Begin typing your search above and press return to search.

ప‌వ‌న్ క‌ళ్యాణ్ వ్యాఖ్య‌ల‌పై సీనియ‌ర్ న‌రేష్ అస‌హ‌నం!

తాజాగా ఈ వ్యాఖ్య‌ల‌పై సీనియ‌ర్ న‌టుడు న‌రేష్ కూడా అస‌హ‌నం వ్య‌క్తం చేసారు. ట్విట‌ర్ వేదిక‌గా ఆయ‌న స్పందించారు

By:  Tupaki Desk   |   24 April 2024 1:18 PM GMT
ప‌వ‌న్ క‌ళ్యాణ్ వ్యాఖ్య‌ల‌పై సీనియ‌ర్ న‌రేష్ అస‌హ‌నం!
X

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ పొలిటిక‌ల్ ప్ర‌చారంలో భాగంగా సూప‌ర్ స్టార్ కృష్ణ‌ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్య‌లు నెట్టింట ఎంత‌టి దుమారాన్ని రేపాయో తెలిసిందే. కృష్ణ‌..మ‌హేష్ అభిమాన సంఘాలు ఒక్క‌సారిగా భ‌గ్గుమ‌న్నాయి. ఎన్టీఆర్ కి వ్య‌తిరేకంగా కృష్ణ సినిమాలు చేసినా! త‌న‌ని ఎలాంటి ఇబ్బందుల‌కు ఎన్టీఆర్ గురి చేయ‌లేద‌ని...కానీ త‌న‌పై మాత్రం సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి క‌క్ష పూరితంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని లింక్ చేసిన వ్యాఖ్య‌లతో మ‌హేష్ అభిమానులు తీవ్రంగా మండిప‌డ్డారు.

తాజాగా ఈ వ్యాఖ్య‌ల‌పై సీనియ‌ర్ న‌టుడు న‌రేష్ కూడా అస‌హ‌నం వ్య‌క్తం చేసారు. ట్విట‌ర్ వేదిక‌గా ఆయ‌న స్పందించారు. `ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌న ప్ర‌సంగంలో కృష్ణ‌గారిని విమ‌ర్శించ‌డం న‌న్ను షాక్ కి గురి చేసింది. ఆ వ్యాఖ్య‌లు బాధ‌పెట్టాయి. కృష్ణ‌గారిది బంగారం లాంటి మ‌న‌సు అని అంద‌రికీ తెలుసు. విలువ‌ల‌తో కూడిన రాజ‌కీయం చేసిన మ‌నిషి. సినీ, రాజ‌కీయ రంగాల‌కి ఆయ చేసిన సేవ‌లు మ‌రువ‌లేనివి. ఆయ‌నెప్పుడు రాజ‌కీయ ప్ర‌సంగాల్లో వ్య‌క్తిగ‌తంగా విమ‌ర్శించ‌లేదు. ఎప్పుడూ పార్టీలు మార‌లేదు` అని అన్నారు.

అలాగే మ‌రో ట్వీట్ లో ప‌వ‌న్ పై న‌టుడిగా..రాజ‌కీయ నాయ‌కుడిగా త‌న‌కు మంచి అభిప్రాయం ఉంద‌న్నారు. భ‌విష్య‌త్ లో ఎవ‌రూ కృష్ణ‌గారిని విమ‌ర్శించొద్ద‌ని కోరారు. `ప‌వ‌న్ క‌ళ్యాణ్ ని ఏపీకి భ‌విష్య‌త్ గా చూస్తున్నాన‌ని.. బీజేపీకి..మాజీ యూత్ ప్రెసిడెంట్ గా.. జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇప్పుడు గెలిచి తీరాల‌ని..ఎన్డీఏ కూట‌మి గెలుపుతో ఏపీలో వెల‌గాల‌ని కోరుకుంటున్నాను` అని అన్నారు.

పీకే చేసిన ఈ వ్యాఖ్య‌లు సూప‌ర్ స్టార్ మ‌హేష్ దృష్టికి వెళ్లాయా? వెళ్తే ఆయ‌న స్పందిస్తారా? సైలెంట్ గా ఉంటారా? అన్న‌ది చూడాలి. మ‌హేష్ వివాదాస్ప‌ద అంశాల‌కు ఎప్పుడూ దూరంగా ఉంటారు. అలాగే రాజ‌కీయాల గురించి ఆయ‌న ఎక్క‌డ స్పందించ‌రు. అడిగినా నో ఛాన్స్ అనేస్తారు. మ‌రి కృష్ణ‌పై చేసిన వ్యాఖ్య‌ల్ని మ‌హేష్ లైట్ తీసుకుంటారా? అన్న‌ది చూడాలి. ప్ర‌స్తుతం మ‌హేష్ కొత్త సినిమా ప‌నుల్లో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే.