Begin typing your search above and press return to search.

జ్యోతిక‌ అమ్మ‌లేని ఇల్లు బోసిపోయింది! కార్తీ

సూర్య‌-జ్యోతిక దంప‌తులు ముంబైలో కొత్త‌గా వేరు కాపురం పెట్ట‌డం కొన్ని నెల‌ల ముందు ఎంత సంచ‌ల‌న మైందో తెలిసిందే.

By:  Tupaki Desk   |   24 Sep 2023 8:15 AM GMT
జ్యోతిక‌ అమ్మ‌లేని ఇల్లు బోసిపోయింది! కార్తీ
X

సూర్య‌-జ్యోతిక దంప‌తులు ముంబైలో కొత్త‌గా వేరు కాపురం పెట్ట‌డం కొన్ని నెల‌ల ముందు ఎంత సంచ‌ల‌న మైందో తెలిసిందే. కుటుంబ స‌భ్యుల‌తో త‌లెత్తిన వివాదాల కార‌ణంగా సూర్య త‌ల్లిదండ్రుల నుంచి దూరంగా ఉండాల్సి వ‌స్తోంద‌ని ప్ర‌ధానంగా హైలైట్ అయింది. సూర్య తండ్రికి జ్యోతిక సినిమాలు చేయ‌డం ఇష్టం లేక వారించినా..ఆయ‌న మాట ప‌ట్టించుకోకుండా సినిమాలు చేస్తుంద‌నే కార‌ణంతో వివాదం మొద‌లైన‌ట్లు..ఆ విష‌యంలో సూర్య కూడా జ్యోతిక‌కే మ‌ద్ద‌తు ఇచ్చిన‌ట్లు..ఈ నేప‌థ్యంలో కుటుంబం నుంచి వేరైన‌ట్లు కోలీవుడ్ మీడియా క‌థ‌నాలు అంత‌కంత‌కు వెడెక్కించాయి.

ఈ ర‌క‌మైన ప్ర‌చారంలో వాస్త‌వం ఏంటి? అన్న‌ది తెలియ‌దుగానీ..జ్యోతిక మాత్రం పిల్ల‌లిద్ద‌రితో క‌లిసి ముంబైలోనే ఉంటున్నారు. సూర్య ముంబై టూ చెన్నై తిరుగుతున్నారు. ఆయ‌నకు ఎక్కువ‌గా షూటింగ్ లు చెన్నైలోనే ఉండ‌టంతో! తిర‌గ‌డం త‌ప్ప‌లేదు. తాజాగా అమ్మ లేని ఇల్లు బోసి పోయింద‌ని కార్తీ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసారు. నేను జ్యోతిక‌ని న‌టిగా ఎప్పుడు చూడ‌లేదు. అమ్మ‌గా చూసాను.

త‌ను కూడా మ‌మ్మ‌ల్ని త‌న పిల్ల‌లుగానే భావించి చూసింది. అమ్మ ఇప్పుడు ముంబైలో ఉండ‌టంతో ఇల్లు అంతా బోసు పోయింది. ఆమెలేని ఈ ఇంట్లో ఉండ‌టం మా వ‌ల్ల కావ‌డం లేదు. అమ్మ‌తో క‌లిసి ఉన్న‌ప్పుడు ఎంతో సంతోషంగా ఉన్నాం. ఇంత‌కాలం తామంతా క‌లిసి ఉన్నామంటే కార‌ణం అమ్మ‌నే. కానీ అన్న‌య్య పిల్ల‌లు పెద్ద‌వాళ్లు అవుతున్నారు. వారి చ‌దువ‌ల కోసం మాత్ర‌మే ముంబై వెళ్లారు. చ‌దువులు పూర్త‌యిన వెంట‌నే తిరిగొచ్చేస్తారు. ఈలోపు ప్ర‌తీ పండ‌గ‌కు క‌లుస్తూనే ఉంటాం` అని అన్నారు.

నిజానికి సూర్య కుటుంబంలో వివాదంపై వార్త‌లొచ్చిన త‌ర్వాత వాటిని ఆకుటుంబ స‌భ్యులు ఇంత‌వ‌ర‌కూ ఖండించ‌లేదు. అలాగే కార్తీ కూడా ఈవిష‌యంలో సూర్యకి అండ‌గా నిల‌వ‌లేదుని ప్ర‌చారంలో ఉంది. ఈ నేప‌థ్యంలో కార్తీ తాజా వ్యాఖ్య‌లు ఆస‌క్తిక‌రంగా మారాయి. ఇంత కాలం మీడియా ముందుకు రాని కార్తీ ఇప్పుడిలా! అమ్మ అంటూ రావ‌డానికి వ్య‌తిరేక‌తే కార‌ణ‌మా? అన్న అంశం తెర‌పైకి వ‌స్తోంది.