ఐష్ మాజీ ప్రియులపై అభిషేక్ ఫన్
అతడు ఇతరులతో పోలిస్తే అందరికంటే చమత్కారం తెలిసినవాడు అనడానికి ఈ పాత వీడియో రుజువు.
By: Tupaki Desk | 23 March 2024 4:30 AM GMTబాలీవుడ్‌లో షారూఖ్ ఖాన్ తర్వాత చమత్కారమైన నటుల్లో అభిషేక్ బచ్చన్ ఒకరు. అతడిని ప్రజలు కూల్ జూనియర్ బచ్చన్ అని పిలుస్తారు. అభి దానిని పదే పదే నిరూపించాడు. అతడు ఇతరులతో పోలిస్తే అందరికంటే చమత్కారం తెలిసినవాడు అనడానికి ఈ పాత వీడియో రుజువు.
అభిషేక్ తన భార్య ఐశ్వర్యారాయ్ మాజీ ప్రియుల గురించి చాలా లైటర్ వెయిన్‌లో కామెంట్ చేసాడు. ఆ ఇద్దరి గురించి ప్రశ్నించిన హోస్ట్ ముందు ఛమత్కారంగా మాట్లాడాడు. ఐశ్వర్యారాయ్ తో డేటింగ్ చేసిన ఇద్దరు హీరోలు సల్మాన్ ఖాన్, వివేక్ ఒబేరాయ్.. పబ్లిగ్గా ఘర్షణ పడటం అప్పట్లో సంచలనమే అయింది. ఐష్ తన నుంచి విడిపోవడానికి కారణం వివేక్ ఒబేరాయ్ అని నమ్మిన సల్మాన్ ఖాన్ బహిరంగంగా గొడవకు దిగాడు. అది అప్పట్లో జాతీయ మీడియాలో సంచలనం అయింది.
కానీ ఒబేరాయ్ నుంచి బ్రేకప్ అయ్యాక ఐశ్వర్యారాయ్ అభిషేక్ బచ్చన్ ని పెళ్లాడింది. ఇదంతా పాత కథే .. తెలిసిన కథే అనుకున్నా కానీ, ఇప్పుడు వివేక్, సల్మాన్ లపై అభిషేక్ లైటర్ వెయిన్ లో జోక్ చేసిన వీడియో హాట్ టాపిక్ గా మారింది.
ఒబేరాయ్ తో సల్మాన్ ఫైట్ సీన్ గురించి `కాఫీ విత్ కరణ్`లో ప్రస్థావించిన కరణ్.. లిఫ్ట్‌లో సల్మాన్ - వివేక్‌లతో కలిసి చిక్కుకుంటారా? అని ప్రశ్నించగా అభిషేక్ బచ్చన్ బహిరంగంగా వారిని ఎగతాళి చేశాడు. వివేక్ సల్మాన్‌ని కలవనీయండి.. వివేక్‌ని సల్మాన్ తినేస్తాడు! అంటూ అభిషేక్ సరదాగా వ్యాఖ్యానించాడు. అభిషేక్ బచ్చన్‌తో పాటు షోలో భాగమైన ప్రీతి జింటా ``అలా చేస్తే తనకు మంచిది`` అని పేర్కొంది. వివేక్ సల్మాన్‌ను కలిశాడు.. సల్మాన్ వివేక్‌ను ఓడించాడు! అని ప్రీతి అన్నారు. ప్రీతి జింటా సల్మాన్ ఖాన్‌తో చాలా సన్నిహితంగా ఉంది. సంవత్సరాలుగా అతడితో గొప్ప బంధాన్ని పంచుకుంది. ఐష్‌తో లవ్ లో ఉన్నా కానీ ప్రీతితోను సల్మాన్ సన్నిహితంగానే ఉన్నాడు!
ఇప్పటికి అభిషేక్ - ఐశ్వర్య వివాహం జరిగి 16 సంవత్సరాలు అయ్యింది. అభిషేక్- సల్మాన్ ఖాన్‌తో మంచి స్నేహం కొనసాగించాడు. ఐశ్వర్య ఎప్పుడూ వివేక్‌తో ఎఫైర్ గురించి బహిరంగంగా మాట్లాడలేదు కానీ తనపై శారీరక వేధింపుల కారణంగా సల్మాన్ నుంచి ఎలా విడిపోయిందో చెప్పింది. అయితే సల్మాన్ తనపై అలాంటి ప్రచారాన్ని ఖండించాడు.