అలాంటి వార్తల నడుమ..అభి-ఐష్ చేతిలో చెయ్యేసి..
ఈ తరహా ప్రచారంపై అమితాబ్ - అభిషేక్ సహించలేని స్థితిలో అసహనం వ్యక్తం చేసారు.
By: Tupaki Desk | 20 Dec 2024 4:24 AM GMTఐశ్వర్య రాయ్ - అభిషేక్ బచ్చన్ దంపతులు విడిపోతున్నారంటూ ముంబై మీడియా ప్రచారం చేస్తోంది. ఇది వారి అభిమానుల్లో తీవ్ర ఆందోళనలను రేకెత్తించింది. ఈ తరహా ప్రచారంపై అమితాబ్ - అభిషేక్ సహించలేని స్థితిలో అసహనం వ్యక్తం చేసారు. తప్పుడు కథనాలతో మీడియా వ్యాపారం చేస్తోందని అమితాబ్ సూటిగా విమర్శించారు. అయినా వార్తలు ఆగడం లేదు. నెటిజనుల ఊహాగానాలు యథేచ్ఛగా సాగిపోతున్నాయి.
అయితే ఇటీవల ఓ వేడుకలో అభిషేక్ - ఐశ్వర్య జంటగా కనిపించి అన్నిటికీ సమాధానమిచ్చారు. చూపరులందరికీ ఒక స్పష్ఠత వచ్చేసింది. ఈ జంట నడుమ ఏం జరిగినా కానీ, మీడియా అతిగా ప్రవర్తిస్తోందని చాలామంది భావించారు. ఇప్పుడు కుమార్తె ఆరాధ్య కోసం మరోసారి ఐశ్వర్యారాయ్- అభిషేక్ జంటగా కనిపించారు. దీంతో మరింత స్పష్ఠత వచ్చింది. జంటగా కలిసి రావడం సన్నిహితంగా మెలగడంతో బ్రేకప్ పుకార్లకు చెక్ పెట్టినట్టయింది. గురువారం సాయంత్రం ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్‌లో జరిగిన వార్షికోత్సవానికి ఐశ్వర్య తన భర్త అభిషేక్‌తో కలిసి హాజరయ్యారు. ఈ వేడుకలో అభిషేక్ తన సతీమణికి అంగరక్షకుడిగా కనిపించారు. పెద్దవాడైన అమితాబ్ విషయంలోను అభి-ఐష్ జంట ఎంతో కేర్ తీసుకోవడం కనిపించింది.
కుమార్తె ఆరాధ్య ఉన్న వేదిక వైపు వెళ్లేందుకు సిద్ధమైన ఐశ్వర్యను అనుసరించిన అభిషేక్ వీపుపై మెల్లగా తడుతూ భరోసా ఇచ్చే అరుదైన క్షణం ఓ వీడియోలో కనిపిస్తోంది. అలాగే అమితాబ్‌తో కలిసి నడిచి వెళుతూ అభి-ఐష్ చిరునవ్వులతో కనిపించారు. ఈ వీడియో వేగంగా అభిమానుల్లో వైరల్ అయింది. ఈ జంటను ఇలా చూసి అభిమానులు చాలా సంతోషిస్తున్నారు.
ఈ సంవత్సరం ప్రారంభంలో అనంత్ అంబానీ- రాధిక మర్చంట్ వివాహ వేడుకల్లో వేర్వేరుగా కనిపించిన తర్వాత ఐశ్వర్యారాయ్ విడాకుల గురించి ప్రచారం మొదలైంది. ఆ తర్వాత అభిషేక్ చర్యలు సందేహాలు రేకెత్తించాయి. కానీ ఇప్పుడు పరిస్థితి వేరుగా ఉంది. అయితే స్కూల్ ఈవెంట్ కోసం ఐశ్వర్యారాయ్ సపరేట్ కార్ లో వచ్చి, అమితాబ్, అభిషేక్ ని కలిసిన విజువల్స్ కొంత ఆశ్చర్యపరిచాయి. ఈవెంట్లో చేయి చేయి కలిపి కనిపించినా కానీ భార్య, భర్త ఇద్దరూ విడివిడిగా వేర్వేరు కార్లలో వెన్యూ వద్దకు రావడంపై ఆశ్చర్యం వ్యక్తమవుతోంది.