టైగర్ నాగేశ్వరరావు నిర్మాతకు సడన్ ఐటీ షాక్
మాస్ మహారాజ్ రవితేజ టైగర్ నాగేశ్వరరావు సినిమా విడుదలకు సిద్ధంగా ఉండగా ప్రమోషన్స్ లో చిత్ర యూనిట్ సభ్యులు అందరూ కూడా చాలా బిజీగా పాల్గొంటున్నారు
By: Tupaki Desk | 11 Oct 2023 9:21 AM GMTమాస్ మహారాజ్ రవితేజ టైగర్ నాగేశ్వరరావు సినిమా విడుదలకు సిద్ధంగా ఉండగా ప్రమోషన్స్ లో చిత్ర యూనిట్ సభ్యులు అందరూ కూడా చాలా బిజీగా పాల్గొంటున్నారు. అయితే ఈ సమయంలో నిర్మాత అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ కార్యాలయంలో ఐటీ అధికారులు సోదరులు నిర్వహించడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిపోయింది. ఐటీ జిఎస్టికి సంబంధించిన లావాదేవీల విషయంలో అధికారులు హఠాత్తుగా చిత్ర నిర్మాణ సంస్థ అభిషేక్ అగర్వాల్ కార్యాలయంలో సోదరులు నిర్వహిస్తోన్నట్లు సమాచారం.
అయితే ఈ తరహా ఐటి రైట్స్ ఇండస్ట్రీలో కొత్తేమి కాదు. గతంలో మైత్రి మూవీ మేకర్స్ అలాగే మరికొంతమంది ప్రముఖ నిర్మాతల ఆఫీసులలో కూడా అధికారులు సోదాలు నిర్వహించారు. ఇక ఇప్పుడు టైగర్ నాగేశ్వరరావు సినిమా నిర్మాత అభిషేక్ అగర్వాల్ సంస్థ వైపు యూ టర్న్ తీసుకోవడం కొంత హాట్ టాపిక్ గా మారింది. ఈ మధ్య కాలంలో అభిషేక్ అగర్వాల్ వరుస విజయాలతో దూసుకుపోతున్నారు.
ది కాశ్మీర్ ఫైల్స్ వీరి ప్రొడక్షన్ లోనే తెరపైకి వచ్చింది. ఆ సినిమా ప్రపంచం వ్యాప్తంగా ఉహించని స్థాయిలో. కలెక్షన్స్ అందుకోవడమే కాకుండా బీజీపీ ప్రముఖ నాయకుల మన్ననలు కూడా పొందింది. అలాగే కార్తికేయ 2 సినిమా కూడా పాన్ ఇండియా రేంజ్ లో మంచి వసూళ్లను సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు టైగర్ నాగేశ్వరరావు సినిమాను కూడా అదే తరహాలో గ్రాండ్ గా విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు.
గత రెండు మూడు వారాలుగా టైగర్ నాగేశ్వరరావు చిత్ర యూనిట్ సభ్యులు ప్రమోషన్స్ తో చాలా బిజీగా గడుపుతున్నారు. హీరో రవితేజ తో పాటు హీరోయిన్ కూడా అటు నార్త్ లొనే కాకుండా ఇటు సౌత్ లో కూడా గ్యాప్ లేకుండా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఈ సినిమాతో తప్పకుండా బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ ఆదుకోవాలి అని రవితేజ ప్రమోషన్ అయితే చేస్తున్నాడు.
ఈ సినిమా రవితేజ కెరీర్ లోనే అత్యధిక భారీ బడ్జెట్ తో రూపొందింది. ఈనెల 23వ తేదీన టైగర్ నాగేశ్వరరావు తెలుగు లొనే కాకుండా హిందీ తమిళ్ మలయాళం కన్నడ భాషలో విడుదలవుతోంది. ఇక సినిమా విడుదలకు సిద్దమవుతున్న సమయంలో ఐటీ సోదాలు జరగడం చర్చనీయాంశంగా మారింది. మరి ఈ విషయంలో ఆ సంస్థ ఎలాంటి క్లారిటీ ఇస్తుందో చూడాలి.