Begin typing your search above and press return to search.

డ్ర‌గ్స్ కేసులో హీరో న‌వ‌దీప్‌కి స‌మ‌న్లు జారీ!

డ్రగ్స్ కుంభకోణంలో విచారణకు హాజరుకావాలని టాలీవుడ్ నటుడు నవదీప్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ శుక్రవారం సమన్లు జారీ చేసింది

By:  Tupaki Desk   |   7 Oct 2023 4:59 AM GMT
డ్ర‌గ్స్ కేసులో హీరో న‌వ‌దీప్‌కి స‌మ‌న్లు జారీ!
X

డ్రగ్స్ కుంభకోణంలో విచారణకు హాజరుకావాలని టాలీవుడ్ నటుడు నవదీప్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ శుక్రవారం సమన్లు జారీ చేసింది. అక్టోబర్ 10న కార్యాల‌యానికి హాజరుకావాలని నవదీప్‌ను కోరినట్లు ED వర్గాలు వెల్లడించాయి. గుడిమల్కాపూర్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసుకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర నార్కోటిక్స్ బ్యూరో(NCB) ఇటీవల నటుడు నవదీప్ ను విచారించింది. సెప్టెంబర్ 14న బెంగళూరులో పట్టుబడ్డ నైజీరియన్ డ్రగ్ పెడ్లర్లతో అత‌డు సంప్రదింపులు జరుపుతున్నట్లు పోలీసు దర్యాప్తులో వెల్లడైంద‌ని మీడియాలో క‌థనాలొచ్చాయి.

తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేయడంతో నవదీప్‌కు CrPC సెక్షన్ 41A కింద నోటీసులు అందాయి. ఈడీ సోర్స్ అందించిన వివ‌రాల ప్ర‌కారం.. టాలీవుడ్ డ్రగ్స్ ట్రాఫికింగ్ లో పాత‌ కేసుకు సంబంధించి అతడికి సమన్లు పంపారు. ప్రస్తుత కేసును కూడా అందులో చేర్చుతాము. నవదీప్‌కి రెండుసార్లు సమన్లు పంపారు. కానీ అతడు మా ముందు హాజరుకాలేదు.. అని అధికారులు తెలిపారు. 2017 కేసులో మనీలాండరింగ్ కోణంలో విచారణ జరుగుతుంద‌ని వెల్ల‌డించారు. 12 డ్రగ్స్ కేసుల్లో ఎక్సైజ్ శాఖలు దాఖలు చేసిన చార్జిషీట్ల ఆధారంగా డ్రగ్స్ కుంభకోణంపై విచార‌ణ వేగ‌వంత‌మైంది.

గతంలో టాలీవుడ్ నటులు నవదీప్, రకుల్ ప్రీత్ సింగ్, రానా దగ్గుబాటి, రవితేజ, ఛార్మీ కౌర్, ముమైత్ ఖాన్, తనీష్, నందు, తరుణ్‌లను ఎన్‌సిబి ప్రశ్నించింది. డ్రగ్స్ కేసులో కీలక నిందితులు కాల్విన్ మస్కరెన్హాస్ తదితరుల చుట్టూ ఈ కేసు ఉచ్చు బిగుసుకుంది.

6 గం.ల పాటు విచార‌ణ‌:

న‌వదీప్ కొద్దిరోజులుగా క‌నిపించ‌డం లేదంటూ ఇంత‌కుముందు మీడియాలో క‌థ‌నాలు వైర‌ల్ అయ్యాయి. ఆ త‌ర్వాత అత‌డు నార్కోటిక్స్ పోలీసుల విచార‌ణ‌కు హాజ‌ర‌య్యాడు. దాదాపు 6 గంట‌ల పాటు విచారణ కొన‌సాగిన సంగ‌తి తెలిసిందే. అయితే న‌వ‌దీప్ ఈ విచార‌ణ‌లో ఏం చెప్పారు? త‌నను తాను ఎలా డిపెండ్ చేసుకున్నారు? అనేదానిపై ఎలాంటి స‌మాచారం లేదు.