కూతురు పుట్టాక అసభ్యకర సినిమాలు వదిలేశాను!
ఆరాధ్య బచ్చన్‌కు తండ్రి అయినప్పటి నుండి తన సినిమాలను స్పృహతో ఎంచుకుంటున్నానని, లైంగిక అసభ్యత ఉన్న వాటికి దూరంగా ఉన్నానని అభిషేక్ అన్నారు.
By: Tupaki Desk | 16 March 2025 8:00 PM ISTవరుసగా ప్రయోగాత్మక చిత్రాల్లో అద్భుతమైన పాత్రలతో క్రిటిక్స్ ప్రశంసలు దక్కించుకుంటున్నాడు అభిషేక్ బచ్చన్. ఇటీవల `బి హ్యాపీ` అనే హృదయాన్ని కదిలించే సినిమాలో నటించిన అతడు పాత్రలను ఎంచుకోవడంలో తన విధానం గురించి తెలిపాడు. కుమార్తె ఆరాధ్య బచ్చన్‌కు తండ్రి అయినప్పటి నుండి తన చిత్రాలను కుటుంబ సమేతంగా చూడగలిగేలా ఉండేలా జాగ్రత్త పడ్డానని, లైంగికంగా అసభ్యకర కంటెంట్ ఉన్న సినిమాలకు దూరంగా ఉన్నానని అన్నాడు. ఒక ఆడపిల్లకు బాధ్యతాయుతమైన తండ్రిగా తన నిర్ణయాలను ఎలా ప్రభావితమయ్యాయో కూడా అభిషేక్ చెప్పాడు.
ఆరాధ్య బచ్చన్‌కు తండ్రి అయినప్పటి నుండి తన సినిమాలను స్పృహతో ఎంచుకుంటున్నానని, లైంగిక అసభ్యత ఉన్న వాటికి దూరంగా ఉన్నానని అభిషేక్ అన్నారు. స్క్రిప్ట్‌లను ఎంచుకునేటప్పుడు తన స్వభావానికి నచ్చేవే ఎంచుకుంటాని చెప్పాడు. ఏదైనా సినిమా చూస్తే దానిని అతిగా విశ్లేషించే అవకాశం ఇవ్వకుండా భావోద్వేగంతో కట్టి పడేయాలని అభిషేక్ అభిప్రాయపడ్డాడు. కథ విన్న తర్వాత హృదయాలను తాకిందా లేదా? అన్నదే చూస్తాను. ఆ తర్వాత ముందుకు వెళతానని చెప్పాడు. అలాగే లైంగికంగా కనిపించేవి ఏవైనా అసౌకర్యంగా ఉంటాయి. అవన్నీ తెరపై చూపించడం నాకు ఇష్టం ఉండదు. నేను ఒంటరిగా ఒక షో చూస్తున్నప్పుడు లైంగికంగా స్పష్టంగా కనిపించేవి చూడటానికి వెనకాడతాను.. అని అన్నాడు.
తండ్రి అయ్యాక ఎలా మారోడో కూడా తెలిపాడు. నేను అమ్మాయి తండ్రి అయినప్పటి నుండి నా కూతురితో కలిసి చూడగలిగే సినిమాలు మాత్రమే చేయాలనుకుంటున్నాను. అలాంటి పాత్రల్లో నన్ను చూస్తే నా కూతురు ఎలా భావిస్తుందోనని నేను నిజంగా ఆలోచిస్తున్నాను అని అన్నారు. బి హ్యాపీ మార్చి 14న అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అయింది. రెమో డిసౌజా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అభిషేక్ బచ్చన్ అంకితభావంతో ఉన్న ఒంటరి తండ్రి శివ్ పాత్రలో నటించగా, ఇనాయత్ వర్మ అతడి కుమార్తె ధారా పాత్రలో నటించారు. నృత్యంలో ఎటువంటి నేపథ్యం లేకపోయినా, శివ్ తన కుమార్తె కలను నెరవేర్చడానికి ఒక డ్యాన్స్ కాంపిటీషన్ లోకి అడుగుపెట్టాక ఏం జరిగిందనేది సినిమా. ఈ చిత్రంలో నోరా ఫతేహి, నాసర్, జానీ లివర్, హర్లీన్ సేథి కీలక పాత్రల్లో నటించారు.