నటన వదిలేద్దామనుకున్నా: మెగా నటవారసుడు
ఏది ప్రయత్నించినా.. ఎంత ప్రయత్నించినా సరైన ఫలితం దక్కలేదు. దాంతో పూర్తిగా నిరాశపడిన అభిషేక్ బచ్చన్ కెరీర్ ఆరంభమే, నటన నుంచి దూరమవ్వాలనుకున్నాడు.
By: Tupaki Desk | 14 March 2025 9:00 PM ISTమెగాస్టార్ చిరంజీవి నటవారసుడు నటనను వదిలేయాలనుకున్నారా? అంటే..! అలాంటిదేమీ లేదు. చరణ్ బుద్ధిగా సినిమాలు చేసుకుంటూ బిజీగా ఉన్నాడు. ఆర్.ఆర్.ఆర్ చిత్రంతో పాన్ ఇండియన్ స్టార్ డమ్ ని ఆస్వాధిస్తున్నాడు. శంకర్- గేమ్ ఛేంజర్ ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోయినా నటుడిగా మంచి పేరు తెచ్చింది. తదుపరి ఉప్పెన ఫేం బుచ్చిబాబుతో క్రీడా నేపథ్య చిత్రం కోసం చరణ్ చెమటోడుస్తున్నాడు. ఈ సినిమాని పాన్ ఇండియన్ కేటగిరీలో దేశవ్యాప్తంగా విడుదల చేసేందుకు అవకాశం ఉంది.

అయితే మరో మెగా నటవారసుడు అభిషేక్ బచ్చన్ మాత్రం తాను నటనను వదిలేసి వెళ్లిపోవాలని అనుకున్నాడట.
ఏది ప్రయత్నించినా.. ఎంత ప్రయత్నించినా సరైన ఫలితం దక్కలేదు. దాంతో పూర్తిగా నిరాశపడిన అభిషేక్ బచ్చన్ కెరీర్ ఆరంభమే, నటన నుంచి దూరమవ్వాలనుకున్నాడు. కానీ అతడిని సముదాయిస్తూ అమితాబ్ బచ్చన్ చెప్పిన కొన్ని మాటలు అతడి ధృక్పథాన్ని మార్చాయి. ఇంతకీ బిగ్ బి అమితాబ్ తన వారసుడికి ఏమని సలహా ఇచ్చారు? అంటే.... చేస్తూనే ఉండు.. అనుభవంతో పాటు పరిణతి వస్తుంది. నెమ్మదిగా కుదురుకుంటావు! అనుకున్నది సాధిస్తావు! అని అమితాబ్ బచ్చన్ తన కొడుక్కి సలహా ఇచ్చారట. దాని ప్రకారమే అభిషేక్ బచ్చన్ చేసాడు. ఈరోజు ఈ స్థాయికి చేరుకున్నాడు. ఖాన్ ల త్రయం, హృతిక్ లా స్టార్ డమ్ చిక్కకపోయినా నటుడిగా తనకంటూ ఒక స్థానం ఉందని నిరూపించాడు.
మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఎల్లప్పుడూ అభిషేక్ బచ్చన్‌కు బలమైన మద్దతుదారు. ఇటీవల ప్రతి సందర్భంలో బాలీవుడ్‌లో తన కొడుకు ప్రయాణాన్ని సమర్థిస్తున్నారు. అభిషేక్ తదుపరి సినిమా `బి హ్యాపీ`ని ప్రమోట్ చేస్తున్నప్పుడు తన కెరీర్ ప్రారంభంలో ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి, ఆరంభ కష్టాల్లో తన తండ్రి ఇచ్చిన అమూల్యమైన సలహా తన జీవితంలో ఎలా మార్గదర్శక శక్తిగా మారిందనేది వివరించాడు.
కెరీర్ హీన దశలో తన తండ్రి వద్దకు వెళ్లి స్మాల్ బి మొరపెట్టుకున్నాడు. ఒక రాత్రి నాన్న వద్దకు వెళ్లి నేను తప్పు చేశానని.. ఏది ప్రయత్నించినా అది పనిచేయడం లేదని చెప్పినట్లు నాకు గుర్తుంది. బహుశా ఈ రంగం మీ కోసం కాదని ప్రపంచం నాకు చెబుతోందని భావించాను. అయితే తన తండ్రి అమితాబ్ బచ్చన్ శక్తివంతమైన మాటలు అతని దృక్పథాన్ని మార్చాయి. నేను నీ తండ్రిగా కాదు.. నటుడిగా చెబుతున్నాను. నువ్వు ఇంకా చాలా దూరం వెళ్ళాలి.. ఇప్పటివరకూ నటించిన సినిమాల్లో పరిణతి లేదు.. కానీ ప్రతి సినిమాతో మెరుగుపడుతున్నావు.. నటిస్తూ ఉండు.. అక్కడికి చేరుకుంటావు! అని అమితాబ్ తనతో అన్నారని అభిషేక్ గుర్తుచేసుకున్నాడు. వైఫల్యాలతోనే విజయాలు వెంట వస్తాయని తనకు అర్థమైందని అభిషేక్ చెప్పారు.
అనుభవం చాలా నేర్పుతుంది. మనమంతా ఓడిపోయే యుద్ధంలో పోరాడుతున్నాము. చివరికి మనలో ఎవరూ ఈ ప్రదర్శన నుండి బయటపడటం లేదు. మీరు విఫలమవుతారు, అయినా ముందుకు సాగాలి. వైఫల్యం విజయానికి ఒక ఇన్నర్ మెట్టు. వైఫల్యం లేకుండా, విజయం ఎప్పటికీ ఉండదు అని అభిషేక్ పేర్కొన్నారు. చిత్ర పరిశ్రమలో పట్టుదల అవసరం.. కెరీర్ విషయంలో కుటుంబ మద్ధతు అవసరం. కాలక్రమేణా ఈ రంగంలో ఎదగాలంటే కుటుంబ మద్ధతు అవసరమని అభిషేక్ అన్నారు.
అభిషేక్ బచ్చన్, నోరా ఫతేహి- ఇనాయత్ వర్మ ప్రధాన పాత్రల్లో నటించిన బి హ్యాపీ విడుదలకు సిద్ధమవుతోంది. ప్రఖ్యాత దర్శకుడు రెమో డిసౌజా తెరకెక్కించిన ఈ చిత్రం మార్చి 14 నుండి OTTలో ప్రీమియర్ అందుబాటులోకి వస్తోంది.