Begin typing your search above and press return to search.

ఖడ్గం.. కృష్ణవంశీ వల్లే ఆయన ఉన్నాడా..?

ఐతే ఈ సినిమా గురించి శ్రీకాంత్ మాట్లాడుతూ ఈ సినిమాలో తాను ఉన్నా అంటే దానికి కారణం కృష్ణవంశీనే అని అన్నారు.

By:  Tupaki Desk   |   7 Oct 2024 5:05 AM GMT
ఖడ్గం.. కృష్ణవంశీ వల్లే ఆయన ఉన్నాడా..?
X

తెలుగులో ఎన్ని దేశభక్తి సినిమాలు వచ్చినా సరే ముందు వరుసలో ఉండే సినిమాల్లో మాత్రం ఖడ్గం సినిమా ఉంటుంది. కృష్ణవంశీ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా అప్పట్లో సెన్సేషనల్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా లోని సాంగ్స్, సీన్స్ అన్ని పవర్ ప్యాక్డ్ గా ఉంటాయి. ఇప్పటికీ ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే వస్తే చాలు ఈ సినిమా టీవీలో టెలికాస్ట్ అవుతుంది. ఆ స్పెషల్ డే నాడు ఈ సినిమా చూసే ఆడియన్స్ ఇప్పటికీ ఉన్నారు.

ఇక రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తున్న ఈ టైం లో సూపర్ హిట్ ఖడ్గం సినిమాను కూడా రీ రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ నెల 18న ఖడ్గం రీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు. దానికి సంబంధించిన ప్రెస్ మీట్ నిర్వహించగా ఈ కార్యక్రమంలో డైరెక్టర్ కృష్ణవంశీ, హీరో శ్రీకాంత్ పాల్గొన్నారు. ఖడ్గం సినిమా గురించి ఆనాటి విషయాలను గుర్తు చేసుకున్నారు కృష్ణవంశీ.

ఐతే ఈ సినిమా గురించి శ్రీకాంత్ మాట్లాడుతూ ఈ సినిమాలో తాను ఉన్నా అంటే దానికి కారణం కృష్ణవంశీనే అని అన్నారు. నిర్మాతకు ఈ సినిమాలో తను చేసిన పాత్రకు స్టార్ హీరోని తీసుకోవాలని అనుకున్నారు కానీ కృష్ణవంశీ పట్టుబట్టి నాతోనే ఆ పాత్ర చేయించేలా చేశారు. ఖడ్గం సినిమా ఒక మాస్టర్ పీస్ అలాంటి సినిమాలు రీక్రియేట్ చేయడం చాలా కష్టమని అన్నారు శ్రీకాంత్. ఖడ్గం లాంటి సినిమా చేయమని చాలామంది అడుగుతుంటారు కానీ అలాంటి సినిమాలు రీక్రియేట్ చేయడం కుదరని పని అన్నారు శ్రీకాంత్.

కృష్ణవంశీ డైరెక్షన్ లో తెరకెక్కిన మురారి సినిమా ఈమధ్యనే రీ రిలీజై సూపర్ కలెక్షన్స్ రాబట్టింది. ఆ సినిమా రీ రిలీజ్ తో మళ్లీ తిరిగి వార్తల్లో నిలిచిన కృష్ణవంశీ ఖడ్గం రీ రిలీజ్ తో మళ్లీ సందడి షురూ చేస్తున్నారు. ఖడ్గం రీ రిలీజ్ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. సినిమా రీ రిలీజ్ కు సంబందించి అన్ని పనులు కృష్ణవంశీ దగ్గర ఉండి చూస్తున్నారని తెలుస్తుంది. మరి ఖడ్గం సినిమా రీ రిలీజ్ తో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.