అభిషేక్- ఐశ్వర్యారాయ్ మళ్లీ విడాకుల గోల!
అభిషేక్ బచ్చన్-ఐశ్వర్యారాయ్ దంపతుల మధ్య విడాకుల ప్రచారం గురించి చెప్పాల్సిన పనిలేదు.
By: Tupaki Desk | 30 Jan 2024 11:33 AM GMTఅభిషేక్ బచ్చన్-ఐశ్వర్యారాయ్ దంపతుల మధ్య విడాకుల ప్రచారం గురించి చెప్పాల్సిన పనిలేదు. ఎప్పటికప్పుడే ఇద్దరువిడిపోతున్నారంటూ బాలీవుడ్ మీడియాలో పుంకాలు పుంకాలుగా కథనాలు వైరల్ అవుతుంటాయి. ఇన్ స్టా వంటి మాధ్యమాల్లో అభిషేక్ చేసిన కొన్ని ఆసక్తికర పోస్టులు ఆధారంగా ఇది విడాకులకు కారణమే అంటూ ఎన్నోసార్లు ప్రచారం సాగింది.
అయితే ఈ ప్రచారాన్ని ఆ జోడీ ఏనాడు ఖండించను లేదు. విఫలమవుతుందనే భయం మీ కలల్ని నాశనం చేస్తుందని అభిషేక్ ఆ మధ్య ఓ పోస్ట్ పెట్టాడు. ఆ తర్వాత అభిషేక్ తో పాటు హాజరు కావాల్సిన ఈవెంట్లకు ఐశ్వర్య రాయ్ కేవలం కుమార్తె ఆరాధ్యతోనే హాజరవ్వడం వంటి సన్నివేశాలు మరింత ప్రచారాన్ని పురిగొల్పాయి. ఆ తర్వాత మామ అమితాబచ్చన్ తో కోడులు ప్రోకబడ్డీ కోసం రావడంతో ఇదంతా గాలి ప్రచారమని వెలుగులోకి వచ్చింది.
అలాగే మరో ఈవెంట్ కి వచ్చిన అభిషేక్ బచ్చన్ పెళ్లి ఉంగరం తీసేసి బోడి వేలితోనూ కనిపించాడు. దీంతో అది విడాకుల ప్రచారంగానే హైలైట్ అయింది. ఇలా ఇప్పటివరకూ ఆ దంపతులపై రకరకాల ప్రచారం సాగింది. తాజాగా అభిషేక్ చేసిన పోస్ట్ మరోసారి మీడియా లో చర్చనీయాంశంగా మారింది. తన ఇన్ స్టా స్టోరీస్ లో మరోసారి ఫెయిల్యూర్ పై ఓ పోస్ట్ పెట్టడమే విడాకుల మ్యాటర్ తెరపైకి వస్తుంది.
ఈ పోస్ట్ ద్వారా ఐశ్యర్యతో తన రిలేషన్ షిప్ ఎలా ఉందో? అర్దమవుతుందని.. ఇది విడాకులకు హింట్ అంటూ నెటి జనులు కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం నెట్టింట చర్చంతా ఇదే జరుగుతుంది. మరి ఈసారైనా అభిషేక్-ఐశ్వర్య మీడిమా ముందుకొచ్చి ఈ ప్రచారాన్ని కండిస్తారా? కొనసాగించేలా చేస్తారా? అన్నది చూడాలి. ఇద్దరు వివాహ బంధంలోకి అడుగు పెట్టి 16 ఏళ్లూ పూర్తయిన సంగతి తెలిసిందే. ఆ జంటకు ఆరాధ్య అనే కుమార్తె కూడా ఉంది. ఈ మధ్య సోషల్ మీడియాలోనూ ఆరాధ్య ఎక్కువగా హైలైట్ అవుతుంది.