ఆ హీరోలిద్దరి మధ్య కొట్లాట!
తాజాగా లారెన్స్-మాధవన్ కలిసి నటించడానికి రెడీ అయ్యారు. అయితే ఈసారి విలన్ పాత్ర బాధ్యతలు మాధవన్ తీసుకుంటున్నారు.
By: Tupaki Desk | 12 Dec 2024 6:09 AM GMTసినిమాల ట్రెండ్ మారిందిప్పుడు. మల్టీస్టారర్ ని మించి గొప్ప చిత్రాలు తెరకెక్కుతున్నాయి. ఈ విషయంలో దర్శకులకు హీరోలు ఎంతగానో సహకరిస్తున్నారు. ఎంత పెద్ద స్టార్ అయిన ఇతర స్టార్ తో కలిసి నటించడానికి ఏమాత్రం వెనకడుగు వేయడం లేదు. తమ స్టార్ డమ్ ని పక్కనబెట్టి పాత్రలోకి పరకాయ ప్రవేశం చేస్తున్నారు. అందుకే 'బాహుబలి', 'ఆర్ ఆర్ ఆర్' లాంటి గొప్ప చిత్రాలు రాగలిగాయి.
పాన్ ఇండియా చిత్రాల ట్రెండ్ నడుస్తోన్న నేపథ్యంలో ఆ మార్కెట్ ని అందుకోవడం కోసం ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా లారెన్స్-మాధవన్ కలిసి నటించడానికి రెడీ అయ్యారు. అయితే ఈసారి విలన్ పాత్ర బాధ్యతలు మాధవన్ తీసుకుంటున్నారు. ఇంతకీ ఏంటా సినిమా అంటే వివరాల్లోకి వెళ్లాల్సిందే. లారెన్స్ ప్రధాన పాత్రలో 'రెమో' ఫేం బకియారాజ్ కన్నన్ 'బెంజ్' చిత్రాన్ని తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే.
యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యం గల చిత్రానికి లోకేష కనగరాజ్ కథ అందించారు. ఇప్పటికే షూటింగ్ దశలో ఉందీ చిత్రం. అయితే ఇందులో ప్రధాన విలన్ గా మాధవన్ ని ఎంపిక చేసినట్లు సమాచారం. ఆ పాత్రకు మ్యాడీ అయితే పర్పెక్ట్ గా సూటవుతాడని..రోల్ కూడా స్టైలిష్ గా ఉంటుందని అంటున్నారు. లారెన్స్...మ్యాడీ మధ్య యాక్షన్ సన్నివేశాలు సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయన వినిపిస్తుంది. మాధవన్ ఎంట్రీ విషయాన్ని త్వరలోనే అధికారికంగా రివీల్ చేయనున్నారని సమాచారం.
కొంత కాలంగా మాధవన్ హీరోగానే కాకుండా కీలక పాత్రలు పోషిస్తున్న సంగతి తెలిసిందే. స్టోరీ డిమాండ్ చేసి నచ్చితే ఎలాంటి పాత్ర అయినా పోషిస్తాడు. ప్రస్తుతం మాధవన్ బాలీవుడ్ లో ఎక్కువగా సినిమాలు చేస్తున్నారు. ఐదారు సినిమాలు ఆన్ సెట్స్ లో ఉన్నాయి. అలాగే కోలీవుడ్ లో ఓ సినిమా చేస్తున్నారు.