Begin typing your search above and press return to search.

న‌టుడు ఢిల్లీ గ‌ణేష్ క‌న్నుమూత‌

తమిళ చిత్రసీమలో ప్ర‌ముఖ‌ నటుల్లో ఒకరైన ఢిల్లీ గణేష్ (80) చెన్నైలో కన్నుమూశారు.

By:  Tupaki Desk   |   10 Nov 2024 7:28 AM GMT
న‌టుడు ఢిల్లీ గ‌ణేష్ క‌న్నుమూత‌
X

తమిళ చిత్రసీమలో ప్ర‌ముఖ‌ నటుల్లో ఒకరైన ఢిల్లీ గణేష్ (80) చెన్నైలో కన్నుమూశారు. అనుభ‌వ‌జ్ఞుడైన నటుడు వయస్సు సంబంధిత వ్యాధులతో బాధపడుతూ.. చెన్నై రామాపురంలోని తన ఇంట్లో తుది శ్వాస విడిచారని కుటుంబ స‌భ్యులు తెలిపారు. అత‌డి కుమారుడు మహదేవన్ గణేష్ గత రాత్రి 11.00 గంటలకు త‌న తండ్రి గారు తుదిశ్వాస విడిచినట్లు తెలిపారు. అంత్యక్రియలు రేపు నవంబర్ 11న జరుగనున్నాయి

మ‌హ‌దేవ‌న్ తన తండ్రి మరణ వార్తను సోషల్ మీడియాలో షేర్ చేసారు. ``మా నాన్న మిస్టర్ ఢిల్లీ గణేష్ మరణించారని తెలియజేయడానికి మేం చాలా చింతిస్తున్నాం. 9 నవంబర్ 2024న దాదాపు రాత్రి 11 గంటలకు`` అని రాసారు.

ఢిల్లీ గ‌ణేష్ జెమిని(స‌న్‌) టీవీలో ప్ర‌సారం అయిన `మ‌ర్మ‌దేశం`(ర‌హ‌స్యం) సీరియ‌ల్ తో ఇటు తెలుగు వారికి సుప‌రిచితుడైన న‌టుడు . చాలా త‌మిళ డ‌బ్బింగ్ చిత్రాల‌తో తెలుగు నాట‌ అత‌డంటే తెలియ‌నివారు లేరు. 1976లో కె బాలచందర్ `పట్టిన ప్రవేశం` చిత్రంతో న‌టుడిగా అరంగేట్రం చేసిన తర్వాత ఢిల్లీ గణేష్ 100కి పైగా సినిమాల్లో విభిన్న పాత్రల్లో నటించారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. అతడు కమల్ హాసన్ కి అత్యంత‌ సన్నిహిత మిత్రుడు... సహోద్యోగి కూడా. అత‌డు కమల్ హాసన్ తో చాలా చిత్రాలలో రెగ్యులర్ గా క‌నిపించేవాడు. అపూర్వ సగోధరార్గళ్, మైఖేల్ మదన కామ రాజన్, అవ్వై షణ్ముఘి సహా కొన్ని చిరస్మరణీయమైన న‌ట‌ ప్రదర్శనల‌తో అత‌డు మెప్పించాడు. అలాగే క‌మ‌ల్ హాస‌న్ సోద‌రుడు చారు హాస‌న్ తో క‌లిసి మ‌ర్మ‌దేశం సీరియ‌ల్ లోను న‌టించాడు.

ఢిల్లీ గణేష్ అనేది రంగస్థలం కోసం ఎంపిక చేసుకున్న‌ పేరు. బాల‌చంద‌ర్ ఈ పేరు పెట్టారు. అతడు సినీరంగ ప్రవేశానికి ముందు ఢిల్లీకి చెందిన నాటక బృందంలో దక్షిణ భారత నాటక సభ సభ్యుడు. అతడు మేక‌ప్ ధ‌రించ‌డానికి ముందు 1964 నుండి 1974 వరకు భారతీయ వైమానిక దళంలో కూడా పనిచేశాడు. ప్రఖ్యాత నటుడు కమల్ హాసన్ తో క‌లిసి `ఇండియన్ 2`లో చివరిగా కనిపించాడు. చివరిగా హిందీ వెబ్ సిరీస్ (శ‌శికుమార్ రూప‌క‌ర్త‌)లో కూడా నటించాడు. త‌మిళ చిత్ర‌సీమ‌లో పేరున్న న‌టుడి మ‌ర‌ణంతో అభిమానులు త‌మ ఆందోళ‌న‌ను వ్య‌క్తం చేసారు.