Begin typing your search above and press return to search.

హీరోలంతా ఇలా పెంచేస్తే ఎలా!

హెయిర్ స్టైల్ విష‌యంలో హీరోలెవ్వ‌రూ త‌గ్గ‌డం లేదు. ఒక‌రికొక‌రు పోటీ ప‌డుతూ మ‌రీ పెంచేస్తున్నారు.

By:  Tupaki Desk   |   25 April 2024 5:30 PM GMT
హీరోలంతా ఇలా పెంచేస్తే ఎలా!
X

హెయిర్ స్టైల్ విష‌యంలో హీరోలెవ్వ‌రూ త‌గ్గ‌డం లేదు. ఒక‌రికొక‌రు పోటీ ప‌డుతూ మ‌రీ పెంచేస్తున్నారు. అందుకోసం కొన్ని నెల‌ల ముందు నుంచే ప్ర‌ణాళిక సిద్ద‌మ‌వుతుంది. సినిమా ప్రారంభం కాబోయే మూడు ..నాలుగు నెల‌ల నుంచి హెయిర్ పెంచే ప్రాస‌స్ మొద‌లుపెడుతున్నారు. తాజాగా కొంత మంది హీరోల్ని ప‌రిశీలిస్తే... ప్ర‌స్తుతం సూపర్ స్టార్ మ‌హేష్ రాజ‌మౌళి సినిమా కోసం లాంగ్ హెయిర్ లో క‌నిపిస్తోన్న సంగ‌తి తెలిసిందే. హెయిర్ లుక్ ఎక్క‌డా లీక్ అవ్వ‌కుండా క్యాప్ పెట్టి క‌వ‌ర్ చేస్తున్నాడు. నేరుగా ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ లోనే రివీల్ చేయాల‌న్న‌ది ప్లాన్.

`గుంటూరు కారం` రిలీజ్ అయిన ద‌గ్గ‌ర నుంచి మ‌హేష్ ఇదే ప‌నిలో ఉన్నాడు. అలాగే చియాన్ విక్ర‌మ్ `తంగ‌లాన్` డిఫ‌రెంట్ హెయిర్ స్టైల్ తో ఆక‌ట్టుకుంటోన్న సంగ‌తి తెలిసిందే. అత‌డి పాత్ర‌ని ఎంతో ర‌ఫ్ గా హైలైట్ చేస్తు పురాత‌న మాన‌వుడి గెట‌ప్ లో తీర్చి దిద్దిన వైనంలో హెయిర్ స్టైల్ కొన్ని వంద‌ల శతాబ్ధాల క్రితం నాటింది. `పొన్నియ‌న్ సెల్వ‌న్` నుంచే విక్ర‌మ్ హెయిర్ పెంచ‌డం మొద‌లు పెట్టాడు. అప్ప‌టి నుంచి ఆ లుక్ అలాగే కనిపిస్తుంది. ఇక యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ `దేవ‌ర` కోసం భారీగానే హెయిర్ పెంచుతున్నాడు.

ఇందులో ఎలాంటి విగ్గులు వాడ‌కుండా తార‌క్ రింగుల జిత్తునే భారీగా పెంచి చూపించాడు. ఆ హెయిర్ స్టైల్ ని తార‌క్ ని కొత్త‌గా ప్ర‌జెంట్ చేస్తుంది. ఇక య‌శ్ `కేజీఎఫ్` రిలీజ్ అయినా అదే లుక్ మెయింటెన్ చేస్తున్నాడు. ఎక్క‌డికి వెళ్లినా లాంగ్ హెయిర్ లోనే క‌నిపిస్తున్నాడు. తాజాగా `టాక్సిక్` లోనూ అదే లుక్ లో క‌నిపించ‌నున్నాడ‌ని తెలుస్తోంది. ఇటీవ‌ల ప్ర‌భాస్ ఫోటోలు కూడా కొన్ని నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. `క‌ల్కీ` కోసం లాంగ్ హెయిర్ పెంచాల్సి వ‌స్తోంది. `బాహుబ‌లి`లో కొంత వ‌ర‌కూ గుబురు హెయిర్ క‌నిపించినా! క‌ల్కీలో హైలైట్ అయినంత‌గా అవ్వ‌లేదు.

అలాగే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ `పుష్ప` ద‌గ్గ‌ర నుంచి లాంగ్ హెయిర్ లోనే క‌నిపిస్తున్నాడు. బేసిక్ గానే లాంగ్ హెయిర్ అంటే బ‌న్నీకి ఇష్టం. ఓ స్టైల్ గా మెయింటెన్ చేస్తుంటాడు. పుష్ప కోసం ప్ర‌త్యేకంగా పెంచాల్సి రావ‌డంతో ఇప్పుడు ఎక్క‌డ చూసినా అదే స్టైల్లో క‌నిపిస్తున్నాడు. అలాగే కోలీవుడ్ హీరో సూర్య కూడా `కంగువ` లో లాంగ్ హెయిర్ లో క‌నిపిస్తోన్న సంగ‌తి తెలిసిందే. `సెవెన్త్ సెన్స్` త‌ర్వాత సూర్య లాంగ్ హెయిర్ జోలికి వెళ్లింది లేదు. మ‌ళ్లీ కంగువ కోసమే డిఫ‌రెంట్ గా మేకోవ‌ర్ అవ్వాల్సి వ‌చ్చింది. ఇంకా యంగ్ హీరో నిఖిల్ కూడా `స్వ‌యంభు` కోసం భారీగానే హెయిర్ పెంచి ప‌నిచేస్తున్నాడు. ఇది కూడా పీరియాడిక్ సినిమా కావ‌డంతో త‌ప్ప‌డం లేదు. తొలి సినిమా హ్యాపీడేస్ లోనూ లాంగ్ హెయిర్ లో క‌నిపించిన సంగ‌తి తెలిసిందే.