13 ఏళ్ల తర్వాత మళ్లీ కంబ్యాక్!
ప్రస్తుతం అక్కడ మాలీవుడ్ స్టార్ హీరో టివినో థామస్ సరసన `ఐడెంటిటీ` అనే చిత్రంలో నటిస్తోంది.
By: Tupaki Desk | 1 Jan 2024 4:30 PM GMTఅందాల త్రిష సెకెండ్ ఇన్నింగ్స్ లోనూ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. వరుసగా అవకాశాలు అందుకుంటూ నవ నాయికల్ని మించి క్రేజీ ప్రాజెక్ట్ ల్లో నటిస్తోంది. `పొన్నియన్ సెల్వన్` ప్రాంచైజీతో అమ్మడి పేరు పాన్ ఇండియాలో మరింత బలంగా నాటుకుంది. దీంతో పాన్ ఇండియా ఛాన్సులు చేజిక్కిం చుకుంటుంది. ఇటీవలే మాలీవుడ్ లో సైతం అడుగు పెట్టింది. ప్రస్తుతం అక్కడ మాలీవుడ్ స్టార్ హీరో టివినో థామస్ సరసన `ఐడెంటిటీ` అనే చిత్రంలో నటిస్తోంది.
టాలీవుడ్ లోనూ క్రేజీ ఛాన్సులు క్యూలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా అమ్మడు బాలీవుడ్ లోనూ కంబ్యాక్ కి రెడీ అవుతోంది. దాదాపు 13 ఏళ్ల తర్వాత మళ్లి తిరిగి బాలీవుడ్ లో అడుగు పెడుతుంది. కంబ్యాక్ లో భారీ ఛాన్సే ఒడిసి పట్టుకుంది. ఏకంగా బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ తో నటించే ఛాన్స్ దక్కించుకుంది. విష్ణు వర్ధన్ దర్శకత్వంలో సల్మాన్ ఖాన్ హీరోగా `ది బుల్` చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో హీరోయిన్ గా అమ్మడిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.
ఈ చిత్రాన్ని కరణ్ జోహార్ నిర్మిస్తున్నారు. త్రిషకిది బాలీవుడ్ లో రెండవ చిత్రం. తొలుత అక్షయ్ కుమార్ హీరోగా నటించిన `కట్టా మిట్టా`తో బాలీవుడ్ లో అడుగు పెట్టింది. ఆ సినిమా పెద్దగా ఆడలేదు. ఆ తర్వాత అమ్మడికి అక్కడ అవకాశాలు కూడా రాలేదు. అదే సమయంలో కొన్ని తమిళ సినిమాలతోనూ బిజీగా ఉంది. దీంతో హిందీ మార్కెట్ పైపెద్దగా దృష్టిపెట్టలేదు. పరిగెత్తి పాలు తాగడం కన్నా నిలబడి నీళ్లు తాగడం అని ఉత్తమంగా భావించిన అమ్మడు సౌత్ లోనే కొనసాగింది.
అయితే పొన్నియన్ సెల్వన్ తో వచ్చిన గుర్తింపుతో పాన్ ఇండియాలో కొత్త అవకాశాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మరోసారి హిందీ పరిశ్రమకి వె ళ్తోంది. ఇక ఈ సినిమాకి దర్శకత్వం వహించే విష్ణు వర్దన్ కూడా కోలీవుడ్ మేకర్. ఆ రకంగా త్రిష ఎంట్రీ వెనుక ఆయన కీలక పాత్రదారి అయి ఉండొచ్చు.