'హ్యారీపోటర్' నటుడు కన్నుమూత
'హ్యారీపోటర్' సిరీస్ తో పాటు పలు హాలీవుడ్ సినిమాల్లో నటించిన ప్రముఖ నటుడు మైఖెల్ గాంబోన్ (82) కన్నుమూసారు
By: Tupaki Desk | 29 Sep 2023 7:19 AM GMT'హ్యారీపోటర్' సిరీస్ తో పాటు పలు హాలీవుడ్ సినిమాల్లో నటించిన ప్రముఖ నటుడు మైఖెల్ గాంబోన్ (82) కన్నుమూసారు. వయోభారంతో గత కొంత కాలంగా అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే ఇంగ్లాండ్‌లోని ఎసెక్స్‌లో మైఖేల్ న్యుమోనియాతో మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన మృతిపట్ల హాలీ చిత్ర పరిశ్రమ సంతాపం ప్రకటించింది. చిత్ర పరిశ్రమకి ఆయన అందించిన సేవలు గుర్తు చేస్తున్నారు.
'హ్యారీ పోటర్' సిరీస్ తో మైఖెల్ ప్రపంచ వ్యాప్తంగా బాగా ఫేమస్ అయ్యారు. ఎనిమిది సిరీస్ ల్లో భాగంగా ఆరు హ్యారీపోటర్ సిరీస్ ల్లో ఆయన నటించారు. మైఖెల్ గాంబోన్ 1940లో జన్మించారు. ఆయన తండ్రి రెండవ ప్రపంచ యుద్దంలో పాల్గొన్నారు. అటుపై ఆయన లండన్ పునర్మిణాంలో భాగమయ్యారు. ఆ సమయంలోనే మైకెల్ గాంబోన్ లండన్ కి తీసుకొచ్చారు. మైఖెల్ 1962 లో నాటకాల్లో నటించడం ప్రారంభించారు.
చాలా నాటకాల్లో నటించిన తర్వాత సినీ నటుడిగా మారారు. 1965 లో ఆయన నటించిన తొలి నాటకం 'ఒథెల్లో'సినిమాగా తీయగా అందులో ఓ పాత్ర లభించింది. మొదటి సినిమాతోనే మైఖెల్కి మంచి పేరొచ్చింది. ఆ తర్వాత పలు పాపులర్ సినిమాల్లో నటించారు. గాంబోన్ అనేక హారర్ అలాగే యాక్షన్ సినిమాలలోనూ తనదైన ముద్ర వేసారు. 2004లో తొలిసారి 'హ్యారీ పోటర్'లో కనిపించాను. అందులో
ప్రొఫెసర్ ఆల్బన్ డంబుల్ డోర్ పాత్ర పోషించారు. ఈ పాత్ర ఆయనకు ప్రత్యేకమైన గుర్తింపును తీసుకొచ్చింది. దీంతో అప్పటి నుంచి 2011 వరకు గాంబోన్ ఆరు హ్యారీ పోటర్ చిత్రాలలో ప్రొఫెసర్ పాత్రలో కొనసాగారు. అలాగే ఆస్కార్ విన్నర్ 'కింగ్స్ స్పీచ్'.. యాక్షన్ చిత్రాలు 'కింగ్స్‌మెన్.. కామెడీ మూవీ 'జానీ ఇంగ్లీష్' వంటి అనేక చిత్రాల్లో నటించి హాలీవుడ్ లో ప్రత్యేక స్థానం దక్కించుకున్నారు. చివరిగా 2019లో 'జూడీ'.. 'కోర్డెలియా' సినిమాల్లో నటించారు.