Begin typing your search above and press return to search.

సినిమా ఛాన్సులు రాక‌పోయినా ప్ర‌శ్నించ‌డం మాత్రం ఆప‌ను!

సినిమా- రాజ‌కీయం రెండు వేర్వేరు రంగాలు. అయితే ఆ రెండు రంగాల‌కు ఒక‌దానికొక‌టి సంబంధం లేక‌పోయినా?

By:  Tupaki Desk   |   27 Oct 2024 7:30 AM GMT
సినిమా ఛాన్సులు రాక‌పోయినా ప్ర‌శ్నించ‌డం మాత్రం ఆప‌ను!
X

సినిమా- రాజ‌కీయం రెండు వేర్వేరు రంగాలు. అయితే ఆ రెండు రంగాల‌కు ఒక‌దానికొక‌టి సంబంధం లేక‌పోయినా? సినిమా న‌టులు రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన‌ప్పుడల్లా ఆ మాట త‌ప్ప‌నిపిస్తుంది. సినిమాల్లో సంపాదించిన క్రేజ్ తో న‌టులు రాజ‌కీయాల్లోకి వ‌స్తే న‌టుల ప్ర‌సంగాల‌కు అభిమానులు త‌ర‌లి వ‌స్తార‌ని ఇప్ప‌టికి ఎన్నోసార్లు ప్రూవ్ అయింది. అనాటి ఎన్టీఆర్, జ‌య‌ల‌లిత నుంచి నిన్న‌టి ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, త‌ల‌ప‌తి విజ‌య్ వ‌ర‌కూ ప్రేక్ష‌కాభిమానుల్లో ఆద‌ర‌ణ క‌ళ్ల ముందు క‌నిపిస్తూనే ఉంది.

ఇలాంటి స్టార్ హీరోల‌తో పాటు న‌టులుగా పేరొందిన చాలా మంది సినిమా వాళ్లు రాజ‌కీయాల్లోనూ స‌క్సెస్ అయ్యారు. విల‌క్ష‌ణ న‌టుడు ప్ర‌కాష్ రాజ్ కూడా చాలా కాలాంగా రాజ‌కీయాల్లో యాక్ట‌వ్ గా ఉన్న సంగ‌తి తెలిసిందే. అయితే తాను ఏం చెప్పాల‌నుకున్నా? స్ట్రెయిట్ ఫార్ వార్డ్ గా మాట్లాడుతారు.

ప్ర‌త్య‌ర్ధి ఎంత బ‌ల‌వంతుడైనా భ‌య‌ప‌డే త‌త్వం ఆయ‌న‌ది కాదు. అలా చాలా సంద‌ర్భాల్లో ప్ర‌శంస‌లు అందుకున్నారు. విమ‌ర్శ‌లు ఎదుర్కున్నారు. ఈ నేప‌థ్యంలో తాజాగా నేటి స‌మ‌కాలీన రాజ‌కీయాల్ని ఉద్దేశించి మ‌రోసారి ఆస‌క్తిక‌రంగా స్పందించారు. నేటి స‌మాజంలో గ‌ళం వినిపించ‌లేని ప్ర‌జ‌ల గొంతుగా ఉంటాన‌న్నారు. స‌మాజంలో జ‌రుగుతోన్న త‌ప్పుల్ని చూస్తూ నొర్ముసుకుని ఉండ‌లేన‌న్నారు. రాజ‌కీయాల్లో ప్ర‌శ్నించిన‌ప్పుడే ప్ర‌జ‌లు గుర్తిస్తార‌ని, అలాంటి ప్ర‌శ్న లేని రాజ‌కీయం చేయ‌డం అన‌వ‌స‌ర‌మైన చ‌ర్య‌గా పేర్కొన్నారు.

ప్రజ‌లు త‌రుపున ప్ర‌శ్నించే స‌మ‌యంలో సినిమా అవ‌కాశాలు కోల్పోయినా ప‌ర్వాలేద‌న్నారు. ప్ర‌శ్నించ‌డం మాత్రం ఆప‌న‌న్నారు. న‌టుడిగా ఇప్ప‌టికే చాలా సినిమాలు చేసాన‌ని, ఇక‌నైనా సామాన్య ప్ర‌జ‌ల భ‌విష్య‌త్ కోసం పాటు ప‌డ తానన్నారు. ఇప్ప‌టివ‌ర‌కూ త‌న‌పై ఎన్ని కుట్ర‌లు ప‌న్నినా త‌ట్టుకుని నిల‌బ‌డ్డాన‌ని...ఇంకెన్ని ప‌న్నినా ఎదుర్కో వ‌డానికి సిద్దంగా ఉన్నాన‌న్నారు.