాయ్ విడిపోతున్నారనే వార్తల నడుమ ఈ చర్చ అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తించింది.
కెరీర్ మ్యాటర్ కి వస్తే.. ఐశ్వర్యారాయ్ ఇటీవల ఆచితూచి సినిమాల్లో నటిస్తున్నారు. పొన్నియన్ సెల్వన్ 2 తర్వాత సినిమాలేవీ ప్రకటించలేదు. అభిషేక్ బచ్చన్ చివరిగా ఐ వాంట్ టు టాక్ అనే సినిమాలో నటించాడు. పాజిటివ్ రివ్యూలు వచ్చినా కానీ.. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సత్తా చాటలేకపోయింది. తదుపరి హౌస్‌ఫుల్ 5లో అభిషేక్ కనిపించనున్నాడు. షారుఖ్ ఖాన్ కింగ్ లో విలన్ గా కనిపిస్తాడు. రెమో డిసౌజా డ్యాన్స్ ఫిల్మ్ `బీ హ్యాపీ`లో (ఓటీటీ సినిమా) కూడా నటించనున్నాడు.