Begin typing your search above and press return to search.

బాబాయ్ కోసం అబ్బాయ్ స‌ర్ ప్రైజ్ ప్లాన్!

విక్ట‌రీ వెంక‌టేష్ క‌థానాయ‌కుడిగా శేలేష్ కొల‌ను ద‌ర్శ‌క‌త్వంలో పాన్ ఇండియాలో `సైంధ‌వ్` తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే.

By:  Tupaki Desk   |   26 Dec 2023 2:30 AM GMT
బాబాయ్ కోసం అబ్బాయ్ స‌ర్ ప్రైజ్ ప్లాన్!
X

బాబాయ్ కోసం అబ్బాయ్ భారీ గా ప్లాన్ చేస్తున్నాడా? ల్యాండ్ మార్క్ చిత్రం జ‌నాల్లోకి బ‌లంగా వెళ్లేలా ప్ర‌త్యేక ప్రణాళిక అనుస‌రిస్తున్నాడా? బాబాయ్ కెరీర్ లో బెస్ట్ గా నిలిచిపోయేలా ప్లాన్ చేస్తున్నాడా? అంటే అవున‌నే తెలుస్తోంది. ఇంత‌కీ ఎవ‌రా బాబాయ్..ఎవ‌రా అబ్బాయ్! అంటే వివ‌రాల్లోకి వెళ్లాల్సిందే. విక్ట‌రీ వెంక‌టేష్ క‌థానాయ‌కుడిగా శేలేష్ కొల‌ను ద‌ర్శ‌క‌త్వంలో పాన్ ఇండియాలో `సైంధ‌వ్` తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే.

వెంక‌టేష్ కెరీర్ లో తొలి పాన్ ఇండియా చిత్ర‌మిది. ఇప్ప‌టికే రిలీజ్ అయిన ప్ర‌చార చిత్రాల‌తో సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. పైగా శైలేష్ కంటెంట్ అంటే మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది. ఈ నేప‌థ్యంలో అంచ‌నాలు స్కైనే ట‌చ్ చేస్తున్నాయి. వీట‌న్నింటికి మించి వెంకీ కెరీర్ లో ఇది ల్యాండ్ మార్క్ 75వ చిత్రం. దీంతో ఈ సినిమాని జ‌నాల్లోకి బ‌లంగా తీసుకెళ్లేలా అబ్బాయ్ రానా ప్ర‌త్యేకంగా ప్లాన్ చేస్తున్న‌ట్లు ప్ర‌చారం సాగుతోంది.

డైమండ్ జూబ్లీ తో బాబాయ్ కి భారీ హిట్ అందించి త‌న ఐడెంటీటిని వేయాల‌ని ప్ర‌త్యేక ప్ర‌ణాళిక‌లో ఉన్న‌ట్లు తెలుస్తుంది. బాబాయ్ కోసం రానా ప్ర‌త్యేకంగా ఓ ఈవెంట్ చేయాల‌ని ప్తాన్ చేస్తున్నారుట‌. అందుకోసం ఏకంగా ఓ పెద్ద స్టార్ ని ఈవెంట్ కి తీసుకొచ్చి సైంధ‌వ్ ని ప్రేక్ష‌కుల్లోకి తీసుకెళ్లాల‌ని భావిస్తున్నాడుట‌. మెగాస్టార్ చిరంజీ.. డార్లింగ్ ప్రభాస్..సూప‌ర్ స్టార్ మహేష్ స‌హా కొంత మంది యంగ్ హీరోల పేర్లు తెర‌పైకి వ‌స్తున్నాయి.

స్టార్ హీరోల్లో ఎవ‌రో ఒక‌ర్ని బాబాయ్ కోసం తీసుకురావాల‌ని ప్లాన్ చేస్తున్నాడుట‌. బాబాయ్ కి చెప్ప‌కుండా స‌ర్ ప్రైజ్ చేయాల‌ని ఇలా ప్లాన్ చేస్తున్న‌ట్లు వినిపిస్తుంది. మ‌రి ఇందులో నిజ‌మెంతో? తెలియాలి. వెంక‌టేష్ గోల్డెన్ జూబ్లీ చిత్రం `వాసు`. ఈ సినిమా మ్యూజిక‌ల్ గా పెద్ద విజ‌యం సాధించింది. కానీ క‌మ‌ర్శియ‌ల్ గా మాత్రం ఆశించిన ఫ‌లితాలు సాధించ‌లేదు. కానీ డైమండ్ జూబ్లీ మాత్రం అన్ని ర‌కాలుగా స‌క్సెస్ చేయాల‌ని ద‌గ్గుబాటి ఫ్యామిలీ ప్లాన్ చేస్తున్న‌ట్లు క‌నిపిస్తుంది.