నటన వదిలేసి 1400 కోట్ల కంపెనీని నిర్మించాడు!
నిజానికి నటనకు స్వస్తి చెప్పిన మయూరేష్ చదువుల వైపు దృష్టి సారించాడు. తరువాత చాలా పెద్ద కంపెనీలలో పనిచేశాడు. ఈరోజు మయూరేష్ కమీషన్ జంక్షన్ (సీజే) అఫిలియేట్ CEO.
By: Tupaki Desk | 23 Sep 2023 3:00 AMచాలా కాలంగా సినీరంగంలో స్టార్లుగా ఉండీ సంపాదించుకోలేని వారు ఉన్నారు. గ్లామర్ రంగం కొద్దిమందికి మాత్రమే కలిసి వస్తుంది. అయితే ఒక ప్రముఖ బాలనటుడు గ్లామర్ రంగం నుంచి వైదొలిగి 1400 కోట్ల విలువ చేసే కంపెనీని రన్ చేస్తున్నాడంటే తెలిసింది. వివరాల్లోకి వెళితే..
1983లో దూరదర్శన్‌లో ప్రసారమైన 'రామాయణం' ఇప్పటికీ కోట్లాది మంది భారతీయుల మనస్సులో తాజాగా ఉంది. ఈ సీరియల్ కోవిడ్-19 లాక్‌డౌన్ సమయంలో తిరిగి బుల్లితెరపై ప్రసారం అయింది. ఇది దేశవ్యాప్తంగా ప్రజల నుంచి గొప్ప ఆదరణ పొందింది. రామాయణం 80లలో టీవీల్లో ప్రసారం అయింది. బుల్లితెర అంతగా ఎదగని రోజుల్లో ఈ పాపులర్ సీరియల్‌లోని ప్రతి పాత్ర ప్రేక్షకుల గుండెల్లో నిలిచింది. రామాయణంలో రాముడి పాత్రలో అరుణ్ గోవిల్ నటించగా, సీత పాత్రలో దీపికా చిఖాలియా నటించింది. ఈ సీరియల్‌లోని చాలా మంది నటులు ఇప్పటికీ వినోదరంగంలో నటులుగా చురుకుగా ఉన్నారు. అయితే రామాయణంలో నటించి ఆ తర్వాత నటనను వదిలి వందల కోట్ల కంపెనీని అభివృద్ధి చేసిన నటుడు ఇప్పుడు మరోసారి మీడియాలో హాట్ టాపిక్ గా మారాడు.
నిజానికి రామాయణంలో రాముడు- సీతాదేవి కుమారులు లవ్ - కుష్ కథ కూడా అద్భుతంగా చూపించారు. రామాయణం తర్వాత, ఉత్తర రామాయణం కూడా టీవీలో ప్రసారం అయింది. ఇందులో లవ్ - కుష్ కథను ప్రత్యేకంగా చూపించారు. సీరియల్‌లో కుష్ పాత్రను స్వప్నిల్ జోషి పోషించగా, మయూరేష్ క్షేత్రమదే లువ్ పాత్రలో కనిపించాడు. ఈ సీరియల్ తర్వాత స్వప్నిల్ తన నటనా ప్రయాణాన్ని కొనసాగించాడు. ఒక సీరియల్‌లో శ్రీ కృష్ణుడిగా కనిపించాడు. స్వప్నిల్ జోషి ఇప్పుడు మరాఠీ సినిమాకి బాగా తెలిసిన పేరు. మరోవైపు లవ్ పాత్రలో కనిపించిన మయూరేష్ క్షేత్రమదే అనే సినిమాలో నటించి, అటుపై టీవీ ప్రపంచానికి దూరమయ్యాడు. నటనకు స్వస్తి చెప్పిన మయూరేష్ వ్యాపారంలో తన లక్ చెక్ చేసుకున్నాడు. పెద్ద సక్సెస్ అయ్యాడు.
నిజానికి నటనకు స్వస్తి చెప్పిన మయూరేష్ చదువుల వైపు దృష్టి సారించాడు. తరువాత చాలా పెద్ద కంపెనీలలో పనిచేశాడు. ఈరోజు మయూరేష్ కమీషన్ జంక్షన్ (సీజే) అఫిలియేట్ CEO.. కుటుంబంతో US లో స్థిరపడ్డారు. మయూరేష్ ఇప్పుడు విజయవంతమైన వ్యాపారవేత్తగా మారారు. ఆయన కంపెనీ నికర విలువ వందల కోట్లలో ఉంది. తాజా కథనాల ప్రకారం.. CJ అనుబంధ ఆదాయం సుమారు 1400 కోట్లు (USD 170 మిలియన్లు). మయూరేష్ స్పైట్ అండ్ డెవలప్‌మెంట్ అనే పుస్తకాన్ని కూడా రాశారు.