ఆ హీరో వ్యాఖ్యలు విడాకులు గురించేనా?
అభిషేక్ బచ్చన్-ఐశ్వర్యారాయ్ విడాకులు తీసుకుంటున్నారంటూ జరుగుతోన్న ప్రచారం గురించి తెలిసిందే.
By: Tupaki Desk | 24 Nov 2024 2:30 PM GMTఅభిషేక్ బచ్చన్-ఐశ్వర్యారాయ్ విడాకులు తీసుకుంటున్నారంటూ జరుగుతోన్న ప్రచారం గురించి తెలిసిందే. ఇద్దరు కొంత కాలంగా దూరంగా ఉంటున్నారని..అందుకే అభిషేక్ కుటుంబంతో ఐశ్వర్య కనిపించడం లేదని నిత్యం మీడియా కథనాలు వైరల్ అవుతూనే ఉన్నాయి. అలాగే నటి నిమ్రిత్ కౌర్ తో అభిషేక్ ఏఫైర్ ఉందంటూ మరో పుకారు వైరల్ అయింది. వివాదాలకు అసలు కారణం ఇదేనంటూ వార్తలొచ్చాయి.
సరిగ్గా ఇదే సమయంలో కుమార్తె ఆరాధ్య బర్త్ డే వేడుకలకు కూడా అభిషేక్ హాజరు కాకపోవడంతో ఈ కథనాలకు మరింత బలం చేకూరింది. కానీ వీటి గురించి ఇంతవరకూ ఎక్కడా అభిషేక్ బచ్చన్ గానీ, ఐశ్వర్యగానీ ఎలాంటి కామెంట్ చేయలేదు. తాజాగా ప్రచారాలపై అభిషేక్ బచ్చన్ పరోక్షంగా స్పందించినట్లు కనిపిస్తుంది. ఆయన ఈటీ టైమ్స్ తో మాట్లాడుతూ, ` వ్యక్తిత్వంలో, మూలసిద్ధాంతంలో మనిషిగా మనం మారకూడదని, కానీ స్వీకరించడం, అభివృద్ధి చెందడాన్ని నేర్చుకోవాలన్నారు.
లేదంటే వెనకబడిపోతామన్నారు. చెడు తన చెడును వదులుకోనప్పుడు, మంచి మాత్రం తన మంచిని ఎందుకు వదులుకోవాలని? ప్రశ్నిస్తూ పరోక్షంగా విడాకుల వార్తలను తప్పుబట్టారు. తాను చాలా సానుకూల వ్యక్తినని, ప్రతి కూలతలపై దృష్టి పెడితే అది మిమ్మల్ని కబళిస్తుందన్నారు. మనిషిగా మీరెవరు? ఎందుకు కోసం ఉన్నారు? అనేది తెలుసుకోవాలని, నేను గాలికి ఆకులా కొట్టుకుపోతానంటే అతడు అంత గొప్పవాడు అనిపించుకోడన్నారు.
అందుకనే తనలోని కొన్ని విషయాలు ఎప్పటికీ మారబోవనన్నారు. మేఘంలోని వెండి రేఖను చూసినప్పుడో, సూర్య రశ్మిని చూసినప్పుడో దానిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తే అది మన జీవితాన్ని కొనసాగించేందుకు ప్రేరణ ఇస్తుందని అభిషేక్ అభిప్రాయపడ్డారు.