Begin typing your search above and press return to search.

ప్రియురాలితో స్టార్ డైరెక్ట‌ర్ సోద‌రుడి పెళ్లి

ప్రేమ్ జీ- ఇందు కొన్నేళ్లుగా రిలేషన్‌షిప్‌లో ఉన్నారని, చివరకు సాంప్రదాయ పద్ధతిలో వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారని క‌థ‌నాలొస్తున్నాయి.

By:  Tupaki Desk   |   9 Jun 2024 7:20 AM GMT
ప్రియురాలితో స్టార్ డైరెక్ట‌ర్ సోద‌రుడి పెళ్లి
X

ప్ర‌ముఖ‌ కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ వెంకట్ ప్రభు సోదరుడు, నటుడు ప్రేమ్ జీ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించారు. 45 ఏళ్ల ప్రేమ్ జీ కుటుంబ సభ్యులు స‌న్నిహితుల‌ సమక్షంలో ప్రియురాలు ఇందుని గత రాత్రి పెళ్లి చేసుకున్నారు. నూతన వధూవరుల ఫోటోలను వెంక‌ట్ ప్ర‌భు ఇన్ స్టాలో షేర్ చేసారు. ప్రేమ జీ- ఇందు జంట‌ కొత్త ప్రయాణాన్ని ప్రారంభించినందుకు అభినందనలు తెలిపారు.

చెన్నైలో జరిగిన ఈ ఆత్మీయ వేడుకకు ఎంపిక చేసిన కొందరిని మాత్రమే ఆహ్వానించారు. ప్రేమ్ జీ- ఇందు కొన్నేళ్లుగా రిలేషన్‌షిప్‌లో ఉన్నారని, చివరకు సాంప్రదాయ పద్ధతిలో వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారని క‌థ‌నాలొస్తున్నాయి. సెలబ్రిటీలు నూతన వధూవరులకు శుభాకాంక్షలు చెబుతున్నారు. పెళ్లి ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

ప్రేమ్ జీ స్టార్ డైరెక్ట‌ర్ సోద‌రుడిగా ప‌రిశ్ర‌మ‌లో విరివిగా అవ‌కాశాలు అందుకున్నాడు. అటుపై న‌టుడిగా త‌నను తాను నిరూపించుకున్నాడు. వ‌డివేలు, వివేక్ లాంటి స్టార్ క‌మెడియ‌న్ల త‌ర్వాతి జ‌న‌రేష‌న్ లో ప్రేమ్ జీ పేరు మార్మోగింది. అజిత్ `గ్యాంబ్ల‌ర్` సినిమాలో ప్రేమ్ జీ న‌ట‌న తెలుగు ఆడియెన్ ని ఆక‌ట్టుకుంది. అత‌డు న‌టించిన చాలా త‌మిళ చిత్రాలు తెలుగులో డ‌బ్ అయి రిలీజ‌య్యాయి.