Begin typing your search above and press return to search.

శృతిమించి అక్రమ సంబంధాలు.. నటి కామెంట్స్‌

తాజాగా ఒక ఇంటర్వ్యూలో రవీనా టాండన్ అప్పటి పరిస్థితులను కళ్లకు కట్టినట్లుగా చెప్పుకొచ్చింది.

By:  Tupaki Desk   |   1 April 2024 9:30 AM GMT
శృతిమించి అక్రమ సంబంధాలు.. నటి కామెంట్స్‌
X

బాలీవుడ్‌ లో లవ్ అఫైర్స్‌, వివాదాలు, నెపోటిజం అనేవి చాలా కామన్‌. ఈ మధ్య కాలంలో తారల మధ్య స్నేహం ఉంటుంది కానీ ఒకప్పుడు ముఖ్యంగా 1990 ల్లో తారల మధ్య పోటీ తీవ్రంగా ఉండేది అంటూ సీనియర్ హీరోయిన్ రవీనా టాండన్ షాకింగ్ వ్యాఖ్యలు చేసింది.


తాజాగా ఒక ఇంటర్వ్యూలో రవీనా టాండన్ అప్పటి పరిస్థితులను కళ్లకు కట్టినట్లుగా చెప్పుకొచ్చింది. ఆమె మాట్లాడుతూ.. 90ల్లో మా మధ్య పోటీ చాలా ఎక్కువగా ఉండేది. సెట్‌ లో అంతా చాలా సాఫీగా హాయిగా ఉన్నట్లుగా అనిపించేది కానీ లో లోపల మాత్రం ఒకరిపై ఒకరు పోటీ అన్నట్లు ఉండేది.

అఫైర్ల గురించి చెప్పుకుంటూ సరదాగా మాట్లాడుకునే వారు. ఆ విషయాలు చెప్పుకుంటూ ఒకరిని ఒకరు ఆట పట్టించుకునే వారు. అయితే కొందరు మాత్రం ఆ విషయంలో మరో అడుగు ముందుకు వేసి పుకార్లు పుట్టించే వారు. ఒకరి ఎదుగుదల చూసి ఓర్వలేక తప్పుడు ప్రచారాలు చేస్తూ కెరీన్ ను నాశనం చేసే వారు.

ఒకరిపై మరొకరు అక్రమ సంబంధాలకు సంబంధించి శృతి మించేలా ప్రచారం చేసేవారు. దాంతో చాలా మంది కెరీర్ లో నష్టపోయిన వారు ఉన్నారు. తన గురించి కూడా కొందరు తప్పుడు ప్రచారం చేశారని రవీనా చెప్పుకొచ్చింది. నేను అందరితో బాగానే ఉండాలి అనుకునేదాన్ని. కానీ కొందరు ఓర్వలేక తప్పుడు ప్రచారం చేశారు.

ఇతరుల కెరీర్‌ లను ప్రభావితం చేసేందుకు స్వయంగా వారి బాయ్ ఫ్రెండ్ మరియు గర్ల్ ఫ్రెండ్ ను ఉపయోగించేవారు. ఇండస్ట్రీలో అలాంటి ఇల్లీగల్‌ సంబంధాలు ఒకానొక సమయంలో శృతి మించాయి అంటూ రవీనా మాటలను బట్టి అర్థం అయ్యింది. ఇప్పుడు కూడా సోషల్‌ మీడియాలో ఆ పుకార్లు తప్పడం లేదు.

గతంలో మాదిరిగా ఇప్పుడు పుకార్లను జనాలు ఇండస్ట్రీ వర్గాలు పట్టించుకోవడం లేదు. కెరీర్‌ నాశనం అయ్యేంతగా పుకార్లు మాత్రం రావడం లేదని కూడా ఆమె అభిప్రాయం వ్యక్తం చేసింది. సోషల్‌ మీడియాలో ప్రస్తుతం కొందరు కావాలని తప్పుడు ప్రచారం చేస్తూ ఉంటే జనాలు వాటిని నమ్మడం లేదని ఆమె చెప్పుకొచ్చింది.