Begin typing your search above and press return to search.

రాజమౌళి తరువాత అందరికి ఈ దర్శకుడే కావాలి

ఇండియన్ నెంబర్ వన్ దర్శకుడిగా తిరుగులేని ఇమేజ్ తో రాజమౌళి దూసుకుపోతున్నారు.

By:  Tupaki Desk   |   13 Sep 2024 4:19 AM GMT
రాజమౌళి తరువాత అందరికి ఈ దర్శకుడే కావాలి
X

ఇండియన్ నెంబర్ వన్ దర్శకుడిగా తిరుగులేని ఇమేజ్ తో రాజమౌళి దూసుకుపోతున్నారు. అతనితో సినిమా అంటే ఏ హీరో అయిన బల్క్ డేట్స్ ఇచ్చేస్తారు. అంతగా రాజమౌళి కథలపై నమ్మకం ఏర్పడింది. రాజమౌళి సినిమా అంటే ఆడియన్స్ కూడా ముందుగానే పాజిటివ్ ఒపీనియన్ కి వచ్చేస్తారు. జక్కన్నతో మూవీ అంటే సక్సెస్ గ్యారెంటీ అని అనుకుంటారు. ఆ పాజిటివ్ థాట్ తో మూవీస్ చూడటం వలన రాజమౌళి సినిమాలకి ఎక్కువ ఆదరణ లభిస్తోంది.


స్టార్ హీరోలు అందరూ కూడా రాజమౌళి దర్శకత్వంలో ఒక్క సినిమా అయిన చేయాలని భావిస్తారు. రాజమౌళి సినిమాలలో చిన్న క్యారెక్టర్ వచ్చిన చేయడానికి రెడీ అని యంగ్ హీరోలు అంటుంటారు. ఇప్పుడు రాజమౌళి రేంజ్ లోనే మరో దర్శకుడి పేరు ఇండస్ట్రీ సర్కిల్ లో బలంగా వినిపిస్తోంది. హీరోలు అందరూ ఆ దర్శకుడితో మూవీస్ చేయాలని ఆసక్తి చూపిస్తున్నారు. అతనే సందీప్ రెడ్డి వంగా.

అర్జున్ రెడ్డి సినిమాతో దర్శకుడిగా మారిన సందీప్ రెడ్డి వంగా యానిమల్ మూవీతో పాన్ ఇండియా డైరెక్టర్ గా మారిపోయాడు. సందీప్ రెడ్డి కథని చెప్పే విధానం హై రేంజ్ లైన్ లో ఉంటుంది. అతను డిజైన్ చేసిన హీరో పాత్రలు చాలా వైలెంట్ గా ఉంటాయి. అయిన కూడా అవి ప్రేక్షకులకి బాగా కనెక్ట్ అవుతున్నాయి. సందీప్ రెడ్డి కంటెంట్ ని గ్రాఫిక్స్ తో కాకుండా బలమైన క్యారెక్టరైజేషన్ తో ఎలివేట్ చేస్తాడు.

ఇది మన హీరోలకి బాగా నచ్చింది. అందుకే సందీప్ తో మూవీస్ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. సందీప్ రెడ్డి వంగా ప్రస్తుతం ప్రభాస్ తో స్పిరిట్ మూవీ చేయనున్నాడు. అల్లు అర్జున్ మూవీ కూడా కన్ఫర్మ్ అయిపోయి ఉంది. జక్కన్న తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు సందీప్ రెడ్డి దర్శకత్వంలోనే మూవీ చేస్తారంట. అలాగే ఎన్టీఆర్ కూడా రీసెంట్ గా సందీప్ రెడ్డితో చర్చలు జరిపారు. రామ్ చరణ్ కూడా సందీప్ తో సినిమా కోసం సంప్రదింపులు జరుపుతున్నారు.

రాజమౌళితో సినిమాలు చేసిన అగ్ర హీరోలు అందరూ కూడా సందీప్ రెడ్డి దర్శకత్వంలో మూవీస్ చేయడానికి ఆరాటపడుతున్నారు. దీనిని బట్టి అతను ఆడియన్స్ కి, స్టార్ హీరోలకి ఎంతగా కనెక్ట్ అయ్యాడో అర్ధం చేసుకోవచ్చు. అయితే సందీప్ రెడ్డి ఒక్కో సినిమాకి ఏడాది కంటే ఎక్కువ సమయం తీసుకుంటున్నాడు. ప్రభాస్ స్పిరిట్ తర్వాత, రణబీర్ తో యానిమల్ పార్క్ పూర్తి చేస్తానని సందీప్ చెప్పాడు. తరువాత అల్లు అర్జున్ మూవీ ఉండొచ్చు. ఈ మూడు అయ్యాక మహేష్ బాబుతో సినిమా చేసే ఛాన్స్ ఉంది.