Begin typing your search above and press return to search.

65 ఎక‌రాల ఫామ్ హౌస్ లో ఒక్క‌డినే పిశాచిలా ఉంటా!

క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ శ్రీకాంత్ అయ్యంగార్ సుప‌రిచితుడే. వైవిథ్య‌మైన న‌ట‌న‌తో త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన గుర్తింపు ద‌క్కించుకున్న న‌టుడాయ‌న‌.

By:  Tupaki Desk   |   23 Sep 2023 5:35 AM GMT
65 ఎక‌రాల ఫామ్ హౌస్ లో ఒక్క‌డినే పిశాచిలా ఉంటా!
X

క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ శ్రీకాంత్ అయ్యంగార్ సుప‌రిచితుడే. వైవిథ్య‌మైన న‌ట‌న‌తో త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన గుర్తింపు ద‌క్కించుకున్న న‌టుడాయ‌న‌. ముఖ్యంగా వ‌ర్మ సినిమాల‌తో బాగా ఫేమ‌స్ అయ్యారు. వ‌ర్మ ఫిలాస‌ఫీని అనుస‌రించ‌డం ఆయ‌న ప్ర‌త్యేక‌త‌. శ్రీకాంత్ జీవితం కూడా వ‌ర్మ జీవితానికి చాలా ద‌గ్గ‌ర‌గా ఉంటుంది. తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో శ్రీకాంత్ అయ్యంగార్ త‌న ఒంట‌రి జీవితం గురించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసారు. ఆ వేంటో ఆయ‌న మాట‌ల్లోనే..

`65 ఎక‌రాల లే అవుట్ ఉంది. దాంట్లో ఓ ఇల్లు ఉంది. అందులో ఉంటున్నా. చాలా డిప్రెష‌న్ గా ఉంది. ఓయూ కాల‌నీలో ఉంటే టీ తాగడానికి వెళ్తే సెల్పీ..గిల్పీ అంటారు. మంచి న‌టుడ‌ని పేరు సంపాదించు కోవాల‌నుకున్నా. కానీ ఇలాంటి అటెన్ష‌న్ లు వ‌ద్దు.సార్ సార్ సెల్పీ అంటే నాకొద్దు ...న‌న్ను వ‌దిలేయండి అనిపిస్తుంది. అందుకే అక్క‌డ ఉండ‌లేక‌పోయా. నాకు ఎలాగూ స్థిర‌త్వం లేదు.

ఏం చేయాలో అర్దం కావ‌డం లేదు. ఒంట‌రిత‌నం మామూలుగా లేదు. అది ఎలా ఉందంటే? అరే శ్రీకాంత్ గాడ్ని ఈవాళ ప‌ట్టుకుందాం అని వెంటాడుతుంది. ప్ర‌తీ రోజు పండ‌గే సినిమా చేసిన వాడిని..ప్ర‌తీ రోజు దాడి చేస్తుంది. బాగా సైకాటిక్ అయిపోతున్నా. పెన్ను ప‌ట్టుకుని రాస్తున్నా. రాసేదంతా బ్లూ డార్క్. వైరాగ్యం దాటిన స్టేజ్ లో ఏదో రాసేస్తున్నా. ఇది కాదు రా నువ్వు..ఇంకా లోన్లీగా వెళ్లిపో..చూద్దాం ఏమ‌వుతుందో? అందుకే అంత దూరం పోయాను.

కిలోమీట‌ర్ల మేర ఏం ఉడ‌దు. రాత్రిపూట జీరో. ఒంట‌రి త‌నంతో అక్క‌డ‌కి రావాలంటే కా..పోతుంది. సంఘ‌జీవి అనే కాన్సెప్ట్ నాలో లేదు. నేను మ‌నిషేనా? అని నాకే అనిపిస్తుంది. నేను ఎవ‌రినైనా స‌ల‌హా అడిగితే 27 ఏళ్ల క్రితం ఉన్న స‌ల‌హాలు..సొల్యూష‌న్లు ఇస్తారు. వాళ్లు ఇంకా బీసీ కాలంలోనే ఉన్నారు. నా జీవితం చాలా చిన్న‌ది. గాళ్ల్ ప్రెండ్..వైఫ్ ఉంటే ఫోన్ చేసి అన్ని అడిగేది. కానీ నాజీవితం లో అదిలేదు. ఒక విధంగా అది అద్భుతం..మ‌రో విధంగా అది జీవితం శూన్యం.

జ‌న‌వ‌రిలో బ్యాక్ పెయిన్ ఎక్కువైంది. మంచానికి బ‌ల్లిలా అతుక్కుపోయా. మైండ్ పోయింది. మళ్లీ పీపాలు పీపాలు తాగ‌డం మొద‌లు పెట్టా. మ‌ళ్లీ గ్యాప్ ఇచ్చి ఎక్స‌ర్ సైజ్ లు మొద‌లు పెట్టా. ఒక వ్య‌క్తి ఆలోచించే విధానం చూస్తే లాజిక్ గానే ఉన్నాను అనిపిస్తుంది. కానీ ఎమెష‌న‌ల్ పార్ట్ ఒక‌టుంది. అది ఎంత దారుణంగా ఉంటుందంటే మ‌న‌సును న‌లిపేసి పిసికేస్తుంది.

నాకు ఇప్ప‌టికే 50.. ఇంకో 55 ఏళ్ల మ‌హిళ‌ని పెళ్లి చేసుకుంటే.. ఆమెకి ఓ ప్లాష్ బ్యాక్ ఉంటుంది. ఆమె కూడా చితికిపోయి వ‌చ్చి ఉంటుంది. అలాంటావిడ‌ని పెళ్లి చేసుకుని బాధ‌లు చెప్ప‌డం మొద‌లు పెడితే త‌ట్టుకోవ‌డం సాధ్య‌మ‌య్యే ప‌నికాదు. నా జీవిత‌మే ఒక మెగా సీరియ‌ల్. అలా కాకుండా ఆమె ఉండాల‌ని నేను అనుకోవ‌డం త‌ప్పు. పెద్ద రోల‌ర్ కింద న‌లిగిన జీవితం..చిన్న రోల‌ర్ కింద న‌లిగిన రెండు జీవితాలు అతుక్కోవ‌డం అంటే క‌ష్టం. అలిగితే బంగారం..బేబిలు అని చెప్పే ఓపిక లేదు. నాతో బ్ర‌త‌క‌డం ఎంత క‌ష్ట‌మో నాకే తెలుసు. నా బుర్ర‌...గుండె ఎప్పుడో షార్ట్ స‌ర్క్యూట్ కి గుర‌య్యాయి. నేను మాన‌సికంగా బ‌లంగా ఉన్నా..కానీ కొన్ని విష‌యాల్లో చాలా బ‌ల‌హీనంగానూ ఉన్నాను` అని అన్నారు.