Begin typing your search above and press return to search.

ఫిట్నెస్ తో షాక్ ఇస్తున్న సీనియర్ నరేష్

సీనియర్ నటుడు నరేష్ ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యధిక డిమాండ్ ఉన్న ఆర్టిస్టులలో ఒకరు.

By:  Tupaki Desk   |   28 May 2024 6:15 AM GMT
ఫిట్నెస్ తో షాక్ ఇస్తున్న సీనియర్ నరేష్
X

సీనియర్ నటుడు నరేష్ ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యధిక డిమాండ్ ఉన్న ఆర్టిస్టులలో ఒకరు. తన నటనతో కామెడీ సీరియస్ డ్రామా ఏమోషనల్ సీన్స్ ను మరో లెవెల్ కు తీసుకు వెళ్లగల బెస్ట్ యాక్టర్. ఇక ఆయన సోషల్ మీడియాలో ఇప్పుడు తన ఫిట్నెస్ తో హాట్ టాపిక్ గా నిలుస్తున్నారు. 80వ దశకంలో 'నాలుగు స్తంభాలాట', 'శ్రీవరికి ప్రేమలేఖ' వంటి హిట్ చిత్రాలలో హీరోగా అప్పట్లో మంచి క్రేజ్ అందుకున్నాడు VK నరేష్.


అనంతరం 90వ దశకంలో 'చిత్రభలారే విచిత్రం', 'జంబలకిడి పంబ' వంటి సినిమాలు ఒక ట్రెండ్ సెట్ చేశాయి. 2000ల ప్రారంభంలో సినీ రంగం నుంచి కొంత కాలం విరామం తీసుకొని, రాజకీయాల్లో ప్రవేశించారు. 2005లో మళ్లీ సినిమాలలో రీ-ఎంట్రీ చేసి, పాత్ర చిత్రణలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.


ఒకవైపు కథానాయకుడి పాత్రల్లోనూ, మరోవైపు క్యారెక్టర్ ఆర్టిస్టుగా సక్సెస్ సాధించారు. ఆయన రోజుకు 3 నుంచి 4 లక్షల రూపాయల వరకు పారితోషికం తీసుకుంటారని వార్తలు వినిపిస్తున్నాయి. పాత్రల కోసం శారీరకంగా, మానసికంగా సిద్ధంగా ఉంటానని, అవసరమైతే ప్రతికూల పాత్రలకైనా సిద్ధమని చెప్పారు. నరేష్ కు ఛాలెంజింగ్ రోల్స్ అంటే ఎంతో ఇష్టమట.


ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి సినిమా 'విశ్వంబర' కోసం జిమ్‌లో కసరత్తులు చేస్తూ కనిపించారు. ఇదే తీరులో నాగార్జున, వెంకటేష్, మహేష్ బాబు వంటి ప్రముఖులు కూడా తమ శారీరక ఫిట్‌నెస్‌ పై దృష్టి సారిస్తున్నారు. ఐదు పదుల వయసు దాటినా కూడా ఎంతో ఎనర్జిటిక్ గా కనిపిస్తున్నారు. ఇక యువ హీరోలలో యంగ్ ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి నటులు కూడా ఫిట్‌నెస్‌కు పెద్ద పీట వేస్తున్నారు.


ఇటీవలి కాలంలో కొత్తవారైన నటులు పార్టీలు, పబ్‌లలో ఎక్కువగా గడుపుతూ ఉంటారు. కానీ ఈ సీనియర్ నటులు చూపిస్తున్న క్రమశిక్షణ అందరికి ప్రేరణగా నిలుస్తుందని చెప్పవచ్చు, ఫిట్‌నెస్‌ పై దృష్టి సారించడం ద్వారా, కొత్తవారు కూడా సీనియర్ తారలతో పోటీగా నిలబడగలుగుతారు. నరేష్ విజయకృష్ణ ఒక స్ఫూర్తిదాయకంగా మారి, ఇండస్ట్రీలోకి వచ్చినా ఏళ్ళు గడుస్తున్నా అదే ఆదరణను అందుకుంటున్నారు. ఇక పరిశ్రమలో తన స్థానం నిలబెట్టుకోవడం కంటే, తన ఫిట్‌నెస్ ద్వారా కొత్త తారలకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు.