ఆ హీరోతో ఎప్పటికి సన్నిహితంగా ఉండలేను
ప్రేమదేశం సినిమాతో హీరోగా పరిచయం అయిన అబ్బాస్ మొదటి చిత్రంతోనే భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే.
By: Tupaki Desk | 7 Aug 2023 11:30 PM GMTప్రేమదేశం సినిమాతో హీరోగా పరిచయం అయిన అబ్బాస్ మొదటి చిత్రంతోనే భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. ఆ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకున్న కూడా ఆ తర్వాత వచ్చిన ఏ ఒక్క సినిమా తో కూడా అబ్బాస్ సరైన విజయాన్ని సొంతం చేసుకోలేక పోయాడు. దాంతో తక్కువ సమయంలోనే కనుమరుగు అయ్యాడు.
కెరీర్ మొత్తం కూడా ప్రేమదేశం హీరోగా మాత్రమే పిలిపించుకున్న అబ్బాస్ కొన్నాళ్ల తర్వాత కుటుంబ పోషణ కోసం న్యూజిలాండ్ వెళ్లాడు. అక్కడ తన ఇమేజ్ ను పక్కన పెట్టి ఫిల్లింగ్ స్టేషన్ లో వర్క్ చేయడంతో పాటు ట్యాక్సీ డ్రైవర్ గా కూడా జాబ్ చేశాడట. ఇన్నాళ్లు కనిపించకుండా ఉన్న అబ్బాస్ ఈ మధ్య వరుస ఇంటర్వ్యూలతో సందడి చేస్తున్నాడు.
తాజా ఇంటర్వ్యూలో తమిళ హీరోల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పలువురు హీరోలతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్న అబ్బాస్ వారితో తనకు ఉన్న అనుబంధం గురించి మరియు వారి యొక్క పద్దతుల గురించి మాట్లాడటం జరిగింది. అందులో భాగంగా తమిళ్ స్టార్ హీరో అజిత్ గురించి మాట్లాడుతూ.. మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి. చాలా విషయాల్లో నన్ను పోలి ఉన్నాడు అనిపిస్తూ ఉంటుంది. ఎలాంటి టాపిక్ ని అయినా సూటిగా మాట్లాడుతూ తన అభిప్రాయాన్ని నిర్మొహమాటంగా చెప్పేస్తాడు.
విజయ్ చాలా మృదు స్వభావి. ఆయన డౌట్ టు ఎర్త్ మనిషి. ప్రతి విషయంలో కూడా చాలా సింపుల్ గా ఉంటాడు. ఏ విషయంలో కూడా అతిగా ప్రవర్తించినట్లు అనిపించడు. హీరో సూర్య గురించి అబ్బాస్ మాట్లాడుతూ.. సూర్య మొదటి సినిమా నుండి నాకు తెలుసు. అతడు మొదట్లో కాస్త ఇబ్బంది పడేవాడు. అతడు చాలా మారాడు. అతడి మార్పులో వెనుక ఉన్నది జ్యోతిక అనడంలో సందేహం లేదు.
విశాల్ తో తనకు సెలబ్రెటీ క్రికెట్ లీగ్ సమయంలో విభేదాలు తలెత్తాయి. నా గురించి అతడు మాట్లాడిన మాటలు నాకు కోపాన్ని తెప్పించాయి. నా గురించి చాలా తప్పుడుగా ప్రచారం చేయడంతో పాటు అందరిని నాతో సరిగా ఉండకుండా పాడు చేశాడు అంటూ అబ్బాస్ అసహనం వ్యక్తం చేశాడు.
ఇప్పుడు ఎక్కడైనా కనిపిస్తే విశాల్ కి హాయ్ అని చెప్తాను. కానీ చాలా క్లోజ్ గా మాత్రం నేను అతడితో ఉండలేను అన్నాడు. సినిమా ఇండస్ట్రీలోని వారితో మంచి బంధాన్ని కొనసాగించాలని నేను కోరుకుంటాను. కానీ అది విశాల్ తో మాత్రం సాధ్యం కాదని అబ్బాస్ పేర్కొన్నాడు.