సుబ్బరాజ్ వైఫ్ బ్యాక్ గ్రౌండ్ ఇది!
ఇటీవలే నటుడు సుబ్బరాజ్ ఓ ఇంటివాడైన సంగతి తెలిసిందే. స్రవంతి అనే అమ్మాయితో ధాంపత్య జీవితంలోకి అడుగు పెట్టాడు.
By: Tupaki Desk | 29 Nov 2024 9:30 AM GMTఇటీవలే నటుడు సుబ్బరాజ్ ఓ ఇంటివాడైన సంగతి తెలిసిందే. స్రవంతి అనే అమ్మాయితో ధాంపత్య జీవితంలోకి అడుగు పెట్టాడు. వివాహం అమెరికాలో నిరాడంబరంగా జరిగింది. కేవలం ఇరు కుటుంబాలకు చెందిన బంధువులు, అతి కొద్దిమంది మిత్రుల సమక్షంలో ఈ వేడుక జరిగింది. అయితే సుబ్బరాజ్ వైఫ్ ఎవరు? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి? అన్న దానిపై పలువురు ఆరాతీస్తున్నారు.
తాజాగా కొన్ని వివరాలు ఇలా ఉన్నాయి. చాలా కాలం క్రితమే స్రవంతి కుటుంబం అమెరికాలోని ఫ్లోరిడాలో స్థిరపడినట్లు సమాచారం. కొలంబియా యూనివర్శిటీ, జాన్స్ హాప్కిన్స్ యూనివర్శిటీ నుంచి స్రవంతి బీడీఎస్, డీడీఎస్, ఎంపీహెచ్ చేశారుట. ప్రస్తుతం ఫ్లోరిడాలోని నార్త్ వుడ్ డెంటల్ సెంటర్స్ లో డెంటిస్ట్ గా పని చేస్తున్నారు. స్రవంతి ఫిట్ నెస్ ప్రీక్. సైన్స్ పట్ల ఆసక్తి ఎక్కువ.
ఆమె ఇన్ స్టా గ్రామ్ వినియోగిస్తున్నారు. అందులో ఫస్ట్ లవ్ సైన్స్ అని ఉంది. మ్యారీడ్ టూ ఫిట్ నెస్ అని మెన్షన్ చేసారు. చిన్నప్పటి నుంచి సైన్స్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ముందుకెళ్లారు. ఆ రకంగా చిన్నప్పటి నుంచి సైన్స్ సబ్జెక్ట్ లో ముందుడేవారు. డెంటిస్ట్ డాక్టర్ గా మారడానికి కారణం సైన్స్ పట్ల తనకున్న మక్కువ అని తెలుస్తోంది.
ఇక సుబ్బరాజు ఓ ఇంటర్వ్యూలో పెళ్లి అంటే ఆసక్తి లేదని..పెళ్లి చేసుకోనని చెప్పారు. కానీ ఆయన అనూహ్యంగా పెళ్లి చేసుకుని సర్ ప్రైజ్ ఇచ్చారు. ఆడంబరాలకు సుబ్బరాజు తొలి నుంచి దూరమే. ఆయనది ఎంతో సింపుల్ లైఫ్. అందుకే ఎవరికీ చెప్పకుండానే సైలెంట్ గా అమెరికాలో పెళ్లి చేసుకున్నారు. అయితే హైదరాబాద్ లో రిసెప్షన్ ఏర్పాటు చేసేందుకు సుబ్బరాజు ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఈ వేడుకకు మాత్రం టాలీవుడ్ సెలబ్రిటీలందర్నీ ఆహ్వానించనున్నట్లు తెలుస్తోంది.