Begin typing your search above and press return to search.

డ‌బ్బుకు డబ్బు సంపాద‌న‌.. స్మాల్ బ‌చ్చ‌న్ ఆస్తి విలువ‌?

అతడు త‌న తండ్రి స్థాయిలో స్టార్ డ‌మ్ ని అందుకోక‌పోయినా, ప‌రిశ్ర‌మ‌లో త‌న‌కంటూ ఒక వాటా ఉంద‌ని నిరూపిస్తున్నాడు.

By:  Tupaki Desk   |   5 Feb 2025 3:30 PM GMT
డ‌బ్బుకు డబ్బు సంపాద‌న‌.. స్మాల్ బ‌చ్చ‌న్ ఆస్తి విలువ‌?
X

ప‌రిణ‌తి ఉన్న స్క్రిప్ట్ ఎంపిక‌లతో వైవిధ్య‌మైన పాత్ర‌ల్లో న‌టిస్తూ అభిషేక్ బ‌చ్చ‌న్ ఇటీవ‌ల చ‌ర్చ‌నీయాంశంగా మారుతున్నాడు. అతడు త‌న తండ్రి స్థాయిలో స్టార్ డ‌మ్ ని అందుకోక‌పోయినా, ప‌రిశ్ర‌మ‌లో త‌న‌కంటూ ఒక వాటా ఉంద‌ని నిరూపిస్తున్నాడు. అయితే తెలివైన పెట్టుబ‌డుల‌తో 'డ‌బ్బు టు ద ప‌వ‌ర్ ఆప్ డ‌బ్బు!' ఫార్ములాను అన్వ‌యించ‌డంలో అభిషేక్ (స్మాల్ బ‌చ్చ‌న్) తండ్రిని మించిపోతున్నాడు. సినిమాలతో పాటు, క్రీడలు, లగ్జరీ ఆటోమొబైల్స్, వ్యవస్థాపక రంగాల్లో, ఆశాజనకమైన స్టార్టప్‌లలో పెట్టుబడులు పెడుతున్నాడు. అన్ని మార్గాల్లోను 2024 నాటికి అత‌డి నిక‌ర ఆస్తుల విలువ దాదాపు రూ. 280 కోట్లు. న‌ట‌నా కెరీర్ స‌హా వ్యాపారాల ద్వారా అత‌డు ఇంత పెద్ద మొత్తాన్ని ఆర్జించాడు.

అభిషేక్ గ్యారేజ్‌లో లగ్జరీ కార్ల‌కు కొద‌వేమీ లేదు. రూ. 3.29 కోట్ల విలువైన బెంట్లీ కాంటినెంటల్ జీటీ, రూ. 2 కోట్ల ధర తో W221 మెర్సిడెస్-బెంజ్ S-క్లాస్, మెర్సిడెస్-బెంజ్ జీటీ 63 AMG , రూ. 1.58 కోట్ల విలువైన ఆడి A8L ఉన్నాయి. ఈ వాహనాల కొనుగోలుతో అత‌డి ల‌గ్జ‌రీ హ్యాబిట్ ని అర్థం చేసుకోవ‌చ్చు.

ఇటీవ‌ల త‌న తండ్రి అమితాబ్ తో పాటు భారీగా రియ‌ల్ వెంచ‌ట‌ర్ల‌లో పెట్టుబ‌డులు పెడుతున్నాడు. జూన్ 2024లో అభిషేక్ ముంబైలోని బోరివలిలో రూ. 15 కోట్లకు ఆరు అపార్ట్‌మెంట్‌లను కొనుగోలు చేసారు. అప్ప‌టికే ఉన్న‌ ఆస్తులకు ఇవి అద‌న‌పు ఆస్తి. ముంబై వర్లిలోని స్కైలార్క్ టవర్స్‌లో 2015లో రూ. 21 కోట్లకు కొనుగోలు చేసిన విలాసవంతమైన 5-BHK అపార్ట్‌మెంట్ కూడా ఉంది. దుబాయ్‌లోని ప్రతిష్టాత్మక జుమేరా గోల్ఫ్ ఎస్టేట్స్‌లో ఒక విలాసవంతమైన విల్లాను అభిషేక్ సొంతం చేసుకున్నాడు. హై-ఎండ్ రియల్ ఎస్టేట్ లో పెట్టుబ‌డులు పెడుతూ.. వాటిని రీసేల్ చేస్తూ కూడా అభిషేక్ ఆర్జిస్తున్నాడు. అత‌డి కొనుగోళ్లు అత‌డి అభిరుచిని ప్రతిబింబిస్తున్నాయి. ఇక‌పోతే అభిషేక్ బ‌చ్చ‌న్ భార్య, మాజీ ప్ర‌పంచ సుంద‌రి ఐశ్వ‌ర్యారాయ్ ఆస్తుల విలువ సుమారు 800కోట్లు. భార్య‌తో పోలిస్తే స్మాల్ బి ఆస్తుల విలువ చాలా చిన్న‌ది.

కెరీర్ ప‌రంగా చూస్తే.. ఇటీవ‌ల న‌టించిన అత‌డి సినిమాలు కొన్ని న‌టుడిగా మంచి పేరును తెచ్చాయి. తదుప‌రి ప్ర‌తిష్ఠాత్మ‌క య‌ష్ రాజ్ ఫిలింస్ ధూమ్ 4 లో అత‌డు తిరిగి త‌న పోలీస్ పాత్ర‌లో న‌టించ‌నున్నాడు. గులాబ్ జ‌మూన్, డ్యాన్సింగ్ డాడ్ వంటి చిత్రాల్లోను అభిషేక్ న‌టిస్తున్నాడు.