Begin typing your search above and press return to search.

స్టార్ డాట‌ర్ సినిమాలో స్టార్ హీరో విల‌న్!

ఈ నేప‌థ్యంలో తాజాగా ఈ ప్రాజెక్ట్ గురించి మ‌రో ఇంట్రెస్టింగ్ విష‌యం లీక్ అయింది. ఇందులో బాలీవుడ్ హీరో అభిషేక్ బ‌చ్చ‌న్ విల‌న్ గా న‌టిస్తున్న‌ట్లు వార్త‌లొస్తున్నాయి.

By:  Tupaki Desk   |   29 Dec 2024 8:30 PM GMT
స్టార్ డాట‌ర్ సినిమాలో స్టార్ హీరో విల‌న్!
X

బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్ కుమార్తె'కింగ్` చిత్రంతో లాంచ్ అవుతోన్న సంగ‌తి తెల‌సిందే. ఇందులో బాద్ షా సైతం ఓ కీల‌క పాత్ర పోషిస్తున్న‌ట్లు ప్ర‌చారంలో ఉంది. ఆయ‌నే త‌న సొంత బ్యానర్ రెడ్ చిల్లీస్ ఎంట‌ర్ టైన్ మెంట్స్ పై నిర్మిస్తున్నారు. యాక్ష‌న్ బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్రాన్ని సుజోయ్ ఘోష్ తెర‌కెక్కించ నున్నాడు. ఈ సినిమా కోసం హాలీవుడ్ స్టంట్ మాస్ట‌ర్ల‌ని రంగంలోకి దించుతున్నారు. దీంతో ఈ సినిమాని ఎంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కి స్తున్నారు? అన్న‌ది అద్దం ప‌డుతుంది.

ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జరుగుతున్నాయి. మార్చిలో ప‌ట్టాలెక్కిం చ‌డానికి రెడీ అవుతున్నారు. ఈ నేప‌థ్యంలో తాజాగా ఈ ప్రాజెక్ట్ గురించి మ‌రో ఇంట్రెస్టింగ్ విష‌యం లీక్ అయింది. ఇందులో బాలీవుడ్ హీరో అభిషేక్ బ‌చ్చ‌న్ విల‌న్ గా న‌టిస్తున్న‌ట్లు వార్త‌లొస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్ కోసం షారుక్ ఖాన్ ప్ర‌త్యేకంగా అభిషేక్ ని రిక్వెస్ట్ చేసిన‌ట్లు స‌మాచారం. ఆయ‌న మాట కాద‌న‌లేక అభిషేక్ కూడా అంగీక‌రించాడ‌ని వినిపిస్తుంది.

అయితే ఈ సినిమాలో హీరో ఎవ‌రు? అన్న‌ది ఇంత వ‌ర‌కూ క‌న్ప‌మ్ అవ్వ‌లేదు. షారుక్ ఖాన్ కేవ‌లం ఓ కీల‌క పాత్ర పోషిస్తున్నాడ‌నే ప్ర‌చారంలో ఉంది. కుమార్తెకు అది గురువు రోల్ లా ఉంటుందంటున్నారు. షారుక్ ఖాన్ ఈ సినిమాలో న‌టించ‌డంతో త‌న స్టార్ డ‌మ్ ని సైతం ప‌క్క‌న‌బెట్టిన‌ట్లు తెలుస్తోంది. ఇప్పుడు అభిషేక్ బ‌చ్చ‌న్ ని రిక్వెస్ట్ చేయ‌డంతో? షారుక్ ఈ చిత్రాన్ని ఎంత ప్ర‌తిష్టాత్మ‌కంగా భావిస్తున్నారు? అన్న‌ది అర్దమ‌వుతుంది.

ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివ‌రాలు త్వ‌ర‌లోనే అధికారికంగా ప్ర‌క‌టించ‌నున్నారు.'జ‌వాన్` త‌ర్వాత షారుక్ ఖాన్ హీరోగా ఇంత‌వ‌ర‌కూ కొత్త ప్రాజెక్ట్ ప్ర‌క‌టించ‌లేదు. ఆ సినిమా రిలీజ్ అనంత‌రం కుమార్తె ప్రాజెక్ట్ ప‌నుల్లోనే బిజీ అయ్యారు. ఈ నేప‌థ్యంలోనే డాట‌ర్ కోసం డాడ్ కూడా మ్యాక‌ప్ వేసుకుంటున్నారు. ఈసినిమా పట్టాలెక్కిన అనంత‌రం షారుక్ సోలో ప్రాజెక్ట్ ప్ర‌క‌టించే అవ‌కాశం ఉంది.