Begin typing your search above and press return to search.

మ‌ద్య‌పానం..ధూమ‌పానం చేయ‌ను!

'పెళ్లికాని ప్ర‌సాద్' అనే చిత్రంతో త్వ‌ర‌లో ప్రేక్ష‌కుల ముందుకొస్తున్నాడు. అయితే ఈ సినిమా టైటిల్ కి త‌గ్గ‌ట్టే ఆయ‌నకు ఇంకా నిజంగానే పెళ్లి కాలేదు.

By:  Tupaki Desk   |   20 March 2025 12:37 PM IST
మ‌ద్య‌పానం..ధూమ‌పానం చేయ‌ను!
X

న‌టుడు స‌ప్త‌గిరి కెరీర్ జ‌ర్నీ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. అసిస్టెంట్ డైరెక్ట‌ర్ నుంచి న‌టుడిగా ప్ర‌మోట్ అయి నేడు త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన గుర్తింపు ద‌క్కించుకున్నాడు. క‌మెడియ‌న్ గా, న‌టుడిగా రాణిస్తున్నాడు. అప్పుడ‌ప్పుడు స‌ప్త‌గిరి ప్ర‌ధాన పాత్ర‌ల్లోనూ కొన్ని సినిమాలు తెర‌కెక్కుతున్నాయి. ఇండ‌స్ట్రీకి ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వ‌చ్చి స‌క్సెస్ అయిన వాళ్ల‌లో స‌ప్త‌గిరి కూడా ఒక‌రు.

'పెళ్లికాని ప్ర‌సాద్' అనే చిత్రంతో త్వ‌ర‌లో ప్రేక్ష‌కుల ముందుకొస్తున్నాడు. అయితే ఈ సినిమా టైటిల్ కి త‌గ్గ‌ట్టే ఆయ‌నకు ఇంకా నిజంగానే పెళ్లి కాలేదు. పెళ్లి ఎందుకు చేసుకోలేదు? అంటే 'చేసుకుందాం..చేసుకుందాం' అంటూనే ఇంత‌కాలం వాయిదా వేసాన‌న్నారు. కానీ త్వ‌ర‌లోనే పెళ్లి వార్త చెబుతాన‌ని న‌వ్వేసాడు. అలాగే స‌ప్త‌గిరి మిస్ట‌ర్ క్లీన్ మెన్ అంటున్నాడు. అత‌డికి ఎలాంటి చెడు అల‌వాట్లు..వ్య‌స‌నాలు లేవంటున్నాడు.

మ‌ద్య‌పానం..దూమ‌పానం అలవాట్లు లేవ‌న్నాడు. త‌న మ‌న‌సులో ఎప్పుడు మంచి ఆలోచ‌న‌లే ఉంటా య‌ని...రోజును చాలా ప్రెష్ గా మొద‌లు పెడ‌తాన‌న్నారు. నిత్యం, యోగా ధ్యానం చేస్తుంటాను. నా ఆలోచ‌న‌లు, అల‌వాట్లే న‌న్ను ఎప్పుడు తృప్తిగా ఉంచుతాయి. హాస్య న‌టుడిగా ఎంతో మందిని న‌వ్విస్తున్నానే తృప్తి నాకెప్పుడు ఉంటుంది. చాలా మంది అప్ప‌టిక‌ప్పుడు దొరికితే అదే హ్యాపీనెస్ అనుకుంటారు.

కానీ సంతోషం అనేది మాట్లాడితేనో...చూస్తేనో వ‌చ్చేది కాదు. మంచి ఆలోచ‌న‌లు, జాలి, ద‌య, క‌రుణ ఉన్న‌ప్పుడు వాటితో వ‌చ్చే సంతోషంగా వేరుగా ఉంటుంది. అలా ఓసారి ప్ర‌య‌త్నిస్తే అందులో కిక్ తెలుస్తుంది. మ‌న‌సు ప్ర‌శాంతంగా ఉంటుంది. ఇత‌రుల జోలికి వెళ్ల‌కుండా మ‌న ప‌ని మ‌నం చేసుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండ‌దు' అని అన్నారు.