Begin typing your search above and press return to search.

చొక్కా న‌ల‌గ‌కుండా కొట్టేవారంతా ఇప్పుడిలా!

అప్ప‌ట్లో సినిమాలు చేసే ద‌ర్శ‌కులంతా కూడా ప‌క్కా క‌మ‌ర్శియ‌ల్ కెప్టెన్లే. దీంతో హీరోల‌కు కూడా ఆన్ సెట్స్ లో ప‌ని ఈజీగా అయ్యేది.

By:  Tupaki Desk   |   7 Dec 2024 8:30 AM GMT
చొక్కా న‌ల‌గ‌కుండా కొట్టేవారంతా ఇప్పుడిలా!
X

ఒక‌ప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోలు ఆన్ సెట్స్ లో రిస్క్ చేయ‌డానికి ఏమాత్రం ముందుకొచ్చేవారు. ఎంతో కంప‌ర్ట్ జోన్ లో సినిమాలు చేసేవారు. రొమాంటిక్ స‌న్నివేశాలైనా..యాక్ష‌న్ స‌న్నివేశాల్లోనైనా చొక్కా న‌ల‌గుకుండానే న‌టించే వారు. అందులోనూ బోలెడంత క‌మ‌ర్శియాల్టీని జొప్పించేవారు. అందుకు పూర్తి స్థాయిలో మేక‌ర్స్ నుంచి స‌హ‌కారం ల‌భించేది. అప్ప‌ట్లో సినిమాలు చేసే ద‌ర్శ‌కులంతా కూడా ప‌క్కా క‌మ‌ర్శియ‌ల్ కెప్టెన్లే. దీంతో హీరోల‌కు కూడా ఆన్ సెట్స్ లో ప‌ని ఈజీగా అయ్యేది.

పెద్ద‌గా ప్రాయాస ప‌డ‌కుండా మంచి ఫ‌లితాలు అందుకునేవారు. కానీ నేడు ట్రెండ్ మారిన సంగ‌తి తెలిసిందే. హీరోలంతా ఇప్పుడు చొక్కాలు న‌లిగేలా కొడుతున్నారు..న‌టిస్తున్నారు. సీన్ విష‌యంలో ఏమాత్రం రాజీ ప‌డ‌టం లేదు. ది బెస్ట్ రియ‌లిస్టిక్ అప్పిరియ‌న్స్ కోసం ప్ర‌య‌త్నిస్తున్నారు. తెలుగు సినిమా పాన్ ఇండియాలో స‌క్సెస్ అయిన త‌ర్వాత పోటీ మ‌రింత పెరిగింది. హీరోల్లో క‌ష్ట‌ప‌డే స్వ‌భావాన్ని ప్ర‌తీ హీరో బ‌య‌ట‌కు తెస్తున్నాడు.

పూర్తి స్థాయిలో ద‌ర్శ‌కుల హీరోల‌గా మారుతున్నారు. అప్ప‌ట్లో హీరోలే డైరెక్ట‌ర్ల‌కు కొన్ని స‌న్నివేశాల విష‌యంలో స‌ల‌హా లిచ్చేవారు. కానీ ఇప్పుడే హీరో కూడా ఆ లిబ‌ర్టీ తీసుకోవ‌డం లేదు. భార‌మంతా ద‌ర్శ‌కుల‌పైనే వేసి ఆన్ సెట్స్ కి వెళ్తున్నారు. రచ‌యిత క‌థ‌ల్లో వేలు పెట్ట‌డం లేదు. ఆన్ సెట్స్ లో చెప్పింది చెప్పిన‌ట్లు చేస్తున్నారు. డైరెక్ట‌ర్ ఎంతో ఇన్నో వేటింగ్ ఉంటే అంత‌కు మించి ది బెస్ట్ పెర్పార్మెన్స్ ఇవ్వ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నారు.

ద‌ర్శ‌క, ర‌చ‌యిత‌ల మేథ‌స్సుకు పెద్ద పీట వేస్తున్నారు. వాళ్లకు మించి మ‌న‌కేం తెలుస్తుంది అన్న ధోర‌ణిలో హీరోలు క‌నిపిస్తున్నారు. ఇది ఇండ‌స్ట్రీకి ఓ పాజిటివ్ సైన్ లాంటింది. సీనియ‌ర్ హీరోలు స‌హా త‌ర్వాత త‌రం హీరోలంతా ఇదే విధానంలో ముందుకెళ్తే న‌వత‌రం హీరోల‌కు ఇలాంటి ఓ ఆద‌ర్శంగా క‌నిపిస్తాయి. డైరెక్ట‌ర్లు చెప్పింది చేయ‌డం అల‌వాటు చేసుకుంటారు.