ఐశ్వర్యారాయ్‌తో పోలిక.. అభిషేక్ ఫీలయ్యాడా?
అభిషేక్ బచ్చన్ వినోద రంగంలో 25 వసంతాలు పూర్తి చేసుకున్నారు. లెజెండరీ అమితాబ్ బచ్చన్ లెగసీని నడిపించాల్సిన నటవారసుడిగా అభిషేక్ ఫెయిలయ్యాడంటూ చాలా విశ్లేషణలు సాగాయి.
By: Tupaki Desk | 18 Jan 2025 11:30 PM GMTఅభిషేక్ బచ్చన్ వినోద రంగంలో 25 వసంతాలు పూర్తి చేసుకున్నారు. లెజెండరీ అమితాబ్ బచ్చన్ లెగసీని నడిపించాల్సిన నటవారసుడిగా అభిషేక్ ఫెయిలయ్యాడంటూ చాలా విశ్లేషణలు సాగాయి. బిగ్ బితోనే కాదు.. తన భార్య ఐశ్వర్యారాయ్‌తోను అతడిని పోల్చి తక్కువ చేసి చూపించింది మీడియా. కానీ దానికి అభిషేక్ ఏనాడూ నొచ్చుకోలేదు. తాను చేయాల్సినది చేస్తూ ముందుకు సాగుతున్నాడు.
తాజా ఇంటర్వ్యూలో అభిషేక్ ఈ విషయాలన్నిటిపైనా ముచ్చటించారు. తన తండ్రి, భార్య ప్రభావం తనపై ఎంత? అని మరోసారి అభిషేక్ కి ప్రశ్న ఎదురైంది. దీనిపై అతడు తనదైన శైలిలో స్పందించాడు. ``25 సంవత్సరాలుగా అదే ప్రశ్న అడుగుతూనే ఉన్నారు. నేను దానికి దూరంగా ఉన్నాను. మీరు నన్ను నా తండ్రితో పోలుస్తుంటే ఉత్తముడితో పోలుస్తున్నారని అర్థం. మీరు నన్ను ఉత్తముడితో పోలుస్తుంటే, ఎక్కడో నేను ఈ గొప్ప పేర్లలో పరిగణించేంతగా అర్హుడనని నమ్ముతున్నాను. నా తల్లిదండ్రులు నా తల్లిదండ్రులు, నా కుటుంబం నా కుటుంబం, నా భార్య నా భార్య.. వారి పట్ల, వారి విజయాల పట్ల, వారు సాధించేదాని గురించి నేను చాలా గర్వపడుతున్నాను అని అన్నారు. 82 ఏళ్ల వయసులోను అమితాబ్ ఎంతో శ్రమిస్తున్నారని అభిషేక్ చెప్పారు. తనను కూడా తన మనవరాలు 82 ఏళ్ల వయసులో నా గురించి చెప్పుకునేలా ఎదగాలనుకుంటున్నానని అతడు అన్నారు.
సిద్ధార్థ్ ఆనంద్ తెరకెక్కిస్తున్న `కింగ్`లో షారుఖ్ ఖాన్‌తో కలిసి అభిషేక్ బచ్చన్ నటిస్తున్న సంగతి తెలిసిందే. రెమో డిసౌజా బి హ్యాపీ చిత్రంలో శివ్ రస్తోగి అనే తండ్రి పాత్రను పోషిస్తాడు. ఇందులో తన కూతురు కలల్ని నెరవేర్చే తండ్రిగా కనిపిస్తాడు. ఒక ప్రధాన డ్యాన్స్ రియాలిటీ షోలో మెరవాలనే కలను సాకారం చేసుకోవాలనే తన కుమార్తె కలను నిజం చేయడానికి అతడు మద్దతు ఇస్తాడు. ఈ చిత్రం 2025 చివర్లో విడుదల కానుంది.