అందగాళ్లంతా సూపర్ స్టార్లు అవ్వలేరా?
నటుడు ప్రేక్షకులకు కనెక్ట్ అవ్వడం అన్నది పూర్వ జన్మసుకృతంగానే భావించాలి. కొందరికి మాత్రమే ఆ రకమైన అదృష్టం ఉంటుంది.
By: Tupaki Desk | 22 Dec 2024 7:30 PM GMTసినిమా హీరో అవ్వాలంటే అందంగా ఉండాలి. మంచి ఫిజిక్..హైట్..వెయిట్ హీరోయిక్ లుక్ ఉండాలి. చుట్టూ ఎంత మంది ఉన్నా కళ్లన్ని ఆ వ్యక్తిపైనే ప్రత్యేకంగా ఫోకస్ అయ్యేలా...ఆకర్షించాలని అంటారు. మరి ఇప్పుడు భారతీయ చిత్ర పరిశ్రమలో ఉన్న హీరోలంతా అందంగా ఉన్న వాళ్లేనా? అంటే అదెలా సాధ్యం అంటారు. నటుడు ప్రేక్షకులకు కనెక్ట్ అవ్వడం అన్నది పూర్వ జన్మసుకృతంగానే భావించాలి. కొందరికి మాత్రమే ఆ రకమైన అదృష్టం ఉంటుంది.
టైమ్ కలిసి రావడంతోనే అది సాధ్యమవుతుందని అల్లరి నరేష్ అంటున్నాడు. అందంగా ఉన్న వాళ్లే హీరోలు అవ్వాలంటే అరవింద స్వామి ఎంత పెద్ద హీరో అవ్వాలి? మరి రజనీకాంత్ సూపర్ స్టార్ అయ్యారంటే విపరీతమై అందగాడనా? నా కన్నా మా అన్నయ్య రాజేష్ అందగాడు. కానీ తను మాత్రం ఇండస్ట్రీకి కనెక్ట్ అవ్వలేదు. నేను కనెక్ట్ అయ్యాను ఇదెలా సాద్యం అంటే వాటికి సమాధానం చెప్పడం కష్టం అనేసారు.
చిత్ర పరిశ్రమలో ఎవరు రాణిస్తారో అంచనా వేయడం కానీ , చెప్పడం కానీ కష్టం అనేసారు. నిజమే అమితాబచ్చన్ బాలీవుడ్ ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఎన్నో అవమానాలు ఎదుర్కున్నారు. హీరో ఫేస్ కాదంటూ ఎన్నో అవమానాలు ఎదుర్కున్నారు. కానీ ఇప్పుడాయన ఇండియన సినిమా ఇండస్ట్రీలో ఓ లెజెండ్. సూపర్ స్టార్ రజనీకాంత్ సైతం ఇలాంటి అవమనాలు ఎన్నో చూసారు. నీ హైట్కు హీరో అవుతావా? అని హేళన చేసిన వారెంతో మంది.
కానీ బస్ కండెక్టర్ నుంచి స్టార్ హీరోగా ఎదిగిన వైనం ఎంతో మందికి స్పూర్తిదాయకం. ప్రపంచమే మెచ్చిన ఓ లెజెండరీ నటుడాయన. అలాగే మెగాస్టార్ చిరంజీవి సైతం ఎన్నో అవమానాలు ఎదుర్కున్న వారే. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ప్రస్థానం మొదలైన క్రమంలో ఎన్నో ఆటు పోట్లు ఎదుర్కున్నారు. అవన్నీ దాటుకునే మెగాస్టార్ గా ఎదిగారు. ఇప్పటికీ అలాంటి అవమానాలు ఎదుర్కుంటూనే ఇండస్ట్రీలో హీరోలగా ఎదుగుతున్నారు. కష్టే ఫలి అనే నానుడిని నిజం చేస్తున్నారు.