Begin typing your search above and press return to search.

మళ్లీ 'ఆచార్య' రచ్చ... ఇప్పుడు అవసరమా?

మెగాస్టార్ చిరంజీవి, రామ్‌ చరణ్ కలిసి నటించిన ఆచార్య సినిమా సంచలన విజయాన్ని సొంతం చేసుకుంటుందని అంతా భావిస్తే డిజాస్టర్ గా నిలిచిన విషయం తెల్సిందే.

By:  Tupaki Desk   |   9 Jan 2024 11:50 AM IST
మళ్లీ ఆచార్య రచ్చ... ఇప్పుడు అవసరమా?
X

మెగాస్టార్ చిరంజీవి, రామ్‌ చరణ్ కలిసి నటించిన ఆచార్య సినిమా సంచలన విజయాన్ని సొంతం చేసుకుంటుందని అంతా భావిస్తే డిజాస్టర్ గా నిలిచిన విషయం తెల్సిందే. అందుకే మళ్లీ చిరంజీవి, చరణ్‌ నటించాలనే డిమాండ్ కూడా మెగా ఫ్యాన్స్ లో వినిపించడం లేదు.

కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ఆచార్య సినిమా డిజాస్టర్‌ కి అనేక కారణాలు ఉన్నాయి. అయితే కొన్ని విషయాలను పట్టుకుని ఒకరిని ఒకరు విమర్శలు చేసుకోవడం ఆ మధ్య జరిగింది. ఆచార్య సినిమా గురించి చర్చ రాకుంటేనే బాగుంటుంది అన్నట్లుగా మెగా ఫ్యాన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఆచార్య సినిమా విడుదల అయ్యి దాదాపుగా రెండేళ్లు అవుతోంది. మెల్ల మెల్లగా సినిమా గురించిన చర్చ తగ్గి పోయింది. చిరంజీవి కి సంబంధించిన ఇతర సినిమాల గురించిన చర్చ జరుగుతోంది. ఇలాంటి సమయంలో హిందీ లో ఆచార్య విడుదల చేయబోతున్నట్లుగా పెన్ స్టూడియో ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది.

యూట్యూబ్‌ ఛానల్ లో పెన్‌ స్టూడియో వారు ఆచార్య ను విడుదల చేయబోతున్నారు. ఆ విషయాన్ని అధికారికంగా తెలియజేయడంతో పాటు ట్రైలర్‌ ని కూడా విడుదల చేశారు. డబ్బింగ్‌ క్వాలిటీ లో గా ఉందని మళ్లీ ఆచార్య పై ట్రోల్స్ రచ్చ మొదలు అయ్యింది. దాంతో మెగా ఫ్యాన్స్ ఈ సమయంలో ఆచార్య డబ్బింగ్ స్ట్రీమింగ్‌ అవసరమా అన్నట్లుగా కొందరు అసహనం వ్యక్తం చేస్తున్నారు.