Begin typing your search above and press return to search.

స‌మంత‌పై కుర్ర న‌టుడి క్ర‌ష్‌!

`వ‌ర్షం` డైరెక్ట‌ర్ శోభ‌న్ వార‌సుడిగా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన సంతోష్ శోభ‌న్ న‌టుడిగా కొన‌సాగుతోన్న సంగ‌తి తెలిసిందే.

By:  Tupaki Desk   |   9 Oct 2023 2:30 AM GMT
స‌మంత‌పై కుర్ర న‌టుడి క్ర‌ష్‌!
X

`వ‌ర్షం` డైరెక్ట‌ర్ శోభ‌న్ వార‌సుడిగా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన సంతోష్ శోభ‌న్ న‌టుడిగా కొన‌సాగుతోన్న సంగ‌తి తెలిసిందే. అంది వ‌చ్చిన అవ‌కాశం స‌ద్వినియోగం చేసుకుంటున్నాడు. విజ‌యాల సంగ‌తి ప‌క్క‌న‌బెడితే న‌టుడిగా మాత్రం బిజీగానే ఉన్నాడు. వరుస‌గా సినిమాలు చేస్తూ నిత్యం ప్రేక్ష‌కుల నోళ్ల‌లో నానుతున్నాడు. స‌రైన స‌క్సెస్ ప‌డితే గుర్తింపు ప‌దిల‌మ‌వుతుంది.

ఇలా సంతోష్ ఇండ‌స్ట్రీలో పొరాంట చేస్తోన్న స‌మ‌యంలో త‌మ్మ‌డు సంగీత్ శోభ‌న్ కూడా మ్యాడ్ అనే చిత్రంతో వెండి తెర‌కు ప‌రిచ‌మయ్యాడు. అంత‌కు ముందు కొన్ని షార్ట్ ఫిలింస్..వెబ్ సిరీస్ లు లాంటివి చేసాడు. ఎన్టీఆర్ బావ‌మ‌రిది నార్నే నితిన్ హీరోగా న‌టించిన చిత్రం `మ్యాడ్` లో సంగీత్ కామెడీకి ప్రేక్ష‌కుల బాగానే క‌నెక్ట్ అయ్యారు. సంగీత్‌ శోభన్‌ నటనకు ప్రశంసలు వస్తున్నాయి.

ఇదే కంటిన్యూ చేస్తే టాలీవుడ్‌కు మరో జాతిరత్నం దొరికనట్టేనంటూ కామెంట్లు ప‌డుతున్నాయి. తాజాగా యువ న‌టుడు స‌మంతపై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసాడు. మీకు ఏ హీరోయిన్ క్ర‌ష్ అంటే...మ‌రో ఆలోచ‌న లేకుండా ఠ‌కీమ‌ని స‌మంత పేరు చెప్పాడు.`సమంతగారంటే చాలా ఇష్టం. ఓ రకంగా చెప్పాలంటే అంత‌కు మించి. ఆమె మాటలు.. చేసే ఛారిటీస్‌ అన్నీ గొప్పగా ఉంటాయి.

కష్టాల్లో కూడా మనోనిబ్బరంగా నిలబడిన విధానం బాగా న‌చ్చింది. ఆమెని చూసి చాలా విష‌యాలు నేర్చుకున్నాను. ఆ రకంగా స‌మంత గారిని ఎక్కువ‌గా అభిమానుస్తున్నాను` అని అన్నాడు. అలాగే మ‌రిన్ని ఆస‌క్తిక‌ర విష‌యాలు పంచుకున్నాడు. `నేను హీరో మెటిరీయ‌ల్ అని ఇప్ప‌టికీ అనిపించ‌లేదు. నన్ను చూసి.. నా కోసం జనాలు థియేటర్లకు వస్తే అప్పుడు హీరో అనుకోవొచ్చు.

సినిమా బాగుంటే వస్తారు. అప్పుడు నన్ను చూస్తారు. అంతే. నాకు నేనుగా ఏదో అని ఫీలైపోను. అన‌వ‌స‌ర కోరిక‌ల‌కు..ఊహ‌ల‌కు చాలా దూరంగా ఉంటాను. అందులోనూ సినిమా ఇండ‌స్ట్రీలో ఇంకా బ్యాలెన్స్ గా ఉండాలి. నాన్న లా డైరెక్ట‌ర్ అయ్యేంత తెలివి తేట‌లు లేవు. నాది..అన్న‌ది ఒకేదారి. అవ‌కాశాలు వ‌చ్చినంత కాలం సినిమాలు చేసుకుంటూ వెళ్ల‌డ‌మే` అని అన్నాడు.