సునీల్ తనని తాను తగ్గించుకుంటున్నాడా.. ఎందుకిలా..!
కమెడియన్ నుంచి హీరోగా మారి ఇలా అయితే కష్టమని మళ్లీ కమెడియన్ గా సినిమాలు చేస్తున్న సునీల్ కొత్తగా విలనిజం ని చూపిస్తూ అదరగొట్టేస్తున్నాడు.
By: Tupaki Desk | 5 Nov 2023 2:30 PM GMTకమెడియన్ నుంచి హీరోగా మారి ఇలా అయితే కష్టమని మళ్లీ కమెడియన్ గా సినిమాలు చేస్తున్న సునీల్ కొత్తగా విలనిజం ని చూపిస్తూ అదరగొట్టేస్తున్నాడు. సునీల్ ని కేవలం కమెడియన్ గానే ఎందుకు చూడాలని మేకర్స్ ఆయన్ని విలక్షణ పాత్రల్లో చూపిస్తున్నారు. తెలుగులో సునీల్ విలనిజం కన్నా తమిళ వాళ్లు ఎక్కువ ఆదరిస్తున్నారు. ఈమధ్య వచ్చిన ప్రతి తమిళ సినిమాలో సునీల్ నటించి మెప్పించాడు.
రజినికాంత్ జైలర్ నుంచి సునీల్ శివ కార్తికేయన్ మహావీరన్, విశాల్ మార్క్ ఆంటోని ఇప్పుడు కార్తీ హీరోగా చేసిన జపాన్ లో కూడా నటించాడు. ఈ సినిమాలన్నీ సునీల్ కెరీర్ కి బాగా ఉపయోగపడుతున్నాయని చెప్పొచ్చు. అంతా బాగానే ఉంది కానీ తమిళ సినిమాల ప్రమోషనల్ స్పీచ్ లో సునీల్ మాట్లాడుతున్న విధానం ఆడియన్స్ ని ఆశ్చర్యానికి గురి చేస్తుంది.
స్టార్ కమెడియన్ గా తెలుగులో స్టార్ డం తెచ్చుకున్న సునీల్ తమిళ ఆడియన్స్ కి కొత్తేమో కానీ అతని రేంజ్ వేరే లెవెల్. అలాంటిది తమిళ సినిమా ఆఫర్ల గురించి చెబుతూ అదేదో తను కొత్తగా ఇండస్ట్రీకి వచ్చినా తనకి ఓనమాలు దిద్ది నటింపచేస్తున్నారన్నట్టు చెబుతున్నాడు సునీల్. అంటే రాని భాషలో రాణించాలంటే కచ్చితంగా మేకర్స్ సపోర్ట్ ఉండాల్సిందే. అలా అని సునీల్ తనను తాను తగ్గించుకునేంత చిన్నవాడేమి కాదు.
మరి సునీల్ ఎందుకు తమిళ ఆఫర్ల మీద అలా రియాక్ట్ అవుతున్నారో తెలియాల్సి ఉంది. హైదరాబాద్ ఇల్లైతే చెన్నై టెంపుల్ అంటూ చెప్పడం వరకు బాగున్నా తనేదో కొత్త నటుడిని ఇప్పుడిప్పుడే సినిమాలు చేస్తున్నా అనేలా సునీల్ మాట్లాడటం మాత్రం ఆయన ఫ్యాన్స్ ని డిజప్పాయింట్ చేస్తుంది. సునీల్ ఇది కాస్త గమనించి తానొక స్టార్ కమెడియన్ అనే విషయాన్ని గుర్తించి మాట్లాడితే బెటర్ అని చెప్పొచ్చు. తమిళ సినిమాలే కాదు లేటెస్ట్ గా కన్నడలో మ్యాక్స్ సినిమా లో ఛాన్స్ అందుకున్నాడు సునీల్. తనకు వస్తున్న ఈ ఛాన్స్ ల పరంగా సునీల్ తన కెరీర్ లో ఎప్పుడు లేనంతగా డిమాండ్ చేస్తున్నాడని తెలుస్తుంది.
సునీల్ కొత్త కొత్త పాత్రలతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూ కెరీర్ గ్రాఫ్ పెంచుకుంటూ వెళ్తున్నాడు. తెలుగులో కూడా సునీల్ కి మంచి పాత్రలు వస్తున్నాయని తెలుస్తుంది. పుష్ప 2 తో పాటుగా మహేష్ గుంటూరు కారం లో కూడా సునీల్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాడని తెలుస్తుంది. ఈ రెండు సినిమాలే కాదు తెలుగులో కూడా అరడజను సినిమాల దాకా ఉన్నాయని టాక్.