బాలాకు తప్పుడు మెడిసిన్ ఇచ్చిందెవరు?
రీసెంట్ గా ఓ సందర్భంలో హానికరమైన మందులిచ్చి తన ఆరోగ్యాన్ని కొందరు కావాలని పాడు చేయాలనుకున్నారని తెలిపాడు.
By: Tupaki Desk | 25 Feb 2025 2:30 AM GMTమలయాళ నటుడు బాలా గురించి అందరికీ తెలిసిందే. రీసెంట్ గా ఓ సందర్భంలో హానికరమైన మందులిచ్చి తన ఆరోగ్యాన్ని కొందరు కావాలని పాడు చేయాలనుకున్నారని తెలిపాడు. దీంతో ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. తనకు ఇప్పటివరకు రెండు సర్జరీలు జరిగాయని చెప్పిన బాలా మరికొన్ని వ్యక్తిగత విషయాలను వెల్లడించాడు.
గతేడాది జరిగిన ఓ సర్జరీ తర్వాత తనకు మంచి మెడిసిన్ ఇవ్వకుండా తన ఆరోగ్యం పాడయ్యే మందులిచ్చారని, అలాంటి మెడిసిన్ తనకు ఎవరు ఇచ్చారో చెప్పనని చెప్పిన ఆయన, అసలు విషయం తెలియక వాళ్లిచ్చిన మందుల్నే వాడి తీవ్ర అనారోగ్యంతో 10 రోజుల పాటూ హాస్పిటల్ పాలైనట్టు వెల్లడించాడు.
తాను హాస్పిటల్ పాలైన టైమ్ లో తన బంధువు కోకిల తనకు తల్లిలా సేవ చేసిందని చెప్పుకొచ్చిన బాలా రెండేళ్ల కిందట తాను ఐసీయూలో ఉన్నప్పుడు చనిపోయానని వార్తలొచ్చాయని, ఆ టైమ్ లో తాను వెంటిలేటర్ పై ఉన్నానని చెప్పాడు. అప్పుడు తన అవయవాలేవీ పని చేయలేదని తన చావు ను కన్ఫర్మ్ చేసేసి, పోస్ట్‌మార్టమ్ చేయాలని డాక్టర్లు డిసైడ్ అయినట్టు తెలిపాడు.
అయితే ఆ టైమ్ లో తన కోసం ఎంతోమంది దేవుడికి ప్రార్థించారని, తాను పాతికేళ్లుగా చేసిన సేవా కార్యక్రమాలే తనను బతికించాయని తెలిపాడు. మూడు నెలల కిందట తనకు కోకిలకు పెళ్లైందని చెప్పిన బాలా, ఈ మధ్యనే మరొకరికి హార్ట్ సర్జరీ చేయించినట్టు తెలిపాడు.
ఇదిలా ఉంటే బాలా ఇప్పటివరకు నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నాడు. బాలా సెకండ్ వైఫ్ అమృత గతేడాది అతనిపై వేధింపుల కేసు పెట్టగా, మూడో భార్య ఎలిజిబెత్ రీసెంట్ గా బాలా తనను టార్చర్ చేశాడని సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. అంతేకాదు, తనకు ఎవరైనా తప్పుడు మెడిసిన్ ఇచ్చి ఉంటే ఆ విషయాన్ని ప్రూవ్ చేయమని సవాల్ చేసింది బాలా మూడో భార్య.